వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గడ్డం పెట్టి, ఐడీ కార్డు చూపించి రైడ్ .. పట్టించిన స్వరం, ముజఫర్‌నగర్‌లో ఫేక్ సీబీఐ లీలలు

|
Google Oneindia TeluguNews

ముజఫర్ నగర్ : దురాలోచన .. ఆశతో అన్నంపెట్టిన ఇంటికే కన్నం వేస్తారు కొందరు కేటుగాళ్లు. ఆ ఇంటి యాజమానులు చేసిన తప్పేంటీ అంటే పనొళ్లను పూర్తిగా నమ్మడమే. ఇక అసలే సినిమాల్లో మన హీరోలు నకిలీ అధికారుల అవతారం ఎత్తూతూనే ఉన్నారు. దీనినే ఆదర్శంగా తీసుకొన్నాడు ఓ కేటుగాడు.

మోడీకి మార్కెటింగ్ స్కిల్స్.. అందుకే బీజేపీకి మరోసారి అధికారం.. కాంగ్రెస్ నేత వింత కామెంట్స్ మోడీకి మార్కెటింగ్ స్కిల్స్.. అందుకే బీజేపీకి మరోసారి అధికారం.. కాంగ్రెస్ నేత వింత కామెంట్స్

నమ్మితే ..

నమ్మితే ..

అన్నం పెట్టిన ఇంటికి సున్నం పెట్టారు అనే సామెతర ఊరికే రాలేదు. తమ బంటు అని నమ్మడమే ఓనర్లు చేస్తున్న తప్పవుతుంది. తాజాగా యూపీలో ఓ వ్యక్తి చేసిన హంగామా .. అతనిని కటకటాలపాలు చేసింది. ముజఫర్ నగర్‌లో ఆదేశ్ గోయెల్ అనే వ్యక్తి రైస్ మిల్ నడుపుకుంటు ఉన్నాడు. ఇతని వద్ద త్రివిందర్ అనే వ్యక్తి పనికి కుదిరాడు. కొన్నాళ్లు బాగానే ఉన్నాడు .. తర్వాత మాయమైపోయాడు. ఏం జరిగిందో ఏమో అని పట్టించుకోలేదు ఆదేశ్. అదే అతను చేసిన తప్పయ్యింది.

ఫ్రం సీబీఐ ...

ఫ్రం సీబీఐ ...

శనివారం గోయల్ ఇంటికి ఓ సీబీఐ అధికారి, ఇద్దరు కానిస్టేబుల్స్ వచ్చారు. నకిలీ కార్డు చూపించి .. తనిఖీల పేరుతో హంగామా చేశారు. అయితే తనను ఎక్కడ గుర్తుపడతారేమోనని త్రివిందర్ .. గడ్డం పెట్టుకొని వచ్చాడు. రైస్ మిల్‌కు సంబంధించి పలు ప్రశ్నలు వేశాడు. అయితే సీబీఐ అధికారి తీరుపై స్థానికులకు అనుమానం కలిగింది. డాక్యుమెంట్స్ చూపాలని గొడవ చేయడంతో .. ఆ వీధిల్లో ఉంటున్న వారికి అనుమానం కలిగింది. సీబీఐ అధికారి ఇలా ప్రవర్తించడమేంటని అనుకొన్నారు. పైకి చూస్తే గడ్డం ఉంది .. కానీ భాష మాత్రం మారలేదు. దీంతో అతను త్రివిందర్ అని గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఒకింత షాక్‌నకు గురయ్యారు. నకిలీ సీబీఐ అధికారి అని కలరింగ్ ఇచ్చిన త్రివిందర్‌పై కేసు నమోదు చేసినట్టు డీఎస్పీ యోగేంద్ర సింగ్ పేర్కొన్నారు.

కనిపెట్టని పోలీసులు ....

కనిపెట్టని పోలీసులు ....

శనివారం ముజఫర్ నగర్ పోలీసు స్టేషన్‌కు ఓ వ్యక్తి వచ్చాడు. తాను సీబీఐ అధికారినని నమ్మబలికాడు. ఐడీ కార్డు చూపించడంతో వారు నిజమేనని అనుకొన్నారు. వెంటనే అతనితో ఇద్దరు కానిస్టేబుళ్లను కూడా పంపించారు. కానీ ఆదేశ్ ఇంట్లో ప్రవర్తన .. స్థానికుల అనుమానంతో త్రివిందర్ బండారం బట్టబయలైంది. తమనే మోసం చేస్తావా అని పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

English summary
a man impersonating a cbi officer conned up cops by going to a police station and asking for two constables to conduct a raid at a businessmans house in muzaffarnagar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X