వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Fact Check:లాక్‌డౌన్ సమయంలో ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తోందా..?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కరోనావైరస్‌పై చాలా వదంతులు వస్తున్నాయి. వదంతులను నమ్మవద్దని ఇటు ప్రపంచ ఆరోగ్యసంస్థ అటు ప్రధాని మోడీ ప్రజలకు ఎప్పటికప్పుడు చెబుతున్నారు. ఇలా ఉంటే కరోనావైరస్ రాదు.. అలా చేస్తే కరోనావైరస్ రాదు అంటూ పలు వదంతులు సోషల్ మీడియాను చుట్టేస్తున్నాయి. ఈ క్రమంలోనే వస్తున్న వదంతులపై వన్ ఇండియా ఫ్యాక్ట్ చెక్ నిర్వహిస్తోంది. వచ్చే వదంతుల్లో ఎంతవరకు వాస్తవాలున్నాయనే దానిపై డ్రైవ్ నిర్వహించి ఎప్పటికప్పుడు తప్పుడు ప్రచారాలపై క్లారిటీ ఇస్తోంది. తాజాగా ఓ రూమర్ సోషల్ మీడియాను చుట్టేస్తోంది. కరోనావైరస్ నేపథ్యంలో ఇంటర్నెట్‌ను బంద్ చేయాలని ప్రభుత్వం యోచిస్తోందనే వార్త హల్చల్ చేస్తోంది.

కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో పలు వదంతులు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఇంటర్నెట్‌ను ప్రభుత్వం నిలిపివేస్తోందనే వార్త సోషల్ మీడియాను చుట్టేస్తోంది. అయితే ప్రభుత్వం అలాంటి ప్రకటన చేయలేదని స్పష్టం చేసింది. అంతేకాదు ప్రస్తుత పరిస్థితుల్లో ఆ ఆలోచన కూడా చేయబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. సోషల్ మీడియాను చుట్టేస్తున్న వార్తలో ఎలాంటి నిజం లేదని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.

Fact Check:News making rounds that Internet would be shut down is fake, Govt clarifies

ఓటీటీ అంటే "ఓవర్‌ ది టాప్ " ఇంటర్నెట్ ద్వారా సినిమాలను ఆయా సంస్థలు టెలికాస్ట్ చేస్తున్నాయి. దీనికి బ్యాండ్‌విత్ చాలా ఎక్కువగా అవసరం అవుతుంది. ఈ క్రమంలోనే బ్యాండ్‌ విత్‌ను తగ్గించుకోవాలని ఆయా సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాను కోరినట్లు తెలుస్తోంది. లాక్ డౌన సమయంలో ఇంటర్నెట్‌పై అధిక ట్రాఫిక్ ఉంటుండటంతో ఇది రెగ్యులర్ టెలికాం నెట్‌వర్క్‌లపై అధిక ఒత్తిడిని తీసుకొస్తున్నాయని ఈ క్రమంలోనే బ్యాండ్‌విత్ తగ్గించుకోవాలని ప్రభుత్వం కోరింది.

ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు చాలా మటుకు ఓటీటీ సంస్థలు ఒప్పుకుని వారి బ్యాండ్‌విత్‌ను తగ్గించుకునేందుకు ముందుకొచ్చాయి. దీంతో టెలికాం నెట్‌వర్క్స్‌ పై కాస్త ఒత్తిడి తగ్గింది. హైడిఫినిషన్‌ను వీడి స్టాండర్డ్ డిఫినిషన్‌కు మారాలని ప్రభుత్వం ఓటీటీ సంస్థలకు లేఖ రాసింది. అంతేకాదు అడ్వర్టైజింగ్, పాపప్‌లను కూడా తొలగించాల్సిందిగా ప్రభుత్వం కోరింది. ఇవి అధికంగా బ్యాండ్‌ విత్‌ను వినియోగిస్తాయి కనుక వీటిని తొలగించాల్సిందిగా ప్రభుత్వం కోరింది.

English summary
Will internet services be shut down amidst the outbreak of the coronavirus and the subsequent lockdown.The government has however clarified that no such order has been passed and neither will such an announcement be made. The news is fake the government has also said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X