Family: రాత్రి ఇంటికి వెళ్లి భార్యతో ?, సహనం కోల్పోయిన భర్త, భార్య, ఇద్దరు పిల్లలను చంపేసి ఆత్మహత్య!
ఘాజియాబాద్/ లక్నో: ఓ యువకుడు కష్టపడి చదువుకున్నాడు. చదువు పూర్తి చేసిన అతను ప్రభుత్వ ఉద్యోగం సంపాధించాలని కొంతకాలంగా ప్రయత్నిస్తున్నాడు. ఇదే సమయంలో కుటుంబ సభ్యుల ఒత్తిడితో కొన్ని సంవత్సరాల క్రితం అతను వివాహం చేసుకున్నాడు. సంతోషంగా భార్యతో కాపురం చేసిన అతను ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యాడు. భార్య, పిల్లలను పోషిస్తున్న అతను ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సంపాధించాలని అన్ని పోటీ పరీక్షలు రాస్తున్నాడు. ఇదే సమయంలో అతని భార్యతో గొడవలు మొదలైనాయి.
పెద్దలు రాజీ చేసినా దంపతులు మాత్రం పద్దతి మార్చుకోలేదు. రాత్రి ఇంటికి వెళ్లిన భర్త అతని భార్యతో గొడవ పెట్టుకున్నాడు. ఆ సమయంలో పిల్లలు ఇద్దరు నిద్రపోతున్నారు. కొంతసేపటి తరువాత దంపతులు వేర్వేరు గదుల్లో నిద్రపోయారు. అర్దరాత్రి దాటిన తరువాత భర్త అతని భార్య, ఇద్దరు పిల్లలను చంపేసి అతను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం మద్యాహ్నం అయినా ఎవ్వరూ ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో బంధువులు వెళ్లి చూశారు. ఒకే ఇంటిలో నలుగురు శవమై కనిపించడంతో కుటుంబ సభ్యులు, బంధువులు హడలిపోయారు.

పెద్దల ఒత్తిడితో పెళ్లి చేసుకున్నాడు
ఉత్తరప్రదేశ్ లోని ఘాజియాబాద్ లోని జఖానియా ప్రాంతంలోని సాజత్ బజార్ ప్రాంతంలో శివదాస్ సోనేకర్ అలియాస్ శివదాస్ (35) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కష్టపడి చదువుకున్న శివదాస్ చదువు పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం సంపాధించాలని కొంతకాలంగా అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు.

భార్య, ఇద్దరు పిల్లలతో హ్యాపీ
కుటుంబ సభ్యుల ఒత్తిడి చెయ్యడంతో 7 సంవత్సరాల క్రితం శివదాస్ రీనా (30) అనే యువతిని వివాహం చేసుకున్నాడు. సంతోషంగా శివదాస్, రీనా దంపతులు కాపురం చేశారు. శివదాస్, రీనా దంపతులకు ఆరవ్ (5) అనే కొడుకు, సెజల్ (3) అనే కూతురు ఉన్నారు. భార్య రీనా, పిల్లలను పోషిస్తున్న శివదాస్ ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సంపాధించాలని అన్ని పోటీ పరీక్షలు రాస్తున్నాడు.

భార్యతో గొడవలు
పోటీ పరీక్షలు రాయడానికి సిద్దం అవుతున్న శివదాస్ కు అతని భార్య రీనాతో గొడవలు మొదలైనాయి. పెద్దలు రాజీ చేసినా రీనా, శివదాస్ దంపతులు మాత్రం పద్దతి మార్చుకోలేదు. ఆదివారం రాత్రి ఇంటికి వెళ్లిన శివదాస్ అతని భార్య రీనాతో గొడవ పెట్టుకున్నాడు. ఆ సమయంలో శివదాస్, రీనా దంపతుల పిల్లలు ఇద్దరు నిద్రపోతున్నారు.

భార్య, బిడ్డలను చంపేసి ఆత్మహత్య
కొంతసేపటి తరువాత రీనా, శిదాస్ దంపతులు వేర్వేరు గదుల్లో నిద్రపోయారు. అర్దరాత్రి దాటిన తరువాత శివదాస్ అతని భార్య రీనా, ఇద్దరు పిల్లలు అరవ్, సెజల్ ముఖం మీద దిండు వేసి ఊపిరిరాకుండాచేసి ముగ్గురిని చంపేశాడు. భార్య రీనా, ఇద్దరు పిల్లల ప్రాణం పోయిందని నిర్దారించుకున్న శివదాస్ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

హడలిపోయిన కుటుంబ సభ్యులు
సోమవారం మద్యాహ్నం అయినా శివదాస్, రీనా, వాళ్ల పిల్లలు ఎవ్వరూ ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో బంధువులు వెళ్లి చూశారు. ఒకే ఇంటిలో శివదాస్, రీనా దంపతులు, వారి పిల్లలు ఇద్దరూ శవమై కనిపించడంతో వాళ్ల కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు హడలిపోయారు.కుటుంబ గొడవల కారణంగా శివదాస్ అతని భార్య, పిల్లలను చంపేసి ఆత్మహత్య చేసుకున్నాడని విచారణ చేస్తున్న పోలీసు అధికారి మీడియాకు చెప్పారు.