• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సుడి అంటే ఇతడిదే: భార్యే, ఫేస్‌బుక్‌‌ ప్రియురాలుగా

By Nageswara Rao
|

లక్నో: సోషల్ మీడియా వెబ్‌సైట్‌గా పేరుగాంచిన ఫేస్‌బుక్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఇంటర్నెట్‌లో ఫేస్‌బుక్ ఓ సంచలనమని చెప్పవచ్చు. ఎందుకంటే ఎంతో మందికి ఎన్నో రకాలుగా ఈ ఫేస్‌బుక్ ఉపయోగపడుతోంది. చిన్నప్పుడు తప్పిన పోయిన ఒకరిద్దరిని తల్లిదండ్రుల వద్దకు చేర్చడంలో కీలకపాత్ర పోషించింది.

ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో కూడా ఫేస్‌బుక్ తన వంతుగా పనిచేస్తోంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఫెస్‌బుక్ వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. అయితే తాజాగా ఫేస్‌బుక్‌లో తన భార్యే, ప్రియురాలిగా మారి తనతో చాటింగ్ చేసిన ఆసక్తికర సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ ప్రాంతానికి చెందిన ఓ జంట మధ్య ఫేస్‌బుక్‌లో స్నేహం చిగురించింది. ఇలా కొన్ని నెలల పాటు సాగిన ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. దీంతో ఇద్దరూ బరేలీలోని ఓ రెస్టారెంట్‌లో కలవాలని అనుకున్నారు. ఇంకేముంది ఇద్దరూ అందంగా ముస్తాబై రెస్టారెంట్‌లో ఒకరికొకరు ఎదురు పడగానే అవాక్కయ్యారు.

Facebook romance turns sour, 'girlfriend' turns out to be man's wife

అసలు విషయమేమిటంటే వారిద్దరూ భార్యభర్తలు కావడమే. బరేలీలో నివాసం ఉంటున్న వీరిద్దరికీ కొంతకాలంగా ఒకరంటే ఒకరికి పడడం లేదు. దీంతో ఇద్దరూ ఫేస్‌బుక్‌లో తమ మనసుకు తగ్గ వారిని చూసుకోవాలని పేర్లు మార్చుకుని, ప్రొపైల్ పిక్‌గా బాలీవుడ్ నటుల ఫోటోలు పెట్టి నకిలీ ఖాతాలను తెరిచారు.

ఫేస్‌బుక్ చాటింగ్‌లో భాగంగా అదృష్టం కొద్దీ మళ్లీ వారిద్దరే స్నేహితులుగా మారారు. దీంతో తన భార్యే తనకు ప్రియురాలిగా ఫేస్‌బుక్‌లో మారడంతో రెస్టారెంట్‌లోనే ఇద్దరూ గొడవకు దిగారు. ఒకరిపై మరొకరు నిందించికుంటూ పెద్దగా కేకలు వేయడం మొదలు పెట్టారు. ఈ సమయంలో రెస్టారెంట్ సిబ్బంది వారిద్దరినీ వారించినా ప్రయోజనం లేకపోయింది.

దీంతో పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు వెంటనే వారిద్దరిని అదుపులోకి తీసుకుని ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్‌కు తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపారు. ఈ విషయంపై పోలీసులు మాట్లాడుతూ నిజ జీవితంలో ఇలాంటి సంఘటన చాలా అరుదుగా జరుగుతుందన్నారు.

అదృష్టం బాగోపోతేనే ఇలాంటివి జరుగుతాయని, అయితే దంపతులిద్దరిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని కొట్వాలీ పోలీస్ స్టేషన్ సీఐ ముకుల్ ద్వివేది తెలిపారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
According to a report, a couple from Bareilly chose Facebook to lighten up their shattered lives and find 'someone interesting' to hang out with and conversation began between them. But after three months of chatting they decided to meet at a restaurant in Bareilly and what they found amazed them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more