బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

షాక్: ‘దిస్ ఈజ్ షూటింగ్ పర్పస్’! ఏటీఎం నుంచి రూ.2వేల ఫేక్ నోటు

కర్ణాటకలోని బెంగళూరులో మంగళవారం ఓ వ్యక్తి ఏటీఎంలో నగదు డ్రా చేయగా అందులో వచ్చిన నోటును చూసి షాకయ్యాడు. అది నకిలీ నోటు అని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటకలోని బెంగళూరులో మంగళవారం ఓ వ్యక్తి ఏటీఎంలో నగదు డ్రా చేయగా అందులో వచ్చిన నోటును చూసి షాకయ్యాడు. అది నకిలీ నోటు అని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

వివరాల్లోకి వెళితే.. దయానందరెడ్డి అనే వ్యక్తి లక్కసంద్ర రెండో క్రాస్‌లో ఉన్న యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంకు వెళ్లి రూ. 6వేల నగదు డ్రా చేశారు. కాగా, మూడు రూ.2వేల నోట్లు వచ్చాయి. ఆ తర్వాత సమీపంలోని పెట్రోల్ బంక్‌కు వెళ్లి.. ఏటీఎం నుంచి తీసిన ఓ రూ.2వేల నోటు ఇచ్చారు.

Fake Rs 2000 note in Axis Bank ATM

అయితే, దయానంద్ ఇచ్చింది నకిలీ రూ.2వేల నోటు అని గుర్తించిన పెట్రోల్ బంక్ సిబ్బంది, ఆ నోటను తీసుకోలేదు. దీంతో దయానంద్ ఆ నోటును పరిశీలనగా చూసి ఒక్కసారిగా అవాక్కయ్యాడు.

ఆ నోటు మీద రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉండాల్సిన చోట.. 'దిస్ ఈజ్ షూటింగ్ పర్పస్ ఓన్లీ' అని ఆంగ్ల అక్షరాల్లో ముద్రించి ఉండటం గమనార్హం. దీనిపై లక్కసంద్ర పోలీసులకు ఫిర్యాదు చేయగా.. స్వీకరించలేదని అని చెప్పారు.
అంతేగాక, యాక్సిస్ బ్యాంకుకు వెళ్లి ఆ నకిలీ నోటును చూపించినా స్పందించలేదని బాధితుడు వాపోయారు. తాజాగా విడుదలైన కొత్త రూ.2వేల నోటు ముదురు గులాబీ రంగులో ఉంటుంది. పొడవు 66మి.మీ ఉంటుంది.

English summary
After photocopies and the Children Bank of India rows, now Rs 2000 notes have been found with the text 'This Is For Shotting Purpose Only'. The Public TV reported that an Axis Bank ATM in Lakkasandra released the faulty Rs 2000 note with weird text on the top right side of the note.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X