వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాయాలేడీ: టెక్కీనంటూ 9 పెళ్ళిళ్ళు, ఎక్కడంటే?

టెక్కీగా పనిచేస్తున్నాను. భర్తను కోల్పోయానని పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి పదో పెళ్ళికి సిద్దమైంది ఓ యువతి.

By Narsimha
|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: టెక్కీగా పనిచేస్తున్నాను. భర్తను కోల్పోయానని పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి పదో పెళ్ళికి సిద్దమైంది ఓ యువతి. అయితే పదో పెళ్ళికి హజరైన పెళ్ళికొడుకు స్నేహితుడు వధువును గుర్తించడంతో ఆమె అసలు బాగోతం బయటపడింది.దీంతో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో చోటుచేసుకొంది.

కేరళ రాష్ట్రంలో ఓ కిలాడీ లేడీ పదిమందిని మోసం చేసింది. టెక్కీగా పనిచేస్తున్నానని వార్తా పత్రికల్లో ప్రకటనలిచ్చి వివాహం చేసుకోవడం , పెళ్ళిరోజే నగదు, నగలతో జంప్ అయ్యేది. అయితే ఎట్టకేలకు ఆమె మోసాలకు తెరపడింది. పదో పెళ్ళికొడుకు ఆమె చేతిలో బలికాకుండా తప్పించుకొన్నాడు.

Fake Marriages, Shalini Cheats many men in Kerala

భర్తను కోల్పోయిన వధువును పెళ్ళిచేసుకొనేందుకు వరుడు కావాలని షాలిని ప్రకటన ఇచ్చింది. ఆ ప్రకటనలో తాను సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నానని ప్రకటించింది.

ఈ ప్రకటనను చూసిన ఓ వ్యక్తి ఆమెకు ఫోన్ చేశాడు. అయితే తన భర్తను కోల్పోయానని సాప్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నానని అతడిని నమ్మించింది. దీంతో ఆమెను వివాహం చేసుకొనేందుకు అతను సమ్మతించాడు.

అయితే ఈ పెళ్ళికి వరుడి స్నేహితులు, బంధువులు మాత్రమే హజరయ్యారు. వధువు తరపువారెవ్వరూ కూడ హజరుకాలేదు. వరుడు తరపున పెళ్ళికొచ్చిన ఓ స్నేహితుడు ఫోన్ లో మరో వ్యక్తికి ఫోన్ చేశాడు.

అయితే అతను కూడ ఈ వివాహనికి వచ్చాడు. వధువుగా మారిన షాలిని బండారాన్ని అతను కనిపెట్టాడు. షాలిని చేతిలో మోసపోయిన వ్యక్తి ఆమె బండారాన్ని పెళ్ళి మండపంలోనే బయటపెట్టాడు. దీంతో ఆమె పదోపెళ్ళి చేసుకోకుండానే ఆగిపోయింది.

బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితురాలిపై ఇప్పటికే ఐదు కేసులున్నట్టుగా పోలీసులు చెప్పారు. ఆమెను అరెస్టు చేసి దర్యాప్తుకు పంపారు.

English summary
Shalini, cheated many men fake marriages. it was a woman who married many times and vanishes with the groom’s money. Very lately Shalini experienced in fake marriage jilted her groom Saseedhran Nair and left with jewellery and money. She fell into the trap of police in their united operation with cyber cell. It was after four days of extensive search police caught Shalini.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X