వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫేస్‌బుక్‌లో ఎంగేజ్‌మెంట్ ఫొటోలు పెట్టి.. కటకటాల పాలయ్యాడు

|
Google Oneindia TeluguNews

కోజికోడ్: తన నిశ్చితార్థం ఫొటోలను తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేసి అరెస్టయ్యాడు ఓ ప్రబద్ధుడు. అదేలగంటే.. ఆ యువకుడు పోస్టు చేసిన నిశ్చితార్థం ఫొటోలను చూసిన అతని ప్రియురాలు.. తనను పెళ్లి చేసుకుంటానని మోసం మరో అమ్మాయిని వివాహం చేసుకుంటున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సదరు యువకుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు జైలుకు తరలించారు.

తనను వివాహం చేసుకుంటానని చెప్పి.. పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని బాధిత యువతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. కూరచుండు ప్రాంతానికి చెందిన నిందితుడు ఎం షమీర్(29)ని బాధిత యువతి ఫిర్యాదు చేసిన రెండు రోజులకు అరెస్ట్ చేశారు.

Facebook post about engagement lands man in trouble in Kerala

తనను వివాహం చేసుకుంటానని చెప్పి మరో యువతితో వివాహానికి సిద్ధమవడంతో బాధిత యువతి ఆందోళనకు గురైందని పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఆ యువతి.. ప్రియుడి ఇంటికెళ్లి గొడవకు దిగిందని, పోలీసులు రావడంతో నిందితుడిపై ఫిర్యాదు చేసిందని చెప్పారు.

నిందితుడిపై అత్యాచార నేరం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు షమీర్‌ను కోర్టులో ప్రవేశపెట్టినట్లు తెలిపారు. నిందితుడికి 14 రోజుల జుడీషియల్ కస్టడీ విధించినట్లు పోలీసులు చెప్పారు.

English summary
A 29-year-old man, who posted about his engagement on his Facebook account, has landed in trouble as his former girlfriend registered a complaint against him for allegedly raping her on the pretext of marriage.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X