వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్ణాటకలో రూ.7 కోట్ల నకిలీ కరెన్సీ పట్టివేత, ఒకరి అరెస్ట్

By Narsimha
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు: కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికలు వచ్చే నెలలో జరగనున్నాయి. అయితే నకిలీ కరెన్సీ పెద్ద ఎత్తున రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. రాష్ట్రంలోని బెలగవిలో పెద్ద ఎత్తున నకిలీ కరెన్సీ పట్టుబడింది. బుధవారం నాడు పోలీసుల తనిఖీలో సుమారు రూ. 7 కోట్ల విలువైన నకిలీ కరెన్సీ పోలీసులకు పట్టుబడింది.

కర్ణాటక రాష్ట్రంలో మే 12వ తేదిన ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బిజెపిలు హోరాహోరిగా తలపడుతున్నాయి. అధికారాన్ని తిరిగి నిలుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. దక్షిణాదిలో అధికారాన్ని చేజిక్కించుకోవాలనిబిజెపి ప్లాన్ చేస్తోంది. ఈ తరుణంలో రెండు పార్టీలకు చెందిన అగ్రనేతలు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.

Fake currency worth Rs 7 cr seized from Belagavi, Ahead of Karnataka polls

ఈ తరుణంలో కర్ణాటక రాష్ట్రంలో నకిలీ కరెన్సీ పెద్ద ఎత్తున పట్టుబడడం కలకలం రేపుతోంది. నకిలీ కరెన్సీని తరలిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకే నకిలీ కరెన్సీని తీసుకొచ్చారని భావిస్తున్నారు.

మంగళవారం నాడు కూడ ఓ ప్రైవేట్ బస్సులో వంద కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఘటన చోటు చేసుకొని 24 గంటలు కూడ కాకముందే సుమారు రూ. 7 కోట్ల నకిలీ కరెన్సీ పట్టుబడడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ ఎన్నికల్లో పెద్ద ఎత్తున కరెన్సీని పంచేందుకు పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయని, ఇందులో భాగంగానే కరెన్సీ తరలిస్తుండగా పట్టుబడినట్టు స్వచ్ఛంధ సంస్థలు ఆరోపిస్తున్నాయి.

English summary
Amid a cash crunch that has beset most of India, Karnataka Police seize fake Indian currency notes with face value of Rs 7 crore. One person was arrested in Belagavi after the police seized fake Indian currency notes with the face value of Rs 7 crore. A case has been registered
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X