వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Fact check : ఆ వీడియో ఇప్పటిదేనా... ఇండిపెండెన్స్ డే నాడు వైరల్...

|
Google Oneindia TeluguNews

అగస్టు 15,భారత స్వాతంత్య్ర దినోత్సవం రోజున అమెరికన్ ఆర్మీ బ్యాండ్ భారత జాతీయ గీతాన్ని ఆలపించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. అమెరికాకు చెందిన వెస్ట్ పాయింట్ ఆఫీసర్స్ అకాడమీ భారత జాతీయ గీతాన్ని ఆలపించిందని... ఇది భారతీయులందరికీ గర్వ కారణమని చాలామంది ఆ వీడియోను షేర్ చేశారు. అమెరికన్ ఆర్మీ బ్యాండ్ భారత జాతీయ గీతాన్ని ఆలపించడం నిజమే అయినప్పటికీ.... ఆ వీడియో మాత్రం ఇప్పటిది కాదు.

గతంలో అమెరికాలోని వాషింగ్టన్‌లో భారత్-అమెరికా జాయింట్ మిలటరీ ఎక్సర్‌సైజ్ సందర్భంగా అమెరికన్ మిలటరీ బ్యాండ్ భారత జాతీయ గీతాన్ని ఆలపించింది. 2019,అగస్టు 15న మొదటిసారి ఈ వీడియో వెలుగుచూసింది. అప్పట్లో ఈ వీడియోని షేర్ చేసిన ANI.. జాయింట్ మిలటరీ ఎక్సర్‌సైజ్ సందర్భంగా భారత జాతీయ గీతాన్ని ఆలపించిన అమెరికన్ ఆర్మీ అని పేర్కొంది. ఈ మిలటరీ ఎక్సర్‌సైజ్ భారత్,అమెరికా మధ్య అతిపెద్ద ఉమ్మడి సైనిక శిక్షణ, రక్షణ సహకార చర్యల్లో ఒకటి.

Fact check: Video of US Army playing Indian National Anthem is an old one

ఇటీవల అగస్టు 15 సందర్భంగా చాలామంది ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఇది ఈ ఏడాదే జరిగి ఉంటుందని చాలామంది భావించారు. కానీ అందులో నిజం లేదు.

English summary
A video of an American Army band playing the Indian National Anthem has gone viral. The video was posted on August 15, 2020, and its was said that the West Point Officers' Academy, USA played the national anthem.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X