వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెళ్లి నుంచి టెక్కీ వెనక్కి: రేప్ కింద జీవిత ఖైదు

By Pratap
|
Google Oneindia TeluguNews

Failing to keep marriage promise earns techie life in jail
కోయంబత్తూర్: పెళ్లి చేసుకుంటానని ఓ అమ్మాయికి హామీ ఇచ్చి ఆ తర్వాత వెనక్కి వెళ్లిన 27 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు కోర్టు జీవిత ఖైదు విధించింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి అతను ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడు. అయితే, మాట నిలబెట్టుకోకపోవడంతో కోర్టు అతని శుక్రవారం జీవిత ఖైదు విధించింది.

పొడనూరు సమీపంలోని శ్రీరాం నగర్‌కు చెందిన ఆర్ శాం ఓ అమ్మాయిని ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు. మత్తు పదార్థాలు కలిపిన శీతల పానీయాలు ఇచ్చి అతను 2007లో కొడైకెనాల్‌లో ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడని ప్రాసిక్యూషన్ తరపు న్యాయవాది ఆరోపించారు.

కొడైకెనాల్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని తప్పించుకుని తిరుగుతున్నాడు. దాంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు శాంను విచారించారు. ఇరువురి కుటుంబాలను పిలిపించి పెళ్లికి ఒప్పించారు. ఆ సమయానికి అతనికి 21 ఏళ్లు పూర్తి కాకపోవడంతో పెళ్లి సాధ్యం కాలేదు.

అయితే, పెళ్లి చేసుకుంటామని మాత్రం ఒప్పందం చేసుకుని, రింగులు మార్చుకున్నారు, ఫొటోలు తీసుకున్నారు. అయితే, ఆ తర్వాత శాం, అతని కుటుంబ సభ్యులు అమ్మాయిని తప్పించుకోవడం ప్రారంభించారు. ఇంటి నుంచి 6 లక్షల రూపాయలు తేవాలని కూడా వారు డిమాండ్ చేసినట్లు అమ్మాయి చెప్పింది. దాంతో అమ్మాయి కొత్తగా ఫిర్యాదు చేసింది. దాంతో శాంపై అత్యాచారం కింద కేసు నమోదు చేశారు. అత్యాచారం, కిడ్నాపింగ్, తప్పుడు వాగ్దానాల కింద శాం నేరం చేసినట్లు కోర్టు తేల్చి చెప్పింది.

English summary
A 27-year-old software engineer, who went back on his promise of marrying a girl with whom he had a sexual relationship, was convicted of rape and sentenced to life imprisonment by a court here on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X