• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అమ్మాయిల ఫేస్‌బుక్ ఫొటోలు ఫోర్న్ సైట్లలోకి!

|

న్యూఢిల్లీ/తిరువనంతపురం: సోషల్ మీడియాలో అందమైన అమ్మాయిలు పెట్టుకునే సరదా ఫొటోలను హ్యాక్ చేస్తున్న కొందరు దుండగులు పోర్న్ సైట్లలో పెట్టి దారుణాలకు పాల్పడుతున్నారు. ఈ విధమైన నేరాలకు పాల్పడుతున్న వారి గురించి కేరళకు చెందిన ఓ ఎథికల్ హ్యాకర్ల గ్రూపు బహిర్గతం చేసింది.

ఈ నేపథ్యంలో ఫేస్‍బుక్, ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాలను ఉపయోగించే యువత కొంత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. కొందరు హ్యాకర్లు ఇలా మహిళల ఫొటోలను వాడడం ద్వారా అశ్లీల వెబ్‌సైట్ల వీక్షకులను ఆకర్షిస్తున్నారు. ఈ విధంగా బాధితులుగా మారుతున్న మహిళల్లో భారతలోనే 40 శాతం ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా, కేవలం ఫేస్‌బుక్‌ నుంచే కాకుండా బస్టాప్‌లు వంటి బహిరంగ ప్రదేశాల్లో కూడా అమ్మాయిల ఫొటోలను స్మార్ట్‌ఫోన్లు, కెమెరాల ద్వారా తీసుకొని దుండగులు వాటిని అశ్లీల వెబ్‌సైట్లలో మార్ఫింగ్ చేసి పెడుతున్నట్లు ఎథికల్‌ హ్యాకర్స్‌ తేల్చారు.

 Facebook sex gig: Your pics are being misused to promote online porn

సోషల్‌ మీడియాలో ఇలాంటి పేజీలు చాలా ఉన్నాయని, కానీ పోలీసులకు వీటిని అరికట్టడం పెద్ద పనేమీ కాదని కిస్లే చౌదరి అనే సైబర్‌ క్రైం నిపుణుడు తెలిపారు. ఈయన ఢిల్లీ, నోయిడాల్లో పలు కేసుల్లో పోలీసులతో కలిసి పనిచేశారు.

వైట్‌ హ్యాట్‌ హ్యాకర్స్‌ ఆఫ్‌ కేరళ సైబర్‌ వారియర్స్‌ పేరిట 15 మందితో కూడిన ఓ బృందం 2015 డిసెంబర్‌ 28 నుంచే 70 నకిలీ ఫేస్‌బుక్‌ ప్రొఫైల్స్‌ను, డజన్ల సంఖ్యలో పేజీలను గుర్తించి బహిర్గతం చేసింది.

అమాయకులైన అమ్మాయిలకు చెందిన అభ్యంతరకర ఫొటోలు, పోస్టింగ్‌ల తొలగింపే లక్ష్యంగా తాము పనిచేస్తున్నట్లు ఈ బృందం తెలిపింది. ఇటీవల ఆన్‌లైన్‌ సెక్స్‌ రాకెట్‌ నడుపుతున్న 11 మందిని వీరు అరెస్టు చేయించారు. వీరిలో ఓ మోడల్‌, ఆమె భర్త కూడా ఉండటం గమనార్హం. ఇది ఇలా ఉండగా, ‘కొచ్చు సుందరికల్‌' ఫేస్‌బుక్‌ పేజీపై దర్యాప్తు జరుగుతోంది.

English summary
Love putting up your best photos on Facebook? Beware! Your pictures may be among several thousands that are being morphed and misused to promote online sex chats and pornographic content.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X