• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వలసకూలీ కన్నిటీ వ్యధ: క్వారంటైన్ సెంటర్‌లోకి నో పర్మిషన్, వరండాపైనే నిద్ర, చలించిన కౌన్సిలర్..

|

కరోనా వైరస్ వల్ల హృదయ విదారకర ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. వైరస్ లక్షణాలు ఉన్న, సోకిన వ్యక్తికి కొన్నిచోట్ల సరైన సదుపాయాలు కల్పించడం లేదు. ఇటీవల చెన్నై నుంచి కేరళకు చెందిన వ్యక్తి.. తన స్వస్థలం వెళ్లాడు. ఇక అక్కడ సినిమా మొదలైంది. సరిహద్దు వద్దకు చేరడంతో ప్రారంభమైన అపసోసాలు.. క్వారంటైన్ సెంటర్ చేరేవరకు కొనసాగింది. ఒకానొక సమయంలో ఆ వ్యక్తి తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. జరిగిన ఘటనను కోజికోడ్ కలెక్టర్ శ్రీరాం సాంబశివరావు తన ఫేస్‌బుక్ పేజీలో రాసుకున్నారు.

కరోనా: తెలంగాణలో తగ్గని వ్యాప్తి.. కొత్తగా 41 పాజిటివ్ కేసులు

12 గంటలు నిరీక్షణ

12 గంటలు నిరీక్షణ

కేరళలోని నారిపట్టకు చెందిన వ్యక్తి చెన్నైలో ఉండేవాడు. అయితే లాక్ డౌన్ వల్ల ఈ నెల 9వ తేదీన ముగ్గురితో కలిసి స్వస్థలానికి బయల్దేరాడు. వాలయార్ చెక్ పోస్ట్ వద్దకు ఉదయం చేరుకోగా.. పాస్ లేదని దాదాపు 12 గంటలు నిలిపివేశారు. ఆ మరునాడు.. అంటే 10వ తేదీన 11.55 గంటలకు మరో ఇద్దరితో పాటు అనుమతించారు. ఇతర రాష్ట్రం నుంచి వచ్చినందున.. క్వారంటైన్ ఇబ్బందులు తప్పలేదు. మరో ఇద్దరికీ ఎలాంటి సమస్య లేదు. కానీ నారిపట్టకు చెందిన అతడిని సమస్యల వలయం చుట్టుముట్టింది.

నారిపట్టకు మాత్రం నో

నారిపట్టకు మాత్రం నో

చెక్ పోస్ట్ వద్ద నుంచి ఇద్దరిని అలాతూర్ రెసిడెన్సీ క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. అయితే మరోకరు క్వారంటైన్ కోసం ముందుగానే బుక్ చేసుకోవడంతో అతనిని అనుమతించారు. కానీ నారిపట్టకు చెందిన వ్యక్తిని మాత్రం అనుమతించలేదు. దీంతో ఆ రోజు రాత్రి క్వారంటైన్ సెంటర్ వరండాపై పడుకొన్నారు. మరునాడు ఉదయం విషయం తెలియడంతో చర్యలు తీసుకున్నామని కలెక్టర్ వివరించారు. అతనిని ఆయుర్వేద ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. అక్కడ కూడా సేమ్ సిచుయేషన్..

ఆయుర్వేద ఆస్పత్రిలో..

ఆయుర్వేద ఆస్పత్రిలో..

అతనిని ఆటోలో వడకర పాత బస్టాండ్ నుంచి పాలొలిపల్లం ఆయుర్వేద ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఇక్కడ కూడా క్వారంటైన్ లేకపోవడంతో.. స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో అతనిని నారిపట్ల క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. 13వ తేదీన కరోనా లక్షణాలు కనిపించగా.. 14వ తేదీన కరోనా వైరస్ నిర్ధారణ జరిగింది.

ముందుకొచ్చిన మహానుభావుడు

ముందుకొచ్చిన మహానుభావుడు

విషయం తెలుసుకున్న చాందనమ్ పరంబా మున్సిపల్ వార్డు కౌన్సిలర్ బీనా కునియిల్ స్పందించారు. అతనికి క్వారంటైన్ కల్పించేందుకు ముందుకొచ్చారు. అతని గ్రామంలో ఇళ్లు చిన్నదని తెలుసుకున్నారు. తల్లిదండ్రులు, పిల్లలు ఉండటంతో అక్కడ వీలులేదని తెలుసుకొన్నారు. నారిపట్ట సర్పంచ్‌తో మాట్లాడి.. అతని సోదరుడి ఇంటిలో వసతి కల్పించారు.

  COVID-19 in AP: Newly 52 Positive cases in 24 hrs| Reasons
   నాన్ లోకల్

  నాన్ లోకల్

  వాస్తవానికి వడకర మున్సిపాలిటీలో వసతి కల్పించొచ్చు.. కానీ అతను స్థానికుడు కాకపోవడం ఇబ్బందికి గురిచేసిందని కౌన్సిలర్ తెలిపారు. అతనిని నారిపట్టకు 108 వాహనంలో తీసుకెళ్లారు. అక్కడ హోం క్వారంటైన్ కల్పించి మంచి మనస్సున మనుషులను చాటుకొన్నారు. ఆ తర్వాత ఆటో డ్రైవర్, టీ షాపు నిర్వాహకుడు, పోలీసులు, వార్డు కౌన్సిలర్ కూడా క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. నారిపట్టకు చెందిన వ్యక్తికి కరోనా వైరస్ రావడంతో ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు.

  English summary
  Naripatta native who came from Chennai to Kozhikode district on May 10 and later tested positive for coronavirus had slept one night outside a closed shop in Vadakara.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more