• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

facebook lover: భర్తతో విడాకులు, ప్రియుడితో విదేశాల్లో హనీమూన్, థ్రిల్లర్ లవ్ స్టోరి, అబ్బా...లోకేష్

|

చెన్నై/ కన్యాకుమారి: టైమ్ బాగలేక పెళ్లైన మూడు నెలలకే యువతి భర్త ఆమెతో విడాకులు తీసుకున్నాడు. భర్త వదిలేయడంతో పట్టుదలగా ఫ్యాషన్ డిజైనర్ గా చేతినిండా డబ్బులు సంపాధిస్తున్న సమయంలో ఆమెకు ముల్లోకాలు తిరిగేసిన లోకేష్ ఫేస్ బుక్ లో పరిచయం అయ్యాడు. నీకు స్వర్గం చూపిస్తా అంటూ ఆమెతో విదేశాలకు తిరిగి ఎంజాయ్ చేశాడు. వ్యాపారం చెయ్యాలని నమ్మించిన ప్రియుడు ఫ్యాషన్ డిజైనర్ దగ్గర రూ. 20 లక్షల బంగారు నగలు, కారు, ఖర్చులకు రూ. 5 లక్షలు తీసుకున్నాడు. పెళ్లి చేసుకోమంటే నీ నగ్న వీడియోలు సోషల్ మీడియాలో పెడుతా. నీ పరువు బజారులో పడి అప్పుడు నువ్వు అడుక్కుతింటావ్ అని బ్లాక్ మెయిల్ చేశాడు. మామగారు ఎంట్రీతో లోకేష్ కు మూడు చెరువుల నీళ్లు తాగించి ముప్పుతిప్పలు పెట్టడంతో అబ్బా అబ్బా అంటున్నాడు.

Innocent Wife: భార్యపై అనుమానం, 17 ఏళ్లు కబోడ్ లో దాక్కొని భర్త ఏం చేశాడంటే ? ప్రపంచంలో !

పాపం.... మూడు నెలలకే విడాకులు

పాపం.... మూడు నెలలకే విడాకులు

తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా, కొట్టారాంలోని పెరుమాల్ పురంలో నివాసం ఉంటున్న 28 ఏళ్ల యువతికి 2013లో రాజశేఖరన్ అనే యువకుడితో వివాహం అయ్యింది. పెళ్లి జరిగిన వారం రోజుల నుంచి దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. తప్పు ఎవరిదో ? ఏమో ? తెలీదు కాని మూడు నెలలకే రాజశేఖరన్ దంపతులు విడాకులు తీసుకున్నారు.

ఫ్యాషన్ డిజైనర్

ఫ్యాషన్ డిజైనర్

భర్తతో విడాకులు తీసుకున్న యువతి పట్టుదలతో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ పూర్తి చేసింది. కన్యాకుమారిలో ఫ్యాషన్ డిజైనర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆ యువతి చేతినిండా డబ్బులు సంపాధిస్తోంది. ఆ యువతి కన్యాకుమారి జిల్లాతో పాటు తమిళనాడులో ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్ మంచి పేరు తెచ్చుకుంది.

ఫేస్ బుక్ లో కాంచనమాల కేబుల్ టీవీ

ఫేస్ బుక్ లో కాంచనమాల కేబుల్ టీవీ

మూడు సంవత్సరాల క్రితం సొంతంగా కేబుల్ టీవీ ఆపర్ రేటర్ కంపెనీ నిర్వహిస్తున్న లోకేష్ కుమార్ (28) అనే యువకుడు ఫ్యాషన్ డిజైనర్ కు ఫేస్ బుక్ లో పరిచయం అయ్యాడు. తరువాత ఇద్దరూ సోషల్ మీడియాలో చాటింగ్ చేసుకుంటూ దగ్గర అయ్యారు. ఫ్యాషన్ డిజైనర్ భర్తతో విడాకులు తీసుకుందని, చేతినిండా డబ్బులు సంపాధిస్తోందని లోకేష్ కుమార్ కు తెలిసింది.

 ఇండియా చాలదని విదేశాల్లో ఎంజాయ్

ఇండియా చాలదని విదేశాల్లో ఎంజాయ్

ప్రేమ, పెళ్లి పేరుతో ఫ్యాషన్ డిజైనర్ కు లోకేష్ కుమార్ దగ్గర అయ్యాడు. నిన్ను రెండో పెళ్లి చేసుకుంటానని, పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటానని ఆమెను లోకేష్ కుమార్ నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని లోకేష్ కుమార్ మాయమాటలు చెప్పడంతో ఆమె అతనికి శారీరకంగా దగ్గర అయ్యింది. అయితే లోకేష్ కుమార్ ఆమెను పెళ్లి చేసుకోలేదు. అంతే భారతదేశంలోని అనేక పర్యాటక ప్రాంతాలు తిరిగేశారు. ఇక్కడ చాలదని నిత్యం విదేశాలకు ఫ్యాషన్ డిజైనర్ తో వెళ్లిన లోకేష్ కుమార్ ఆమెతో ఇంతకాలం ఎంజాయ్ చేశాడు. ఒంటరిగా ఉంటున్న ఫ్యాషన్ డిజైనర్ ఇంటిలోనే లోకేష్ కుమార్ కాపురం పెట్టాడు.

డార్లింగ్... డార్లింగ్ అంటూనే ?

డార్లింగ్... డార్లింగ్ అంటూనే ?

యువతి తనను పూర్తిగా నమ్మిందని గ్రహించిన లోకేష్ కుమార్ డార్లింగ్ నేను కేబుల్ టీవీ కంపెనీని మరింత పైకి తీసుకువస్తానని, తనకు డబ్బులు సహాయం చెయ్యాలని చెప్పాడు. యువతి దగ్గర ఉన్న సుమారు రూ. 15 లక్షల బంగారు నగలు తీసుకుని బ్యాంకులో కుదవపెట్టాడు. తరువాత తిరగడానికి ఖరీదైన కారు కావాలని ఆమె దగ్గర కొనిపించాడు. కంపెనీ పనుల మీద బయట తిరగడానికి ఖర్చులకు రూ. 5 లక్షలు కావాలని తీసుకున్నాడు. అయితే పెళ్లి విషయం ఎత్తితే మాత్రం లోకేష్ కుమార్ తప్పించుకుని తిరగడం మొదలుపెట్టాడు.

రొటిన్ పాత సినిమా డైలాగ్

రొటిన్ పాత సినిమా డైలాగ్

లోకేష్ కుమార్ తప్పించుని తిరగడంతో ఫ్యాషన్ డిజైనర్ కు అనుమానం వచ్చింది. నన్ను పెళ్లి చేసుకుంటావా ? లేదా ? అని లోకేష్ కుమార్ ను నిలదీసింది. తాను నిన్ను పెళ్లి చేసుకోనని, మా ఇంట్లో చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని, నువ్వు ఎవ్వరితో చెప్పుకున్నా నేను భయపడనని లోకేష్ కుమార్ పాత సినిమా డైలాగ్ చెప్పాడు. లోకేష్ కుమార్ ఎదురు తిరగడంతో ఫ్యాషన్ డిజైనర్ షాక్ కు గురైయ్యింది.

 ఏమే రంకులాడి, ఈ నగ్న వీడియోలు చూడు

ఏమే రంకులాడి, ఈ నగ్న వీడియోలు చూడు

ప్రియుడు లోకేష్ కుమార్ ఎదురు తిరగడంతో ఫ్యాషన్ డిజైనర్ నేరుగా అతని ఇంటికి వెళ్లి న్యాయం చెయ్యాలని అతని కుటుంబ సభ్యులకు చెప్పింది. అయితే పాత సినిమాల్లో సూర్యకాంతంలాగా లోకేష్ కుమార్ తల్లి గీతా కుమారి ఎంట్రీ ఇచ్చింది. ఏమే టక్కులాడి, మా వాడితే విదేశాల్లో తిరిగి నగ్న వీడియోలు తీసుకున్నావ్, ఇప్పుడు నేరుగా నా ఇంటికే వస్తావా ? ఆ వీడియోలు సోషల్ మీడియాలో పెడుతా, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్లిపో అని బెదిరించింది.

  Bithiri Sathi Live Video, తన ఫ్యాన్స్ ని క్షమాపణ కోరిన బిత్తిరి సత్తి || Oneindia Telugu
   మామల ఎంట్రీతో మసాలా సినిమా

  మామల ఎంట్రీతో మసాలా సినిమా

  డబ్బులు, కారు, నగలు లాక్కొన్న లోకేష్ కుమార్ తనను నిలువునా మోసం చేశాడని, న్యాయం చెయ్యాలని అడిగితే అతని తల్లి గీతా కుమారి, మామ అయ్యస్వామి, లోకేష్ కుమార్ స్నేహితుడు ప్రదీప్ నా రహస్య వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని బెదిరిస్తున్నారని ఫ్యాషన్ డిజైనర్ కన్యాకుమారి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు లోకేష్ కుమార్ ను అరెస్టు చేసి బెండ్ తీసి ముల్లోకాలు తిప్పి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు.

  English summary
  facebook lover blackmail: Youth arrested under cheating case near Kanniyakumari in Tamil Nadu.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X