వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

CBSE క్లారిటీ: 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలు ఇప్పుడు కాదు.. ఎప్పుడో తెలుసా..?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఏప్రిల్ 22, 2020 నుంచి సీబీఎస్‌ఈ 10వ తరగతి, 12వ తరగతి బోర్డు ఎగ్జామ్స్‌ను నిర్వహిస్తోందన్న వార్త షికారు చేస్తోంది. అంతేకాదు పరీక్షల పేపర్లను ఏప్రిల్ 25 నుంచి దిద్దుతారనే వార్త కూడా ప్రచారం జరిగింది. అయితే షికారు చేస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని విద్యార్థులు ఇలాంటి పుకార్లను వదంతులను నమ్మరాదని సీబీఎస్‌ఈ ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. ఇలాంటి ప్రకటన సీబీఎస్‌ఈ చేయలేదని స్పష్టం చేసింది.

అన్ని పరీక్షలు వాయిదా

అన్ని పరీక్షలు వాయిదా

19 మార్చి 2020 నుంచి 31 మార్చి 2020వరకు అన్ని పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు సీబీఎస్ఈ మార్చి 18 ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది. అంతేకాదు పరీక్షల నిర్వహణకు సంబంధించి బోర్డు వెబ్‌సైట్‌పై ఉంచుతామని స్పష్టం చేసింది. అంతేకాదు ప్రస్తుత పరిస్థితిపై సమీక్ష చేసిన తర్వాతే పరీక్షలకు సంబంధించి కొత్త తేదీలను వెల్లడిస్తామని వెల్లడించారు. అంతేకాదు విద్యార్థుల అకాడెమిక్స్‌ను దృష్టిలో ఉంచుకుని బోర్డు పనిచేస్తుందని సీబీఎస్ఈ వెల్లడించింది.

పరిస్థితులు మెరుగుపడ్డాకే...

పరిస్థితులు మెరుగుపడ్డాకే...

కోవిడ్-19 దేశాన్ని కుదిపేస్తున్న దృష్ట్యా లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో పరిస్థితులను సమీక్షించిన తర్వాతే పరీక్షల నిర్వహణపై ఒక నిర్ణయానికి వస్తామని అంతవరకు వదంతులను నమ్మరాదని వెల్లడించింది. అయితే విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వారికి కొన్ని సూచనలు ఇవ్వడం జరుగుతోందని సీబీఎస్ఈ పేర్కొంది. ఒకటవ తరగతి నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులను ప్రమోట్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఎన్‌సీఈఆర్‌టీని సంప్రదించిన మేరకే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని బోర్డు క్లారిటీ ఇచ్చింది.

9వ తరగతి 11వ తరగతి పరీక్షలపై క్లారిటీ

9వ తరగతి 11వ తరగతి పరీక్షలపై క్లారిటీ

ఇక సీబీఎస్‌ఈ అనుబంధ స్కూళ్లలో ఇప్పటికే కొన్ని స్కూళ్లు 9వ తరగతి 11వ తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాయి. మరి కొన్ని స్కూళ్లు నిర్వహించలేదు. అయితే అలాంటి వారు మాత్రం విద్యార్థుల ఇప్పటికే రాసిన టెస్టులు, ప్రాజెక్టులు, టర్మ్ ఎగ్జామ్స్‌ను ఆధారంగా చేసుకుని వారిని ప్రమోట్ చేయాలని సూచనలు చేసింది. ఒకవేళ విద్యార్థులు ఈ అంతర్గత ప్రక్రియలో క్లియర్ కాలేదంటే వారికి ఆన్‌లైన్ ద్వారా లేదా ఆఫ్ లైన్ ద్వారా ఈసమయంలోనే స్కూలు టెస్టును నిర్వహించాలని సూచించింది.

10వ తరగతి 12వ తరగతి పరీక్షలపై వివరణ

10వ తరగతి 12వ తరగతి పరీక్షలపై వివరణ


ఇక 10వ తరగతి 12వ తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి ఉన్నత విద్యాశాఖ అధికారులతో చర్చించాక ఒక నిర్ణయం తీసుకుంటామని సీబీఎస్ఈ బోర్డు స్పష్టం చేసింది. అదే సమయంలో విద్యార్థులు రాసే ఎంట్రెన్స్ పరీక్షలు, అడ్మిషన్స్ తేదీలను కూడా పరిగణలోకి తీసుకుని కొత్త పరీక్ష తేదీలను ప్రకటిస్తామని సీబీఎస్ఈ వెల్లడించింది. అయితే బోర్డు పరీక్షలకు 10 రోజుల ముందే అందరికీ నోటీసు ద్వారా తెలియజేయడం జరుగుతుందని సీబీఎస్ఈ పేర్కొంది.

English summary
A press release stating that the CBSE class 10 and 12 exams would resume from April 22 2020 has been doing the rounds. The release also notes that the evaluation of the answer sheets would resume from April 25 onwards. However this is a fake press release and students are advised not to believe in it. No such announcement has been made by the CBSE.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X