వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: కరోనా పాజిటివ్, ఫేమస్ హల్వా కింగ్ ఆత్మహత్య, విదేశాల్లో హవా, 100 ఏళ్ల చరిత్ర !

|
Google Oneindia TeluguNews

చెన్నై/ న్యూఢిల్లీ: దేశ విదేశాల్లో హల్వా కింగ్ గా పేరు తెచ్చుకున్న ఇరుట్టు కడాయి హల్వా యజమాని కరోనా వైరస్ ( COVID 19) వ్యాధి సోకడంతో ఆసుపత్రిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇరుట్టు కడాయి హల్వాకు 100 ఏళ్ల చరిత్ర ఉంది. మూడు రోజుల క్రితం అనారోగ్యానికి గురైన హల్వా కింగ్ కు కరోనా పాజిటివ్ అని వెలుగు చూసింది. హల్వా యజమాని కుటుంబ సభ్యులు ప్రస్తుతం క్వారంటైన్ ఉన్నారు. ఇదే సమయంలో కరోనా వైరస్ భయంతో హల్వా యజమాని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

Lockdown: కోలీవుడ్ నటీమణులతో గెస్ట్ హౌస్ లో బిగ్ షాట్ రొమాన్స్, చేసింది చాలు పదనాయనా, అరెస్టు !Lockdown: కోలీవుడ్ నటీమణులతో గెస్ట్ హౌస్ లో బిగ్ షాట్ రొమాన్స్, చేసింది చాలు పదనాయనా, అరెస్టు !

హల్వాకు 100 ఏళ్ల చరిత్ర

హల్వాకు 100 ఏళ్ల చరిత్ర

తమిళనాడులోని తిరునల్వేలిలోని నెల్వైప్పర్ ఆలయం సమీపంలో హరిసింగ్ (80) కుటుంబ సభ్యులు 100 ఏళ్ల క్రితం ఇరుట్టు కడాయి హల్వా షాపు ప్రారంభించారు. హరిసింగ్ కుటుంబ సభ్యులది రాజస్థాన్. రాజస్థాన్ నుంచి తమిళనాడుకు వలస వచ్చిన హరిసింగ్ కుటుంబ సభ్యులు తిరునల్వేలిలో స్వీట్ షాప్ ప్రారంభించారు. ఆ స్వీట్ షాప్ లో ఇరుట్టు కడాయి హల్వా చెయ్యడం 100 ఏళ్ల క్రితం మొదలైయ్యింది.

 తమిళనాడు టూ విదేశాలు

తమిళనాడు టూ విదేశాలు

హరిసింగ్ కుటుంబ సభ్యులు తయారు చేసిన ఇరుట్టు కడాయి హల్వా తిరునల్వేలి నగరంలో పాపులర్ అయ్యింది. తియ్యటి హల్వా రుచికరంగా, చాలా శుభ్రంగా ఉండటంతో మౌత్ పబ్లిసిటీతో ఇరుట్టు కడాయి హల్వా అతి తక్కువ కాలంలో చాలా ఫేమస్ అయ్యింది. హరిసింగ్ కుటుంబ సభ్యులు తయారు చేసిన హల్వా తిరునల్వేలితో పాటు తమిళనాడు, దేశంలోని ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాలకు ఎగుమతి అయ్యే అవరకు ఇరుట్టు కడాయి హల్వా ప్రసిద్ది చెందింది. ఇప్పటికీ ఈ హల్వాను పర్యాటకులు కేజీలు కేజీలు కొనుగోలు చేసి తీసుకెలుతున్నారంటే ఈ హల్వా ఎంత ఫేమస్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు.

 హల్వా కింగ్ కు అనారోగ్యం

హల్వా కింగ్ కు అనారోగ్యం

మూడు రోజుల క్రితం మంగళవారం హల్వా కింగ్ హరిసింగ్ అనారోగ్యానికి గురైనారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హరిసింగ్ ను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. యూరినరీ ఇన్ ఫెక్షన్ కారణంగా హరిసింగ్ అనారోగ్యానికి గురైనారని తెలిసింది. ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు హల్వా కింగ్ హరిసింగ్ కు మెరుగైన చికిత్స అందించారు.

 కరోనా పాజిటివ్ తో షాక్

కరోనా పాజిటివ్ తో షాక్

హరిసింగ్ కు వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించారు. వైద్యపరీక్షల్లో హరిసింగ్ కు కరోనా పాజిటివ్ అని గురువారం వెలుగు చూసింది. దేశ విదేశాల్లో ఎంతో పేరు సంపాధించిన తనకు కరోనా పాజిటివ్ అని తెలిస్తే తన వ్యాపారం మీద దెబ్బ పడుతుందని హరిసింగ్ ఆందోళన చెందారని తెలిసింది. ఇదే విషయంపై హరిసింగ్ తీవ్రమనోవేదనకు గురైనారని సమాచారం.

Recommended Video

తెలుగురాష్ట్రాల మధ్య Bus సర్వీసులకు బ్రేక్.. AP లో సిటీ బస్సులకు గ్రీన్ సిగ్నల్! || Oneindia Telugu
 కరోనా భయంతో ఆత్మహత్య

కరోనా భయంతో ఆత్మహత్య

కరోనా వైరస్ వ్యాధి నయం అవుతుందని వైద్యులు హరిసింగ్ కు ధైర్యం చెప్పారు. అయితే ఆందోళన చెందిన హరిసింగ్ చికిత్స పొందుతున్న ఆసుపత్రిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. హరిసింగ్ అల్లుడికి కరోనా పాజిటివ్ అని వెలుగు చూసింది. హరిసింగ్ కుటుంబ సభ్యులను క్వారంటైన్ కు తరలించామని అధికారులు తెలిపారు. హరిసింగ్ మృతదేహానికి పోస్టుమార్టుం నిర్వహించిన తరువాత కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని తిరునల్వేలి డిప్యూటీ కమిషనర్ ఎస్. శరవణ మీడియాకు చెప్పారు.

English summary
Coronavirus: The owner of the famous century-old 'Iruttu kadai halwa' store here, a well-known name in Tamil Nadu among sweet lovers, was found hanging at a hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X