• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

family: అత్త, కోడలు టీవీ సీరియల్ ఫైటింగ్, నీ మొగుడు ఎవడే, నువ్వు పెద్ద పతివ్రతవా ?, దెబ్బకు ఫినిష్!

|

అహ్మదాబాద్/ గుజరాత్/ జైపూర్: నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు అత్తా కోడల మద్య చిన్నచిన్న విషయాల్లో టీవీ సీరియల్ టైపులో గొడవలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో కోడలు గర్బవతి అయ్యింది. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డనకు తండ్రి నా కోడుకా ? లేక నీ బావా ? అంటూ అత్త సూటిపోటి మాటలు మాట్లాడింది. నువ్వు ఏదో పెద్ద పతివ్రతలాగా మాట్లాడుతున్నావు అంటూ కోడలు ఎదురు తిరిగింది. అంతే మాటామాటా పెరిగిపోవడంతో సహనం కోల్పోయిన కోడలు మంచి బలంగా ఉన్న ఇనుప రాడ్ తీసుకుని అత్తను ఒకే దెబ్బకు కొట్టి చంపేసింది. పనిలో పనిగా ఇంట్లోనే అత్తను తగలబెట్టేసింది. అక్రమ సంబంధం విషయంలో గొడవ మొదలై టీవీ సీరియల్ లో లాగా పగాప్రతీకారంతో అత్త పైలోకాలకు వెళ్లిపోయింది.

Bedroom effect:తల్లికి తాటి బెల్లం, కూతురికి ?ఇన్ స్టాగ్రామ్ ఫ్రెండ్, బెడ్ రూమ్ లోకి తల్లి ఎంట్రీతో

తల్లిదండ్రులతో దంపతులు

తల్లిదండ్రులతో దంపతులు

రాజస్థాన్ కు చెందిన దీపక్ (32), జైపూర్ కు చెందిన నికితా (29)కి వివాహం అయ్యింది. ఉద్యోగరీత్యా దీపక్ గుజరాత్ లోని అహ్మదాబాద్ చేరుకున్నాడు. దీపక్, నికితా దంపతులతోనే అతని తల్లిదండ్రులు రామ్ నివాస్, రేఖా నివాసం ఉంటున్నారు. ప్రతిరోజు ఉదయం దీపక్ ఆఫీసుకు వెళ్లి రాత్రి తిరిగి వస్తుంటాడు.

టీవీ సీరియల్ ఫైటింగ్

టీవీ సీరియల్ ఫైటింగ్

నికితా ఉద్యోగం చెయ్యకుండా అత్తామామలు రామ్ నివాస్, రేఖాతో కలిసి ఇంట్లోనే ఉంటున్నది. అయితే మనం నిత్యం చూస్తూ ఉండే టీవీ సీనియల్స్ లో అత్తా, కోడలు ఎలా పోట్లాడుకుంటారో, పెత్తనం కోసం ఎలా ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటుంటారో అలాగే నికితా ఆమె అత్త రేఖా చిన్నచిన్న విషయాల్లో గొడవలు పడుతున్నారు. నికితాకు ఆమె భర్త దీపక్ ఇంతకాలం సర్దిచెబుతూ పెద్దలతో సర్దుకుపోవాలని చెబుతూ వస్తున్నాడు.

ఏమే రంకులాడి..... ఈ బిడ్డకు తండ్రి ఎవరు ?

ఏమే రంకులాడి..... ఈ బిడ్డకు తండ్రి ఎవరు ?

నికితా ప్రస్తుతం నాలుగు నెలల గర్బవతి. నికితా ఇంటికి ఆమె బావ వచ్చి వెలుతున్నాడు. ఇటీవల ఏమే రంకులాడి నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి నాకోడుకు దీపక్ నా లేక నీ బావనా అంటూ అత్త రేఖా నికితాను ప్రశ్నించింది. మాటలు మర్యాదగా మాట్లాడు, నీ కోడుకుతో కాపురం చెయ్యడం వలనే నేను ఓ బిడ్డకు తల్లి అవుతున్నానని నికితా ఆమె అత్త రేఖాకు గట్టిగానే సమాధానం చెబుతూ వచ్చింది.

 నువ్వు ఏమనా పెద్ద పతివ్రతవా ?

నువ్వు ఏమనా పెద్ద పతివ్రతవా ?

ప్రతిరోజు నీ బిడ్డకు తండ్రి ఎవరు ? అంటూ అత్త రేఖా ప్రశ్నించడంతో సహనం కోల్పోయిన నికితా నువ్వు ఏమైనా పెద్ద పతివ్రతను అనుకుంటున్నావా ? నీ గురించి నాకు తెలీదా ? అంటూ నికితా కూడా ఎదురుతిరగడంతో అత్తాకోడలి గొడవలు తారాస్థాయికి చేరిపోయాయి. ఇదే సమయంలో నికితా మామ రామ్ నివాస్ కు కరోనా పాజిటివ్ అని వెలుగు చూడటంతో ఆయన్ను అహ్మదాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

ఒకే దెబ్బకు అత్త ఫినిష్

ఒకే దెబ్బకు అత్త ఫినిష్

ఈ రోజు నీతో కులకడానికి నీ బావా రాలేదా ? అంటూ గురువారం అత్తా రేఖా కోడులు నికితాను సూటిపోటి మాటలు తిట్టిందని తెలిసింది. ఆ సమయంలో సహనం కోల్పోయిన నికితా అలా మాట్లాడకూడదని నీకు ఎన్నిసార్లు చెప్పాలి అంటూ ఇనుప రాడ్ తీసుకుని అత్త రేఖా తల మీద బలంగా కొట్టింది. తల చిట్లిపోవడంతో రేఖా గట్టిగా కేకలు వేస్తూ అక్కడిక్కడే మరణించింది. అత్త రేఖా చనిపోయిందని తెలుసుకున్న నికితా నేల మీద పడిన రక్తం మరకలు శుభ్రం చేసింది. తరువాత రేఖా శరీరం పై కిరోసిన్ పోసి నిప్పంటించింది. రేఖా కేకలు వేస్తున్న విషయం గుర్తించిన స్థానికులు వెంటనే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రామ్ నివాస్ కు సమాచారం ఇచ్చారు. కొడుకు దీపక్ కు ఫోన్ చేసిన రామ్ నివాస్ వెంటనే ఇంటికి వెళ్లి చూడాలని చెప్పాడు.

ఇంటి డోర్లు మొత్తం లాక్

ఇంటి డోర్లు మొత్తం లాక్

తండ్రి రామ్ నివాస్ ఫోన్ చేసి చెప్పడంతో దీపక్ వెంటనే ఇంటికి వెళ్లాడు. ఇంటి లోపల అన్ని తలుపులు లాక్ చేసి ఉండటంతో తల్లి రేఖాను, భార్య నికితాను పిలిచిపిలిచి, కాలింగ్ బెల్ వేసివేసి విసిగిపోయిన దీపక్ బాల్కనీలో ఎక్కి ఇంటిలోపలికి వెళ్లాడు. అప్పటికే తల్లి రేఖా శరీరం అర్దంకాలిపోయిన విషయం గుర్తించిన దీపక్ షాక్ కు గురైనాడు. బెడ్ రూమ్ లో ఉన్న భార్య నికితాను బయటకు పిలిచిన దీపక్ ఏం జరిగింది ? అని ప్రశ్నించాడు. తనకు నీరసంగా ఉంటే వెళ్లి నిద్రపోయానని, తనకు ఏమీ తెలీదని, ఎవరో వచ్చి తలుపులు తట్టారని, అత్త వెళ్లి తలుపులు తీసిందని, వచ్చిన వాళ్లే హత్య చేసి ఉంటారని భార్య నికితా పొంతనలేకుండా చెప్పడంతో దీపక్ కు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

  Kajal Aggarwal Fiance Gautam Kitchlu's Back Ground And Bussiness Details || Oneindia Telugu
   విసిగిపోయాను..... చంపేశాను

  విసిగిపోయాను..... చంపేశాను

  పోలీసులు నికితాను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. తన బావతో తనకు అక్రమ సంబంధం ఉందని ప్రతిరోజు తన అత్త రేఖా సూటిపోటి మాటలతో హింసించిందని, అందుకే సహనం కోల్పోయి చంపేశానని కోడలు నికితా పోలీసుల విచారణలో అంగీకరించింది. నికితాను అరెస్టు చేశామని పోలీసులు అన్నారు. తండ్రి కరోనాతో ఆసుపత్రిలో ఉండటం, తల్లి రేఖా హత్యకు గురి కావడం, భార్య జైలుకు వెళ్లడంతో దీపక్ బోరున విలపిస్తున్నాడని పోలీసులు తెలిపారు.

  English summary
  Family fighting: Woman kills her mother in law with iron rod over a scuffle in Ahmedabad.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X