చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Fake Aadhar, facebook:కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి, బాధితుల్లో IPSలు, టార్గెట్, సిమ్ కార్డుల దందా!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ హైదరాబాద్/ చెన్నై: ఆధార్ కార్డులు, నకిలీ ఫేస్ బుక్ అకౌంట్ లతో సామాన్య ప్రజలకు కుచ్చుటోపి పెడుతున్న విషయం మనం అప్పుడప్పుడు చూస్తూనే ఉన్నాము. అయితే కొడితే కుంభస్థలాన్ని కొట్టాలని నిర్ణయించిన ఓ గ్యాంగ్ ఏకంగా పోలీసు అధికారులను టార్గెట్ చేసుకున్నారు. ఆధార్ కార్డులు, నకిలీ ఫేస్ బుక్ అకౌంట్ తెరమీదకు తెచ్చి ఆ పోలీసు అధికారుల పేరుతో మామూళ్లను విరాళాల ముసుగులో సేకరిస్తున్నారు. పోలీసు అధికారులకు విషయం తెలిసి ఇప్పుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో విషయం వెలుగు చూసింది. IPSలు, పోలీసు అధికారులకే పంగనామాలు పెడుతున్న ముఠా ఇప్పుడు కటకటాలపాలైయ్యింది.

Illegal affair: ఆంటీకి ఆ నలుగురు, ఒకడికి మండింది, మిల్క్ ట్యాంకర్ లా ఉందని ఒకటే ఫాలోయింగ్!Illegal affair: ఆంటీకి ఆ నలుగురు, ఒకడికి మండింది, మిల్క్ ట్యాంకర్ లా ఉందని ఒకటే ఫాలోయింగ్!

సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ పేరుతో !

సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ పేరుతో !

కర్ణాటకకు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి పి. హరిశేఖరన్ పేరు, ఆయన ఫోటోలతో నకిలీ ఫేస్ బుక్ అకౌంట్ ప్రారంభించారు. తన ఫోటోలు, తన పేరుతో నకిలీ ఫేస్ బుక్ అకౌంట్ ప్రారంభించి తనకు తెలిసిన వాళ్ల దగ్గర, తన పేరును వాడుకుని డబ్బులు వసూలు చేస్తున్నారని ఐపీఎస్ అధికారి హరిశేఖరన్ బెంగళూరులోని సీఐడీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసు అధికారులు క్యూ

పోలీసు అధికారులు క్యూ

కర్ణాటక సీనియర్ ఐపీఎస్ అధికారి సెప్టెంబర్ 15వ తేదీన బెంగళూరు సీఐడీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదు అయ్యింది.
మరుసటి రోజు సీఐడీ విభాగం డిప్యూటీ సూపరెండెంట్ ఎం.హెచ్, నాగ్తే కూడా ఇలాంటి ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు షాక్ అయ్యారు. ఇక అక్టోబర్ 5వ తేదీన సీఐడీలో పనిచేస్తున్న మరో డీఎస్పీ ప్రకాష్ రాథోడ్ సైతం తాను ఇదే విధంగా మోసపోయానని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసు అధికారులకు మరోసారి దిమ్మతిరిగిపోయింది.

ఇదో పెద్ద గ్యాంగ్.... దందాలో వర్క్ డివైడ్

ఇదో పెద్ద గ్యాంగ్.... దందాలో వర్క్ డివైడ్

కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన సుమారు డజను మంది పోలీసు అధికారులు ఇలాంటి మోసాలకు గురై సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారని బెంగళూరు సీఐడీ సైబర్ పోలీసు అధికారులు అంటున్నారు. పోలీసు అధికారులకే ఇలాంటి చేదుఅనుభవాలు ఎదురుకావడంతో సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగారు. రాజస్థాన్, భరత్ పూర్ ప్రాంతాల నుంచి ఇలాంటి నకిలీ ఆధార్ కార్డు, ఫేస్ బుక్ అకౌంట్ లు, నకిలీ సిమ్ కార్డుల దందా జరుగుతోందని సైబర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసు అధికారుల విచారణలో వెలుగు చూసింది.

Recommended Video

News Roundup : Manish Kumar Sinha Appointed As New Intelligence Chief Of Andhra Pradesh !
 మొబైల్ ఫోన్ నెట్ వర్క్ ఆపరేటర్

మొబైల్ ఫోన్ నెట్ వర్క్ ఆపరేటర్

పోలీసు అధికారుల పేరుతో నకిలీ ఫేస్ బుక్ అకౌంట్ లు ప్రారంభించడానికి మొబైల్ ఫోన్ ఆపరేటర్, సిమ్ కార్డుల రిటైల్ డిస్టిబ్యూటర్ సహకరించారని సైబర్ క్రైమ్ పోలీసు అధికారులు గుర్తించారు. నకిలి ఆధార్ కార్డుల నెంబర్ లతో మొబైల్ సిమ్ కార్డులు కొనుగోలు చేసి తరువాత నకిలి ఫేస్ బుక్ అకౌంట్ లు ప్రారంభించి ఇతరులను మోసం చేసి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని పోలీసు అధికారుల విచారణలో వెలుగు చూసింది.

 ఆ నలుగురు అరెస్టు

ఆ నలుగురు అరెస్టు

పోలీసు అధికారుల పేరుతో నకిలి ఫేస్ బుక్ అకౌంట్ లు, నకిలి ఆధార్ కార్డులు, మొబైల్ సిమ్ కార్డుల తయారు చేస్తున్న గ్యాంగ్ లోని నలుగురిని కర్ణాటక సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. మొబైల్ ఫోన్ ల సిమ్ కార్డులు విక్రయించిన బల్విందర్ సింగ్, నకిలి ఆధార్ కార్డులు తయారు చేసిన సైనీ. నకిలి ఆధార్ కార్డులకు సిమ్ కార్డులు విక్రయించిన అన్సార్ ఖాన్, నకిలి అకౌంట్ ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న రాజస్థాన్ నివాసి సద్దాం అనే నిందితులను అరెస్టు చేశామని సీఐడీ విభాగం సీనియర్ పోలీసు అధికారి శరత్ చెప్పారు. వీరితో పాటు ఫేస్ బుక్ నకిలి అకౌంట్ లు, సోషల్ మీడియాలో నకిలి అకౌంట్ లు సృష్టిస్తున్న ఐదో నిందితుడు షకీల్ అహమ్మద్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

మూడు రాష్ట్రాల పోలీసు ఆఫీసర్స్ టార్గెట్ !

మూడు రాష్ట్రాల పోలీసు ఆఫీసర్స్ టార్గెట్ !

ప్రస్తుత కర్ణాటక హోమ్ శాఖ సెక్రటరీ, లేడీ ఐపీఎస్ ఆఫీసర్ డి. రూపా పేరుతో 2019లో నకిలి ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ప్రారంభించారు. తాను ఇన్ స్టాగ్రామ్ లో లేనని, తనపేరుతో వచ్చే విషయాలను ఎవ్వరూ నమ్మకూడదని అప్పట్లో లేడీ ఐపీఎస్ ఆఫీసర్ రూపా ట్వీట్ చేశారు. తమిళనాడు అడిషినల్ డీజీపీ ఎం. రవి, తమిళనాడులోని మదురై ఎస్పీ డేవిడ్ సన్ దేవశివరత్నం పేరుతో కూడా నకిలి ఫేస్ బుక్ అకౌంట్ లో వెలుగు చూడటంతో అప్పట్లో ఆ అధికారులు తమిళనాడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో కేసులు నమోదైనాయి. మొత్తం మీద పోలీసు అధికారులను టార్గెట్ చేసుకున్న ఈ ముఠా సభ్యులు వారి స్నేహితులు, సన్నిహితులకు సింపుల్ గా మెసేజ్ లు పంపించి డబ్బులు వసూలు చేస్తున్నారని వెలుగు చూసింది.

English summary
Fake Facebook, Aadhar accounts: Investigations in over a dozen similar complaints made by police officers in Karnataka, Tamil Nadu and Telangana have led the Karnataka CID cyber unit to an organised cybercrime network operating mostly from Bharatpur and other parts of Rajasthan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X