వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

fact check: పన్ను చెల్లింపుదారులు 18 శాతం డబ్బు డిపాజిట్ చేయాలా?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఓ వైపు కరోనావైరస్ మహమ్మారితో పోరాడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నకిలీ వార్తలు పెద్ద తలనొప్పిగా మారుతున్నాయి. కొందరు దుండగులు కరోనాతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఆదేశాలంటూ తప్పుడు కథనాలను సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు.

 చైనాకు రిలీఫ్-ట్రంప్‌కు షాక్: కరోనావైరస్ సృష్టిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పిందంటే..? చైనాకు రిలీఫ్-ట్రంప్‌కు షాక్: కరోనావైరస్ సృష్టిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పిందంటే..?

తాజాగా, ఓ తప్పుడు వార్త సోషల్ మీడియా వేదికగా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయంలో 18శాతం తప్పనిసరిగా డిపాజిట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందంటూ వాట్సాప్‌లో ఓ సందేశం ప్రచారం జరుగుతోంది.

Fake:It is not compulsory for you to deposit 18 per cent of your income in CDS

'డబ్బును బయటికి తీసేందుకు సిద్ధంగా ఉండండి. ప్రభుత్వం సీడీఏ-1963ను తీసుకురావడానికి ప్రణాళికలు వేస్తోంది. అందరు పన్నుచెల్లింపుదారులు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ చట్టం ప్రకారం నిర్బంధ డిపాజిట్ చేయాలి. ఇలాంటి చర్యలు ఆశించినవి కాదని గుర్తించాలి. 1962, 1971 యుద్ధాల తర్వాత చాలా బలమైన చర్యలు తీసుకున్నారు. నిర్బంధ డిపాజిట్ స్కీం(ఐటీపీ) చట్టం పన్ను చెల్లింపుదారులు 18శాతం ఆదాయాన్ని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది' అని ఆ వాట్సాప్ సందేశం సారాంశం.

ఫేక్ న్యూస్ బస్టర్

అయితే, ఈ వాట్సాప్ సందేశంలో ఎలాంటి వాస్తవం లేదు. పన్ను చెల్లింపుదారులు తప్పనిసరిగా 18శాతం డబ్బును డిపాజిట్ చేయాలంటూ ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. అలాంటి ఆలోచన కూడా ప్రభుత్వం చేయడం లేదు.

ఇది ఇలావుండగా, ఐటీ శాఖలోని 50 మంది ఐఆర్ఎస్ అధికారులు కరోనాతో పోరాడేందుకు రెవెన్యూ మొబిలైజేషన్ పనిలో ఉన్నారని వార్తలు కూడా ప్రచారం జరిగాయి. ఇదంతా సేవా నిబంధనలకు విరుద్ధంగా జరుగుతోందని ఆర్థిక శాఖ తెలిపింది.

English summary
There is a message circulating on WhatsApp that claims that the government will bring in an Act which would make it compulsory for tax payers to deposit 18 per cent of their income.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X