బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Devadasi: అక్క మొగుడు కావాలా ?, దేవదాసి అవుతావా ?, లవర్ కావాలని అమ్మాయి ఎస్కేప్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఇంట్లో పెళ్లి ఈడుకు వచ్చిన అమ్మాయికి ఎలాగైనా పెళ్లి చెయ్యాలని ఆమె తల్లిదండ్రులు నిర్ణయించారు. ఇష్టపడిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని యువతి డిసైడ్ అయ్యింది. ఆ అమ్మాయిని పైసా కట్నం కాని, ఖర్చుకాని లేకుండా పెళ్లి చేసుకోవడానికి ఆమె అక్క మొగుడు సిద్దంగా ఉన్నాడు. నువ్వు అక్క మొగుడిని చేసుకుంటావా ?, ఊరిలోకి దేవదాసి అవుతావా ? అంటూ ఆ అమ్మాయికి ఇంట్లో రెండు చాన్స్ లు ఇచ్చారు. అక్క మొగుడిని పెళ్లి చేసువడం, ఊరికి దేవదాసి కావడం ఇష్టం లేని ఆ యువతి జెండా ఎత్తేసింది. యువతి ఎక్కడ ఉందో తెలుసుకున్న అమ్మాయి కుటుంబ సభ్యులు ఆమెను పట్టుకుని పోలీసుల ముందు పంచాయితీ పెట్టడంతో కథ రసవత్తరంగా మారింది.

Mrs India Winner: వ్యాపారవేత్తతో అక్రమ సంబంధం, మాజీ మిసెస్ రూ. కోట్లు డీల్, ఆ వీడియోతో !Mrs India Winner: వ్యాపారవేత్తతో అక్రమ సంబంధం, మాజీ మిసెస్ రూ. కోట్లు డీల్, ఆ వీడియోతో !

20 ఏళ్ల యువతి

20 ఏళ్ల యువతి

కర్ణాటకలోని రాయచూరు జిల్లాలోని చిచ్చోడి గ్రామంలో 20 ఏళ్ల అపూర్వ (పేరు మార్చడం జరిగింది) అనే యువతి నివాసం ఉంటున్నది. అపూర్వ తల్లి ఆ ఊరిలోని గుడి దగ్గర దేవదాసిగా ఉంటోంది. అపూర్వ అక్క రమ్య (పేరు మార్చడం జరిగింది) పెళ్లి చేసుకుని ఆమె భర్తతో కాపురం చేసుకుంటూ వేరుగా నివాసం ఉంటోంది.

పైసా ఖర్చు లేకుండా పెళ్లి చెయ్యాలని ప్లాన్

పైసా ఖర్చు లేకుండా పెళ్లి చెయ్యాలని ప్లాన్

అపూర్వ ఆమె తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటోంది. ఇంట్లో పెళ్లి ఈడుకు వచ్చిన అపూర్వకు ఎలాగైనా పెళ్లి చెయ్యాలని ఆమె తల్లిదండ్రులు నిర్ణయించారు. ఇష్టపడిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని అపూర్వ డిసైడ్ అయ్యింది. అపూర్వకు పైసా కట్నం కాని, ఖర్చుకాని లేకుండా పెళ్లి చేసుకోవడానికి ఆమె అక్క మొగుడు సిద్దంగా ఉన్నాడు. నువ్వు అక్క మొగుడిని చేసుకుంటావా ?, ఊరికి దేవదాసి అవుతావా ? అంటూ అపూర్వకు ఇంట్లో రెండు చాన్స్ లు ఇచ్చారు.

 ఇంటి నుంచి పారిపోయిన అమ్మాయి

ఇంటి నుంచి పారిపోయిన అమ్మాయి

అక్క మొగుడిని పెళ్లి చేసువడం, ఊరికి దేవదాసి కావడం ఇష్టం లేని అపూర్వ జెండా ఎత్తేసింది ఇంటి నుంచి పారిపోయింది. బంధువుల ఇంట్లో అపూర్వ తలదాచుకున్న విషయం తెలుసుకున్న ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు ఆమెను పట్టుకున్నారు. మా అమ్మాయి అపూర్వకు అశ్రయం ఇవ్వడానికి మీరెవ్వరూ అంటూ ఆమె కుటుంబ సభ్యులు బంధువు ఇంట్లో పెద్ద గొడవ చేశారు.

Recommended Video

Rythu Bharosa Kendras : AP CM Jagan Started RBK Channel
ఇంకా ఆ మూడునమ్మకాలు ఉన్నాయా ?

ఇంకా ఆ మూడునమ్మకాలు ఉన్నాయా ?


పోలీసులు అపూర్వ, ఆమె కుటుంబ సభ్యులకు రాజీ చెయ్యడానికి ప్రయత్నించారు .అయితే నేను మా అమ్మా, నాన్నతో వెళ్లనని అపూర్వ తేల్చి చెప్పింది. చివరికి అపూర్వను దేవదుర్గలోని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు. అమ్మాయి యోగక్షేమాలు చూసుకుంటున్నామని, ఆమెకు కౌన్సిలింగ్ ఇస్తున్నామని రాయచూరు డిప్యూటీ కమీషనర్ ఆర్. వెంకటేష్ కుమార్ చెప్పారని ది ఇండియన్ ఎక్స్ ప్రెస్ తెలిపింది. దేవదాసి ఆచారాన్ని ప్రభుత్వం ఇప్పటికే నిషేధించినా దక్షిణ భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో ఇంకా ఇలాంటి సంఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.

English summary
Devadasi: A 20-year-old girl in Karnataka fled home, reportedly after her parents threatened her that she would be pushed into the ‘Devadasi’ tradition if she didn’t solemnize marriage with the husband of her sister. The alleged incident is a chilling reminder that the Devadasi system, despite being banned by law, is still breathing in some parts of the southern state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X