వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Fact Chek:కరోనాపై సోషల్ మీడియా వేదికగా జోకులు పేలిస్తే చర్యలు ఉంటాయా..?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: న్యూఢిల్లీ: కరోనావైరస్‌తో దేశం మొత్తం లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. ఈ సమయంలోనే సోషల్ మీడియా వేదికగా పలు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇందులో సగానికి పైగా వార్తలు బూటకపు వార్తలే కావడం విశేషం. సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతున్న ఫేక్ న్యూస్ పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని కోరుతోంది పోలీస్ శాఖ.

ఈ వార్తలను నమ్మి కొందరు ఇదే నిజమనే భ్రమలో ఉంటున్నారు. లాక్‌డౌన్ సమయంలో ఏ వార్త వచ్చినా అది ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిందా లేదా అనేది మరొకసారి సరి చూసుకోవాలి. ఆ తర్వాతే ముందుకు వెళ్లడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త హల్చల్ చేస్తోంది. కరోనావైరస్ పై జోకులు పేల్చేవారిపై ప్రభుత్వం కఠిన చర్యలకు దిగుతోందనే వార్త సోషల్ మీడియాను చుట్టేస్తోంది. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. " గ్రూపులో కరోనావైరస్‌పై జోకులు పేలుస్తూ పోస్టులు పెడితే గ్రూప్‌ అడ్మిన్ పై పోలీసులు సెక్షన్ 68,140, 188 ల కింద కేసులు నమోదు చేస్తారు.

False news:Govt did not issue any orders to punish those who post Jokes on Social media

కాబట్టి గ్రూప్ అడ్మిన్ జాగ్రత్తగా ఉండాలి. రెండ్రోజుల పాటు గ్రూపును మూసివేయాల్సిందిగా కోరుతున్నాం.లేదంటే అంతా ఇబ్బందుల్లో పడతారు. కాబట్టి గ్రూప్ అడ్మిన్స్ అంతా సరైన చర్యలు తీసుకోవాలి " అని పేర్కొంటూ ఒక మెసేజ్ సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతోంది.

ఇదిలా ఉంటే కరోనావైరస్‌పై జాగ్రత్తతో వ్యవహరించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే వాట్సాప్‌తో పాటు ఇతర సోషల్ మీడియాల్లో వస్తున్నట్లుగా రూమర్లకు చెక్ చెప్పాలని కోరింది. కరోనావైరస్‌పై జోకులు పేలిస్తే చర్యలు ఉంటాయనేది అవాస్తవమని దీనిపై ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని ఫ్యాక్ట్ చెక్ ద్వారా తెలుస్తోంది. అంతేకాదు దీనిపై ఎలాంటి అడ్వైజరీ కూడా జారీ చేయలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

English summary
There is a message that is being circulated widely which says that those who post jokes relating to coronavirus will be acted upon.This is false and govt had not issued any such order.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X