వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Fake news:హెలికాఫ్టర్ నుంచి ప్రభుత్వం డబ్బులు జారవిడుస్తుందనే వార్తలో నిజమెంత..?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కరోనావైరస్ పై సోషల్ మీడియాలో చాలా వదంతులు వస్తున్నాయి. ఇప్పటికే ఈ వదంతులను నమ్మి పలువురు నష్టాలు కోరి తెచ్చుకున్నారు కూడా. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను లేదా వదంతులను నమ్మొద్దని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నాయి. అంతేకాదు ప్రభుత్వం సూచించిన విధానాలనే పాటించాలని కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. ఇక తప్పుడు వార్తలపై కూడా ప్రభుత్వం నిఘా పెంచింది. అవాస్తవాలను అదే పనిగా ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలకు దిగుతోంది ప్రభుత్వం.

ప్రధాని నరేంద్ర మోడీ ప్రతి ఒక్కరికీ రూ.15 లక్షలు ఇస్తారనే ఫేక్ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయిన కొద్ది రోజులకే మరో వార్త సోషల్ మీడియాను చుట్టేస్తోంది. హెలికాఫ్టర్ ద్వారా డబ్బులను ప్రభుత్వం జారవిడుస్తుందనే వార్త సోషల్ మీడియాను చుట్టుస్తోంది. అంతేకాదు ఇదే వార్త వాట్సాప్‌లో కూడా షికారు చేస్తోంది. అయితే ఈ వార్తను నమ్మొద్దని ప్రభుత్వం ప్రజలకు స్పష్టం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం రెండో ఆర్థిక ప్యాకేజీపై ఆలోచిస్తున్న మాట వాస్తవమే కానీ... హెలికాఫ్టర్ల ద్వారా డబ్బులు పంపిణీ చేస్తుందని చక్కర్లు కొడుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని క్లారిట ఇచ్చింది. ఇది పూర్తిగా అవాస్తవమని వెల్లడించింది.

Fake: News making rounds that government will drop money from helicopters is false

Recommended Video

India Lockdown 2.0 : KCR To Take A Key Decision On April 20th Over Coronavirus Lockdown

అంతకుముందు ప్రధాని నరేంద్ర మోడీ ప్రతి భారతీయుడికి రూ.15వేలు ఇస్తారనే వార్త వైరల్ అయ్యింది. ఈ కష్ట సమయాల్లో ప్రధాని రూ.15వేలు ఇవ్వాలని భావిస్తున్నట్లు వార్త షికారు చేసింది. అయితే అది పూర్తిగా అవాస్తవమని అలాంటి ఆలోచన ప్రధానికి లేదని స్పష్టం చేసింది ప్రభుత్వం. కేవలం మే 3వ తేదీ వరకు మాత్రమే లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ ప్రధాని తన ప్రసంగంలో చెప్పారని ప్రభుత్వం గుర్తు చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల పట్ల ప్రజలు అప్రమత్తతతో వ్యవహరించాలని ఒకవేళ ఏదైనా వార్త ప్రభుత్వం పేరుతో సర్క్యులేట్ అయితే సంబంధిత అధికారులతో ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని నిర్థారించుకోవాలని పోలీసులు కూడా సూచిస్తున్నారు.

English summary
A post has gone viral stating that the government would be dropping money from helicopters.The post has been shared several times and even forwarded on WhatsApp. Please do not believe this. The government is planning a second economic package and that does not include dropping of money from choppers. This is fake information.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X