వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Fact check : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల అలవెన్సుల్లో కోత పెట్టబోతున్నారా?

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రకరకాల ఫేక్ న్యూస్ పుట్టుకొస్తూనే ఉన్నాయి. వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు,ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు అనుసరిస్తున్న వ్యూహాలపై పలు నిరాధార కథనాలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా మరో కొత్త ఫేక్ న్యూస్ పుట్టుకొచ్చింది. ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే ప్రయాణ రాయితీ(ఎల్‌టీసీ) సహా పలు అలవెన్సుల్లో మోదీ సర్కార్ కోత విధించబోతుందని హిందీలో ఓ వార్తా కథనం వెలువడింది.

Recommended Video

Fake News Buster : 18 కేంద్ర ప్రభత్వ ఉద్యోగులారా.. కంగారు పడొద్దు !

fact check: పన్ను చెల్లింపుదారులు 18 శాతం డబ్బు డిపాజిట్ చేయాలా?fact check: పన్ను చెల్లింపుదారులు 18 శాతం డబ్బు డిపాజిట్ చేయాలా?

సాధారణంగా ఎల్‌టీసీ పీరియడ్‌లో ప్రభుత్వం వేతనంతో కూడిన లీవులను మంజూరు చేస్తుంది. అయితే ప్రభుత్వం ఇప్పుడు అందులో కోత పెట్టబోతోందని,మెడికల్ రీయింబర్స్‌మెంట్‌లోనూ కోత తప్పదని ప్రచారం జరుగుతోంది. అలాగే రిటైర్మెంట్ తర్వాత ప్రభుత్వోద్యోగులకు వచ్చే లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌లోనూ కోత తప్పదన్న ప్రచారం జరుగుతోంది.

fact check is government going to cut allowance of Central Govt employees?

ఈ ప్రచారంపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పందించింది. ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఏ అధికారిని సంప్రదించకుండానే సదరు రిపోర్టర్ ఆ వార్తను ప్రచురించారని.. అవి అతని సొంత ఊహాగానాలే తప్ప అందులో వాస్తవం లేదన్నారు. కేంద్రం వివరణతో ప్రభుత్వ ఉద్యోగులకు ఉపశమనం లభించినట్టయింది.

English summary
A news report in Hindi claiming that the government has proposed to cut the LTC has created panic among the Central government employees.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X