వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Fact check : వొడ్కా తాగితే కరోనా రిస్క్ తగ్గుతుందా...?

|
Google Oneindia TeluguNews

'మద్యం సేవిస్తే కరోనా వైరస్ రాకుండా ఉంటుందా...? వొడ్కా తాగితే వైరస్ సోకే అవకాశాలు తగ్గుతాయా..? అమెరికాకు చెందిన ప్రముఖ సెయింట్ ల్యూక్స్ ఆస్పత్రి దీనికి అవుననే సమాధానం చెబుతోంది.' అంటూ సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతోంది.

దీనికి సంబంధించి ఈ ఏడాది మార్చి నెలలో ఓ సెయింట్ ల్యూక్స్ విడుదల చేసినట్లుగా ఓ లేఖ వెలుగుచూసింది. తాజాగా దీనిపై స్పందించిన సెయింట్ ల్యూక్స్ ఆ ప్రచారాన్ని కొట్టిపారేసింది. తమ ఆస్పత్రి యాజమాన్యం అలాంటి లేఖలేవీ విడుదల చేయలేదని వివరణ ఇచ్చింది. మద్యం సేవిస్తే కోవిడ్ 19 రిస్క్ తక్కువ అన్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేసింది.

Fact check: Does Vodka prevent COVID-19

అంతేకాదు,మద్యం సేవించడం ద్వారా శ్వాసమార్గంపై దుష్ప్రభావం పడుతుందని... శ్వాసకోశ సమస్యలకు దారితీసే అవకాశం ఉంటుందని తెలిపింది. మద్యం సేవించడం వల్ల ఊపిరితిత్తుల్లోని తెల్ల రక్త కణాల సంఖ్య కూడా తగ్గుతుందని స్పష్టం చేసింది.

Recommended Video

Sourav Ganguly In Home Quarantine After His Brother Tests Covid-19 Positive || Oneindia Telugu

అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్(CDC) ఆల్కాహాల్‌ను కేవలం శానిటైజర్స్ తయారీ కోసం వాడేందుకు మాత్రమే సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. కరోనా వ్యాప్తి చెందకుండా శానిటైజర్ వాడాలని సూచించింది. అలాగే ప్రతీ ఒక్కరూ సోప్‌తో 20 సెకండ్ల పాటు చేతులను శుభ్రపరుచుకోవాలని సూచించింది.

English summary
A letter from a famous US hospital, St Lukes has re-surfaced again, claiming that drinking alcohol, especially Vodka can help reduce the risk of getting COVID-19.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X