వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫేస్‌బుక్‌‌లో కనిపించని రైతు ఉద్యమ పేజీ, ఆందోళన.. తర్వాత రీ స్టోర్.. ఎందుకంటే..

|
Google Oneindia TeluguNews

వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై అన్నదాతల ఆందోళన కొనసాగుతోంది. చట్టానికి సవరణలు చేయాలని.. లేదంటే రద్దు చేయాలని కోరుతున్నారు. తమ నిరసనను సోషల్ మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నారు. ఫేస్‌బుక్‌లో పేజీ క్రియేట్ చేసి.. లైవ్ స్ట్రీమింగ్ కూడా ఇచ్చారు. అయితే అదీ నిన్న సాయంత్రం కాసేపు కనిపించలేదు. దీంతో ఏం జరిగిందనే చర్చ జరిగింది. కిసాన్ మోర్చా ప్రతినిధులు కూడా కన్నేశారు. తర్వాత ఏం జరిగిందో ఫేస్‌బుక్ వివరణ ఇచ్చింది.

94 లక్షల మంది ప్రజలు

94 లక్షల మంది ప్రజలు

రైతు సమస్యలపై ఫేస్‌బుక్‌లో ఓ పేజీని కిసాన్ సంయుక్త్ మోర్చాకు చెందిన ఐటీ విభాగం ఏర్పాటు చేసింది. ఆ పేజీకి యూజర్ల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. 94 లక్షల మందికి రీచ్ కూడా అయ్యింది. ఆదివారం సాయంత్రం లైవ్ స్ట్రీమ్ కూడా జరుగుతోంది. ఇంతలో పేజీ కనిపించలేదు. దీంతో సంయుక్త్ కిసాన్ మోర్చా ఆందోళనకు గురయ్యింది. అయితే కాసేపటి ఫేస్ బుక్‌లో పేజీ కనిపించింది.

కనిపించని పేజీ..

కనిపించని పేజీ..

పేజీ కనిపించడంతో ఊరట కనిపించినా.. ఎందుకు తొలగించారని నెటిజన్లు ప్రశ్నించారు. పేజీని కనిపించకుండా చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని అడిగారు. జరిగిన అంతరాయానికి చింతిస్తున్నామని ఫేస్‌బుక్ యాజమాన్యం తెలిపింది. అయితే ఎందుకు స్తంభించి పోయిందో మాత్రం తెలియజేయలేదు. కానీ ఎఫ్‌బీపై మాత్రం రైతులకు అనుకూలంగా ఉండేవారు మాత్రం దుమ్మెత్తిపోస్తున్నారు. అసలేం జరుగుతుంది అంటూ ప్రశ్నిస్తున్నారు.

అహోరాత్రులు వాలంటీర్ల శ్రమ..

అహోరాత్రులు వాలంటీర్ల శ్రమ..

25 మంది ఆన్ లైన్, 35 మంది ఆఫ్ లైన్ వాలంటీర్ల నిరంతరాయంగా పనిచేస్తున్నారు. 24/7 వారు కష్టపడి ఆన్ లైన్ డిస్కషన్స్, రైతుల నిరసనలపై తప్పుడు పోస్టులను ప్రజలకు తెలియజేస్తున్నారు. ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగ్రామ్, స్నాప్‌చాట్, యూ ట్యూబ్‌లలో వాస్తవ సమాచారం అందజేస్తున్నారు. ఇవీ ప్రతీరోజు లక్షలాది మంది ప్రజలకు చేరుతోంది. ఇందులో పనిచేస్తోన్న చాలా మంది వాలంటీర్లు పంజాబ్, ఢిల్లీ నుంచి ఉన్నారు. చాలా మంది వర్క్ ఫ్రం హోం చేస్తూ.. సమస్యను ప్రజలకు తెలియజేస్తున్నారు.

English summary
Facebook page, which was set up by farmer organisations’ “IT Cell” to “counter misinformation”, was taken down by Facebook on Sunday for a few hours.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X