వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Fact Check: కరోనా ఎఫెక్ట్: అక్టోబర్ 15 వరకు హోటళ్లు, రెస్టారెంట్లు బంద్: కేంద్రం ఏం చెబుతోంది?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా అన్ని హోటళ్లను కేంద్ర ప్రభత్వం అక్టోబర్ 15వ తేదీ వరకు పొడిగించబోతోందనే ఓ సమాచార సోషల్ మీడియాలో జోరుగా సర్క్యులేట్ అవుతోంది. హోటళ్లు మాత్రమే కాకుండా.. పర్యాటకులు నివసించడానికి వీలుగా ఉండే రిసార్టులు, రెస్టారెంట్లను కూడా ఆరు నెలల వరకు మూసివేస్తారని, కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికే కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుందనేది దీని సారాంశం.

మొన్న హెల్మెట్: హైదరాబాద్ రోడ్లపై కరోనా కారు: 100 సీసీ ఇంజిన్.. 40 కిలోమీటర్ల వేగంమొన్న హెల్మెట్: హైదరాబాద్ రోడ్లపై కరోనా కారు: 100 సీసీ ఇంజిన్.. 40 కిలోమీటర్ల వేగం

దీనిపై పర్యాటక మంత్రిత్వ శాఖ అధికారులు క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతోన్న ఆ వార్తలు గానీ, సమాచారం గానీ నిరాధారమైనదని తేల్చి చెప్పారు. తాము అలాంటి సమాచారాన్ని ఏదీ వెల్లడించలేదని అన్నారు. వైరస్‌ను వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి వీలుగా ఇప్పుడున్న లాక్‌డౌన్ పరిస్థితుల్లోనే హోటళ్లు, రెస్టారెంట్లు, రిసార్టులను మూసివేయాల్సి వచ్చిందని, దీన్ని పొడిగించాలనే ప్రతిపాదన ఏదీ తమ వద్ద లేదని చెప్పారు.

Fake: not ordered closure of all hotels till October 15 2020, says Tourism Ministry

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాక్‌డౌన్‌పై తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా తాము హోటళ్లను పునరుద్ధరించడంపై తదుపరి చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. లాక్‌డౌన్‌ పొడిగించడంపై ప్రధానమంత్రి కార్యాలయం ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదని వెల్లడించారు. దీనికోసం ఆయన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మరోసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించబోతున్నారని తెలిపారు.

English summary
There is a message in circulation claiming that hotels and restaurants will remain closed until October 15 2020. A circular that is being attributed to the Ministry of Tourism says hotels, restaurants and resorts all over India will remain closed until October 15 2020 due to coronavirus disease spread all over the world. And most important North Indian hotels, resorts, restaurants will ceased (sic) till the date. If the rules are flouted then a case will be registered, the circular also read.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X