వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

fact check: ఆర్థిక సంవత్సరం పొడిగించడం లేదు, సోషల్ మీడియాలో పుకార్లకు ఆర్థికశాఖ క్లారిటీ

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో ఆర్థిక సంవత్సరం పొడిగిస్తారనే ప్రచారం జరుగుతోంది. జూన్ 30వ తేదీ వరకు ఫైనాన్షియల్ ఈయర్ కొనసాగుతోందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. మార్చి 31వ తేదీ నుంచి ఆర్థిక సంవత్సరం ముగుస్తోందని.. ఇందులో ఎలాంటి సందేహాం లేదని పేర్కొన్నది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం అమల్లోకి వస్తోందని ఊహాగానాలకు చెక్ పెట్టింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ కూడా జారీచేసింది.

ఇండియన్ స్టాంప్ చట్టంలో చేసిన సవరణలతో ఆర్థిక సంవత్సరం పొడిగిస్తారనే ఊహాగానాలను బలం చేకూరింది. కానీ అలాంటిదేమీ లేదని భారత ప్రభుత్వం స్పష్టంచేసింది. ఇండియన్ స్టాంప్ చట్టంలో కొన్నిమార్పులను రెవెన్యూ విభాగం చేసిందని భారత ఆర్థిక మంత్రిత్వశాఖ పేర్కొన్నది. కానీ ఫైనాన్షియల్ ఈయర్ పొడిగింపునకు సంబంధం లేదని తెలిపింది.

Fake: Financial year is not being extended

స్టాక్ ఎక్స్చేంజీ డిపాజిటరీకి సంబంధించి క్లియరింగ్ కార్పొరేషన్ ద్వారా సెక్యూరిటీ మార్కెట్ ఇన్స్రుమెంట్ లావాదేవీలపై స్టాంప్ డ్యూటీని సేకరించేందుకు గడువు పొడిగించారు. క్లియరింగ్‌ను ఏప్రిల్ 1 నుంచి జూలై 1కి మార్చారు. దీనినే ముందు సంబంధిత శాఖ తెలియజేసింది. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో మాత్రమే అలాంటి నిర్ణయం తీసుకున్నారు. అయితే దానిని ఫైనాన్షియల్ ఎక్స్‌టెండ్ చేయాలనే ప్రచారానికి మరింత బలం చేకూరింది. సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరగడంతో... ఆర్థికశాఖ స్వయంగా ప్రకటన చేసింది.

English summary
There is a fake new circulating in some section of media that the Financial Year has been extended.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X