• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Fake baba: ఒకే ఫ్యామిలీలో వదినలు, మరదలు, నాలుగు రేప్ కేసులు, ఆంటీ రివర్స్ తో, బాబా!

|

జైపూర్/ రాజస్థాన్/ హైదరాబాద్: పేరు పొందిన ఆశ్రమంలో దైవదూతగా చెలామణి అవుతూ తాను దైవ మానవుడు అని చెప్పకుంటున్న నకిలి బాబాను పోలీసులు అరెస్టు చేశారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఒకే ఫ్యామిలీలో ముగ్గురు మహిళలతో పాటు మొత్తం నలుగురు మహిళ మీద అత్యాచారం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న తపస్వి బాబాను పోలీసులు అరెస్టు చేశారు. తపస్వి బాబాగా అందరిని ఆశీర్వదిస్తున్న ఆ బాబా దేవుడు మిమ్మల్ని ఈ టైప్ లో ఆశీర్వదించాలని చెప్పాడని మహిళలకు మాయమాటలు చెప్పి ఆ నలుగురు మహిళల మీద పదేపదే అత్యాచారం చేశాడని కేసులు నమోదు అయ్యాయి.

2005 నుంచి 2017 వరకు ఆ మహానుభావుడు ఆశ్రమంలో చెలరేగిపోయాడని ఆరోపణలు ఉన్నాయి. ఓ ఆంటీ ధైర్యం చేసి కేసు పెట్టడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చాయి. ప్రముఖ రాజకీయ నాయకులు బాబా గారి శిష్యులు కావడంతో ఆయన్ను అరెస్టు చెయ్యడానికి మేము నానా తంటాలు పడ్డామని పోలీసు అధికారులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

Illegal affair: భర్త పాల వ్యాపారం, నాటుకోడి భార్యకు ?, నా వైఫ్ కు మురిపాలు, ఎంజాయ్!Illegal affair: భర్త పాల వ్యాపారం, నాటుకోడి భార్యకు ?, నా వైఫ్ కు మురిపాలు, ఎంజాయ్!

జైపూర్ లో ఫేమస్ బాబా

జైపూర్ లో ఫేమస్ బాబా

రాజస్థాన్ లోని జైపూర్- అజ్మీర్ జాతీయ రహదారిలో దైవమానవుడు, స్వయం ఘోషిత స్వామీజీ యోగేంద్ర మెహ్తా (56) అనే బాబా కొన్ని ఎకరాల స్థలంలో తపస్వి బాబా ఆశ్రమం నిర్వహిస్తున్నాడు. యోగేంద్ర మెహ్తాకు అనేక రాజకీయ పార్టీల నాయకులు, శ్రీమంతులు, వ్యాపారవేత్తలు, బిగ్ షాట్స్ భక్తులుగా ఉన్నారు. బిగ్ షాట్స్ భక్తులు కావడంతో యోగేంద్ర మెహ్తా ఆశ్రమం కలకలలాడిపోతా ఉందని సమాచారం.

బాంబు పేల్చిన లేడీ

బాంబు పేల్చిన లేడీ

జైపూర్ లోని బింద్యాక్యా ఇండస్ట్రీయల్ ఏరియాలో నివాసం ఉంటున్న 45 ఏళ్ల మహిళకు 1998లో వివాహం అయ్యింది. ఈమె భర్త అప్పుడప్పుడు యోగేంద్ర మెహ్తా ఆశ్రమానికి వెళ్లి వచ్చేవాడు. తరువాత భార్యను కూడా ఆయన బాబా ఆశ్రమానికి పిలుచుకుని వెళ్లడం మొదలుపెట్టాడు. అప్పటి నుంచి యోగేంద్ర మెహ్తాకు ఆమె పరిచయం అయ్యింది.

రాత్రి 10 మంది మహిళలు అక్కడే

రాత్రి 10 మంది మహిళలు అక్కడే

యోగేంద్ర మెహ్తా ఆశ్రమంలో రోజూ రాత్రి సుమారు 10 మంది మహిళలు నిద్రపోతున్నారని తెలిసింది. వివాహిత మహిళ కూడా 2005 నుంచి 2017 వరకు ఆరు నెలలకు ఒకసారి నాలుగైదు రోజుల పాటు ఆశ్రమంలో నిద్రపోయిందని సమాచారం. ఆ సమయంలో అక్కడ ఉన్న ఓ మహిళల సహాయంతో యోగేంద్ర మెహ్తా ఆయన గదిలోకి మహిళలను పిలిపించుకుని వారితో చనువుగా ఉండేవాడని ఆరోపణలు ఉన్నాయి.

ప్రసాదం, తీర్థం పేరుతో......... స్వాహా

ప్రసాదం, తీర్థం పేరుతో......... స్వాహా

రాత్రి పూట యోగేంద్ర మెహ్తాతో చనువుగా ఉండే ఓ మహిళ (బాబా ప్రియురాలు) తనను ఆయన గదిలోకి పిలుచుకుని వెళ్లిందని, తరువాత స్వామీజీ తనకు తీర్థంతో పాటు ప్రసాదం ఇచ్చి తినాలని చెప్పాడని బాధితురాలు ఆరోపిస్తోంది. ఆ ప్రసాదం తిని తీర్థం తాగిన తరువాత తాను మత్తులోకి జారుకున్నానని, ఆ సమయంలో యోగేంద్ర మెహ్తా బాబా తన మీద అత్యాచారం చేశాడని బాధితురాలు ఆరోపించింది.

దేవుడు చెప్పాడు.... నేను చేశాను అంతే

దేవుడు చెప్పాడు.... నేను చేశాను అంతే

తన మీద మీరు ఎందుకు అత్యాచారం చేశారు అని తాను యోగేంద్ర మెహ్తాను ప్రశ్నిస్తే ఇది అత్యాచారం కాదని, దేవుడు ఈ రకంగా మిమ్మల్ని శీర్వదించాలని చెప్పాడని, నేను ఆ పని చేశాను అంతే అంటూ యోగేంద్ర మెహ్తా మాయమాటలు చెప్పాడని ఆరోపిస్తూ బాధితురాలు జైపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయం బయటకు తెలిస్తే పరిస్థితులు వేరుగా ఉంటాయని యోగేంద్ర మెహ్తా తమను బెదిరించాడని బాధితురాలు ఆరోపించారు.

ఒకే ఫ్యామిలీలో ముగ్గురు మహిళలు, నాలుగు రేప్ కేసులు

ఒకే ఫ్యామిలీలో ముగ్గురు మహిళలు, నాలుగు రేప్ కేసులు

బాధితురాలితో పాటు ఆమె కుటుంబంలోని మరో ఇద్దరు మహిళలు (బాధితురాలి వదినలు) మీద కూడా యోగేంద్ర మెహ్తా అత్యాచారం చేశాడని ఫిర్యాదులు చెయ్యడంతో జైపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఒకే ఫ్యామిలీలో ముగ్గురు మహిళలతో పాటు ఆశ్రమంలో ఉన్న మరో మహిళ కూడా యోగేంద్ర మెహ్తా మీద రేప్ కేసు పెట్టిందని జైపూర్ లోని కేసు విచారణ చేస్తున్న సీనియర్ పోలీసు అధికారి ముకేష్ చౌధరి స్థానిక మీడియాకు చెప్పారు.

  ఐరన్ లెగ్ కాదు గోల్డెన్ లెగ్ తెలుసుకోండిరా సన్నాసుల్లారా : రోజా || Oneindia Telugu
  సినిమా చూపించిన బాబా అరెస్టు

  సినిమా చూపించిన బాబా అరెస్టు

  మూడు వారాల నుంచి యోగేంద్ర మెహ్తాను అరెస్టు చెయ్యలని జైపూర్ పోలీసులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అనేక రాజకీయ పార్టీల నాయకులు, శ్రీమంతులు, బిగ్ షాట్స్ యోగేంద్ర మెహ్తాకు శిష్యులు కావడంతో ఆయన్ను అరెస్టు చెయ్యకూడదని పోలీసులు మీద అనేక రకాలుగా ఒత్తిడి వచ్చిందని ఆరోపణలు ఉన్నాయి. మూడు వారాల నుంచి అనేక ప్రయత్నాలు చేసిన జైపూర్ పోలీసులు ఎట్టకేలకు యోగేంద్ర మెహ్తా బాబాను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. మహిళల మీద అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ ఓ ఫేమస్ బాబా అరెస్టు కావడం రాజస్థాన్ లో కలకలం రేపింది.

  English summary
  Fake BABA: A fake godman, accused of raping four women, has been arrested by the Jaipur Police on Tuesday. Three women from the same family had alleged that the 'Tapaswi Baba' raped them in his ashram after giving them prasad mixed with cannabis.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X