• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఫెయిర్&లవ్లీ... హిందూస్తాన్ యూనిలీవర్ అనూహ్య నిర్ణయం... అదే కారణం..?

|

ఫెయిర్&లవ్లీ... ఇది మురికివాడల్లోని కిరాణ షాపుల్లోనూ దొరుకుతుంది,పోష్ లొకాలిటీలో అద్దాల భవంతులతో మెరిసే మాల్స్‌లోనూ దొరుకుతుంది. ధర కూడా రూ.5 మొదలు రూ.399 వరకూ అందరికీ అందుబాటు ధరల్లో ఉంటుంది. అందుకే ఇండియాలో దాదాపుగా ఇది అన్ని వర్గాలకూ చేరువై.. కాస్మోటిక్ రంగంలో దాదాపు 50శాతం-70శాతం వాటాను కలిగి ఉంది.అలాంటి ఈ బ్యూటీ ప్రొడక్ట్‌ పేరును మార్చాలని హిందుస్తాన్ యూనిలీవర్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ హత్యోదంతం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా వర్ణ వివక్షపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

ఫెయిర్ పదం తొలగింపు...

ఫెయిర్ పదం తొలగింపు...

ఇకనుంచి తమ ప్రొడక్ట్‌లో 'ఫెయిర్' అనే పదాన్ని తొలగించి కొత్త పేరుతో రీబ్రాండ్ చేయనున్నట్టు హిందూస్తాన్ యూనిలీవర్ ప్రకటించింది. కొత్త పేరుకు ఇంకా రెగ్యులేటరీ ఆమోదం లభించాల్సి ఉందని తెలిపింది. కొత్తగా తీసుకురాబోయే ప్రొడక్ట్ కేవలం ఫెయిర్‌ బ్యూటీకి మాత్రమే కాకుండా ఇతర స్కిన్ టోన్స్‌ను కూడా ప్రతిబింబించేలా ఉంటుందని పేర్కొంది.

చైర్మన్ సన్నీ జైన్ మాటల్లో...

చైర్మన్ సన్నీ జైన్ మాటల్లో...

ప్రస్తుతం మార్కెట్లో దొరికే ఫెయిర్&లవ్లీ ప్యాక్‌పై కాంతివంతమైన చర్మం కోసం,తెలుపు కోసం వంటి రాతలు కనిపిస్తాయి. అయితే ఈ ధోరణి సరైనది కాదని హిందూస్తాన్ యూనిలీవర్ భావిస్తోంది. 'చర్మానికి సంబంధించి తెలుపు,కాంతి,మెరుపు వంటి పదాలు వాడటం సరైనది కాదని మేము గుర్తించాం. మా ఉత్పత్తులను ప్రజలకు కమ్యూనికేట్ చేసే విధానాన్ని సవరించుకుంటున్నాం.' అని హిందూస్తాన్ యూనిలీవర్ బ్యూటీ&పర్సనల్ కేర్ ప్రెసిడెంట్ సన్నీ జైన్ తెలిపారు.

అన్ని రకాల స్కిన్ టోన్స్‌ను లసెలబ్రేట్ చేసేందుకు..

అన్ని రకాల స్కిన్ టోన్స్‌ను లసెలబ్రేట్ చేసేందుకు..

ఇకపై ఫెయిర్&లవ్లీ అన్ని రకాల స్కిన్ టోన్స్‌ను సెలబ్రేట్ చేస్తుందని హిందూస్తాన్ యూనిలీవర్ వెల్లడించింది. ఇప్పటిదాకా ఫెయిర్&లవ్లీ సాచెట్స్‌పై ముద్రిస్తూ వచ్చిన తెలుపు,నలుపు ముఖాలను కూడా తొలగిస్తున్నట్టు సంస్థ చైర్మన్ సంజీవ్ మెహతా తెలిపారు. గతవారం అమెరికన్ మల్టీ నేషనల్ జాన్సన్ అండ్ జాన్సన్ భారత్‌లో తమ ఉత్పత్తులను నిలిపివేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొద్దిరోజులకే ఫెయిర్&లవ్లీ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఉత్పత్తులను రద్దు చేయడం కంటే... కొన్ని విధానాలను,పద్దతులను మార్చుకోవడం ద్వారా వాటిని రీబ్రాండ్ చేసుకోవాలని భావిస్తోంది. ప్రస్తుతం భారత్‌లో ఫెయిర్&లవ్లీ అమ్మకాల విలువ ఏటా 560 మిలియన్ డాలర్లు.

అదే కారణమా..?

అదే కారణమా..?

బ్లాక్ లివ్స్ మ్యాటర్ నినాదంతో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం నడుస్తోంది. నల్లజాతి వాళ్లను తక్కువగా చూడటం,తెల్ల చర్మం ఉన్నంత మాత్రాన గొప్పగా ఫీల్ అవడం వంటి అసమానతలను ఈ ఉద్యమం తీవ్రంగా ఖండిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అనేక కార్పోరేట్ సంస్థలు కూడా ఈ ఉద్యమానికి మద్దతు తెలిపాయి. ఈ నేపథ్యంలో నలుపు,తెలుపు అన్న అసమానతలను పక్కనపెట్టాలన్న చర్చ జరుగుతోంది. ఫెయిర్&లవ్లీ కూడా ఈ విషయంలో ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది. తెలుపును మాత్రమే ప్రమోట్ చేసేలా తమ ఉత్పత్తులు ఉండటం సరికాదని ఆ సంస్థ భావించింది. అందుకే ఇకపై అన్ని రకాల స్కిన్ టోన్స్‌కు ప్రాధాన్యతనిస్తామని స్పష్టం చేసింది.

English summary
In a major announcement, Hindustan Unilever has announced that it will remove the word 'Fair' from its flagship brand skincare cream Fair & Lovely. This comes as there is a global debate over racial inequality and beauty standards. Hindustan Unilever said it would stop using the word "Fair" in the brand, adding that the new name for the cream was awaiting regulatory approvals.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X