• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

షిరిడీ సాయితో డైరెక్టు కాంటాక్ట్.. మీ పాపాలు తొలగిస్తా.. లేడీ బాబా కొంపముంచిందిగా..!

|

ముంబై : రోగాలు నయం చేస్తానంటూ లక్షలు గుంజింది. అంతేకాదు మీ కుటుంబ సభ్యుల చిక్కులు తొలగిస్తానంటూ ఉన్నకాడికి ఊడ్చేసింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఏకంగా షిరిడీ సాయి పేరునే వాడేసింది. బాబాతో డైరెక్టుగా మాట్లాడి మీ సమస్యలకు పరిష్కారం చూపుతానంటూ నమ్మించింది. ఆ మాయ లేడీ కిలాడీ చెప్పినదానికి గొర్రెలా తలూపిన బాధితురాలు లక్షలు పోగొట్టుకున్నాక గానీ కళ్లు తెరవలేదు.

తనకు తాను దైవాంశ సంభూతురాలిగా ప్రకటించుకున్న ఓ లేడీ బాబా అమాయకురాలిని నట్టేట ముంచింది. చెప్పినదానికి తలూపడంతో గొర్రెలా భావించి అందినకాడికి దండుకుంది. ముంబైలో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చానీయాంశమైంది. బాధితురాలి బాధను ఆసరాగా చేసుకుని 12 లక్షల 75 వేల రూపాయల వరకు లాగేసింది సదరు ఫేక్ బాబా.

fake woman baba cheated and arrested in mumbai

ఇస్మార్ట్ కొడుకు.. అయ్య ఫోనులో గేమ్స్ ఆడుతూ.. రాసలీలల బాగోతం బయటేశాడుగా..!

ముంబైకి చెందిన కిరణ్ దారువాలా అలియాస్‌ గురుమ.. దైవాంశ సంభూతురాలిగా చలామణీ అవుతోంది. అమాయకులను బుట్టలో వేసుకుంటూ తన పైత్యాన్ని రుచి చూపిస్తోంది. సమస్యల పరిష్కారానికి దారి చూపుతానంటూ.. బాధితుల నుంచి లక్షలకు లక్షలు గుంజుతోంది. ఆ క్రమంలో ముంబైలోని ఖార్‌ పశ్చిమ ప్రాంతానికి చెందిన 34 ఏళ్ల మహిళ ఇటీవల సదరు బురిడీ బాబాను సంప్రదించారు. అత్తగారి ఆరోగ్యం బాగాలేదని.. ఇంట్లో తరచూ సమస్యలు వస్తున్నాయని.. ఎలాగైనా అవి పరిష్కారం అయ్యేలా మార్గం చూపాలని కోరారు.

అయితే ఆ మహిళ బాధను అర్థం చేసుకోపోగా.. ఉల్టా ఆమెను మరింత ఇరకాటంలో పడేసింది ఆ లేడీ కిలాడీ. దైవ శక్తులతో సమస్యలు పారిపోయేలా చేస్తానంటూ నమ్మించి మోసం చేసింది. పోయిన జన్మలో నీతో పాటు నీ భర్త పాపాలు చేసిన ఫలితమే ఇప్పుడు అనుభవిస్తున్నారని కల్లిబొల్లి మాటలు చెప్పింది. రోజులు గడుస్తున్నా ఆమె సమస్యలు ఎక్కడ వేసినా గొంగళి అక్కడే అన్న చందంగా ఉండటంతో చివరకు పోలీసులను ఆశ్రయించారు. పూజల పేరుతో తన దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడమే గాకుండా.. ఫేక్ బాబా అనుచరులు తనపై లైంగికదాడికి పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బురిడీ బాబా ఆట కట్టించి అరెస్ట్‌ చేశారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Fake Lady Baba Cheated Woman in the name of Puja at Mumbai. She collected huge amount around twelve lakh seventy five thousand rupees and her followers harassed sexually. Atlast that victim awaked and complaints to police, then fake lady baba arrested.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more