వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫ్యాక్ట్ చెక్: ప్రతి 15 నిమిషాలకు నీరు తీసుకోవడం వల్ల కరోనా నియంత్రించొచ్చనేది నిజమేనా..?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కరోనావైరస్‌పై చాలా వదంతులు వస్తున్నాయి. వదంతులను నమ్మవద్దని ఇటు ప్రపంచ ఆరోగ్యసంస్థ అటు ప్రధాని మోడీ ప్రజలకు ఎప్పటికప్పుడు చెబుతున్నారు. ఇలా ఉంటే కరోనావైరస్ రాదు.. అలా చేస్తే కరోనావైరస్ రాదు అంటూ పలు వదంతులు సోషల్ మీడియాను చుట్టేస్తున్నాయి. ఈ క్రమంలోనే వస్తున్న వదంతులపై వన్ ఇండియా ఫ్యాక్ట్ చెక్ నిర్వహిస్తోంది. వచ్చే వదంతుల్లో ఎంతవరకు వాస్తవాలున్నాయనే దానిపై డ్రైవ్ నిర్వహించి ఎప్పటికప్పుడు తప్పుడు ప్రచారాలపై క్లారిటీ ఇస్తోంది. తాజాగా ఓ రూమర్ సోషల్ మీడియాను చుట్టేస్తోంది. గొంతును గొంతులోపలి భాగాన్ని ఎప్పటికప్పుడు వెచ్చగా ఉంచుకుంటే కరోనావైరస్ దరిచేరదనే రూమర్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది

 గొంతును వెచ్చగా ఉంచుకుంటే కరోనా రాదా..?

గొంతును వెచ్చగా ఉంచుకుంటే కరోనా రాదా..?

ఈ మెసేజ్ ట్విటర్, ఫేస్‌బుక్, వాట్సాప్‌లాంటి సోషల్ మీడియాల్లో వైరల్ అవుతోంది. అయితే గొంతును వెచ్చగా ఉంచుకోవడం ద్వారా కానీ , లేదా గొంతులో వేడి పదార్థాలు పంపడం వల్ల కరోనావైరస్ కిల్ అవుతుందనేది అవాస్తవం. ప్రతి 15 నిమిషాలకు నీరును తీసుకోవడం ద్వారా కరోనావైరస్‌ను నియంత్రించగలమనే వార్త షికారు చేస్తోంది. అయితే ఈ మెసేజ్‌ను చూసిన వారు ఇతరుల్లో అవగాహన తీసుకురావాలని అధికారులు చెబుతున్నారు. ఇది పూర్తిగా అవాస్తవమని ఇతరులకు చెప్పాలని అధికారులు చెబుతున్నారు. ఇలా షికారు చేస్తున్న వార్తలపై నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కూడా ఫ్యాక్ట్ చెక్ చేసి గొంతును వెచ్చగా ఉంచుకుంటే కరోనా రాదని, ప్రతి 15 నిమిషాలకు నీరు తాగడం వల్ల కరోనా నియంత్రించొచ్చని వస్తున్న వార్తలను ఎన్‌డీఎంఏ ఖండించింది.

 NDMA ఏం చెబుతోంది..?

NDMA ఏం చెబుతోంది..?

అయితే గొంతును వెచ్చగా ఉంచుకోవడం వల్ల కరోనావైరస్ రాదని వస్తున్న వార్తలను నిర్థారించేలా ఎలాంటి సైంటిఫిక్ రుజువులు లేవని వెల్లడించింది. మరోవైపు కరోనావైరస్ అధిక ఉష్ణోగ్రతలు ఉన్న చోట్ల కూడా జీవించగలదని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా చెప్పిన విషయాన్ని ఎన్‌డీఎంఏ గుర్తు చేసింది. అయితే ఎక్కువ నీరు తాగడం వల్ల డీహైడ్రేట్ కాకుండా ఉంటారని అందుకే నీళ్లు తాగాలని చెబుతున్నామని కరోనావైరస్ నియంత్రణ కోసం కాదని డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడించినట్లు ఎన్‌డీఎంఏ చెబుతోంది.

 వైరల్ అవుతున్న వాట్సాప్ మెసేజ్‌లో ఏముంది..?

వైరల్ అవుతున్న వాట్సాప్ మెసేజ్‌లో ఏముంది..?

ఇక వాట్సాప్‌తో పాటు ఇతర సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న మెసేజ్ ఇలా ఉంది. " కోవిడ్-19 కేసులపై జపాన్ డాక్టర్లు సీరియస్‌గా ఒక విషయాన్ని సూచిస్తున్నారు. నోరు మరియు గొంతు ఎల్లవేళలా తేమ లేదా వెచ్చగా ఉండేలా చూసుకోవాలి. గొంతును ఎప్పుడూ పొడిగా ఉంచకూడదు. ప్రతి 15 నిమిషాలకు నీరు తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల నోట్లోకి లేదా గొంతులోకి వైరస్ వెళ్లిందంటే తీసుకుంటున్న నీరు దాన్ని కడుపులోకి పంపుతుంది. అక్కడ వైరస్ బతికే ఛాన్స్ లేదు. కడుపులో ఉన్న యాసిడ్లతో కరోనావైరస్ చచ్చిపోతుంది. ఎక్కువ నీరు తీసుకోకుంటే వైరస్ గొంతు నుంచి ఊపిరితిత్తులకు వెళ్లే ప్రమాదం ఉంది. ఇది మరింత డేంజర్ " అనే మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ మెసేజ్‌లో ఉన్న అంశాలన్నీ అవాస్తవాలనీ ఎన్‌డీఎంఏ చెబుతోంది.

English summary
Despite it being proven untrue on various occasions, a message claiming that a moist throat will kill coronavirus. The message has been circulated several times on Twitter, Facebook and WhatsApp.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X