Family: ఒకే ఫ్యామిలీలో నలుగురు ఆత్మహత్య, 15 రోజుల క్రితమే కొత్త ఇంట్లోకి, ఉద్యోగం చేస్తున్న భార్య !
బెంగళూరు/ మంగళూరు: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు కూతురు కుమారుడు ఉన్నారు. దంపతులు అన్యోన్యంగా ఉన్నారని వారి కుటుంబ సభ్యులు బందువులు అనుకున్నారు. దంపతులు ఇద్దరు పిల్లలతో కలిసి 15 రోజుల క్రితమే వేరే ప్రాంతానికి వెళ్లి ఉద్యోగాలు చేస్తున్నారు. అద్దె ఇల్లు తీసుకుని దంపతులు కాపురం పెట్టారు. అంతే రాత్రి ఇంట్లోకి వెళ్లిన కుటుంబ సభ్యులు మరుసటి రోజు అందరూ శవాలై కనిపించడం కలకలం రేపింది.
Illegal affair: షాపు చూసుకోమని భర్తకు చెప్పిన ప్రియుడు, ఇంట్లో ఫ్రెండ్ భార్యతోనే ?, ఇద్దరూ ఫినిష్ !

దంపతులకు ఇద్దరు పిల్లలు
కర్ణాటకలోని బాగల్ కోటే జిల్లాలోని బిళగి తాలుకా సునగ ప్రాంతంలో నాగేష్ (32) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. 10 సంవత్సరాల క్రితం విజయలక్ష్మి (29) అనే యువతిని నాగేష్ వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న నాగేష్ ,విజయలక్ష్మి దంపతులు సంతోషంగా కాపురం చేశారు.

15 రోజుల క్రితం కొత్త ఇంట్లోకి !
నాగేష్, విజయలక్ష్మి దంపతులకు స్వప్నా (8) అనే కూతురు, సమర్థ్ (4) అనే కుమారుడు ఉన్నారు. ఇంతకాలం బాగల్ కోటేలోనే నాగేష్ , విజయలక్ష్మి దంపతులు వారి పిల్లలతో కలిసి నివాసం ఉండేవారు. 15 రోజుల క్రితం మంగళూరు చేరుకున్న నాగేష్, విజయలక్ష్మి దంపతులు మార్గన్స్ స్ట్రీట్ లో అద్దె ఇంటిని తీసుకుని నివాసం ఉంటున్నారు.

ఒకేసారి అందరూ ఆత్మహత్య
నాగేష్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. మంగళూరులోనే విజయలక్ష్మి లేడీ సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగంలో చేరింది. మంగళవారం రాత్రి దంపతులు ఇంట్లో టీవీ చూస్తున్న విషయం స్థానికులు గమనించారు. బుధవారం విజయలక్ష్మి, కూతురు స్వప్నా, కొడుకు సమర్థ్ ఇంట్లో శవమై కనిపించారు. అదే ఇంట్లో నాగేష్ కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. భార్య, ఇద్దరు పిల్లలకు విషయం పెట్టి హత్య చేసిన నాగేష్ తరువాత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒకే కుటుంబంలోని నలుగురు ఒకేసారి శవాలై కనిపించడం మంగళూరులో కలకలం రేపింది.