వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Fake Alert : ఎస్‌బీఐలో ఆధార్ ఆధారిత లావాదేవీలను నిలిపివేయలేదు..

|
Google Oneindia TeluguNews

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) యూఐడీఏఐ ఆధార్ ఆధారిత చెల్లింపు ప‌ద్ధ‌తిని (ఏఈపీఎస్) నిలిపివేసినట్టుగా సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రచారమవుతోంది. దీని ప్రకారం ఏఈపీఎస్ పద్దతి ద్వారా ఇకపై ఎస్‌బీఐ నుంచి ఎవరూ డబ్బులను ఉపసంహరించుకోవడానికి అవకాశం ఉండదు. దీనికి సంబంధించిన సర్వర్‌ను ఎస్‌బీఐ తాత్కకంగా స్తంభింపజేయడంతో ఈ పరిస్థితి తలెత్తినట్టు ప్రచారంలో ఉంది.

ఏప్రిల్ 14 వరకు సర్వర్ డౌన్ ఉంటుందని.. అప్పటివరకు ఎవరైనా ఏఈపీఎస్ పద్దతిలో లావాదేవీలు నిర్వహిస్తే డబ్బులు అందులోనే నిలిచిపోయే అవకాశం ఉందని అందులో చెబుతున్నారు.అయితే ఇది పూర్తిగా ఫేక్ న్యూస్. ఆర్‌బీఐ ఇప్పటివరకూ అలాంటి ఆదేశాలేవీ ఇవ్వలేదు. కాబట్టి ఎవరూ దీన్ని నమ్మవద్దు.

Fake: RBI has not frozen SBIs AePS server

గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఏఈపీఎస్ విధానంలో లావాదేవీలు జరుగుతున్నాయి. ఈ విధానంలో అకౌంట్ నంబర్‌,ఆధార్ సంఖ్యతో అనుసంధానిస్తే చాలు.. ఆధార్ బయోమెట్రిక్స్ ద్వారా లావాదేవీలు జరపవచ్చు. ఆధార్ కోసం మీరు ఇచ్చిన వేలి ముద్రలతో వీటిని పోల్చిచూస్తారు.

ప్రభుత్వ పథకాలకు చెందిన సబ్సిడీని పొందేందుకు ఏపీఈఎస్ విధానం ఉపయోగపడుతోంది. ప్రస్తుతం మన దేశంలో లక్షలాది మంది ప్రజలు దీనిపై ఆధారపడివున్నారు. కాబట్టి లాక్ డౌన్ పీరియడ్‌లో ఫేక్ న్యూస్‌లతో వారిలో అనవసర భయాందోళనలు రేకెత్తించవద్దు.

English summary
A message on the social media stating that the Aadhar enabled Payment System of the State Bank of India has been suspended.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X