బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నువ్వు చచ్చావు, నటి, మాజీ ఎంపీ రమ్యాకు శ్రద్దాంజలి, కుక్కకు ఉండే విశ్వాసం లేదు, బ్యానర్లు, ఫెక్సీలు!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చీఫ్, నటి రమ్యాకు, వివాదాలకు విడదీయరాని బంధం ఉందని కొందరు అంటారు. ఇప్పుడు ఆమాట మరోసారి తెరమీదకు వచ్చింది. తన రాజకీయ గురువు, రెబల్ స్టార్ అంబరీష్ అనారోగ్యంతో మరణించినా కనీసం తుదివిడ్కోలు పలకడానికి రాని రమ్యా మీద అభిమానులు మండిపడుతున్నారు. రమ్యా నువ్వ మా దృష్టిలో చచ్చిపోయావు, ఇక ముందు ఇటువైపు రావద్దూ, కుక్కకు ఉండే విశ్వాసం లేదు నీకు అంటూ బ్యానర్లు, ఫ్లక్సీలు ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేశారు. కృతజ్ఞత లేని వ్యక్తి గురించి మాట్లాడం మంచిదికాదని అంబరీష్ అభిమానులు అంటున్నారు.

వివాదాల రమ్యా

వివాదాల రమ్యా

స్యాండిల్ వుడ్ సినిమాలతో పాటు తెలుగు, తమిళ చిత్రాల్లో రమ్యా అలియాస్ దివ్యా స్పందన నటించారు. రమ్యా ఏదో ఒక విషయంలో నిత్యం వివాదాల్లో ఉంటుందని ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. సాటి నటీనటులతో పాటు అనేక మందితో నటి రమ్యా గొడవలు పడ్డారని ఆమె అభిమానులు చెప్పిన సందర్బాలు ఉన్నాయి.

రాజకీయల్లోకి !

రాజకీయల్లోకి !

సినిమాల్లో నటించే రమ్యా రాజకీయాల్లోకి వచ్చారు. మండ్య లోక్ సభ నియోజక వర్గం ఉప ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన అనేక మంది నాయకులు టిక్కెట్ కోసం పోటీ పడ్డారు. నటి రమ్యా చాకచక్యంగా రెబల్ స్టార్ అంబరీష్ కాళ్ల మీద పడి తనకు టిక్కెట్ ఇప్పించి గెలిపించి రాజకీయ భిక్ష పెట్టాలని వేడుకున్నారు. నటి రమ్యా మీద జాలితో అంబరీష్ ఉప ఎన్నికల్లో ఆమెకు టిక్కెట్ ఇప్పించి స్వయంగా ప్రచారం చేసి ఎంపీగా గెలిపించారు.

ఓటమితో ఢిల్లీలో మకాం

ఓటమితో ఢిల్లీలో మకాం

2014 లోక్ సభ ఎన్నికల్లో నటి రమ్యా మండ్య నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం రమ్యా ఒక్కసారికూడా మండ్య వైపు కన్నెత్తి చూడలేదని విమర్శలు ఉన్నాయి. 2018 శాసన సభ ఎన్నికల్లో, ఇటీవల జరిగిన మండ్య లోక్ సభ ఉప ఎన్నికల్లో ఓటు వెయ్యడానికి నటి రమ్యా మండ్యకు రాలేదు. కనీసం ఓటు ఎందుకు వెయ్యడానికి రాలేదు అనే విషయంపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు వివరణ ఇవ్వడానికి రమ్యా ప్రయత్నించలేదు.

బతికుండగానే శ్రద్దాంజలి

బతికుండగానే శ్రద్దాంజలి

రాజకీయ గురువు అంబరీష్ అంత్యక్రియలకు హాజరుకాకుండా అహంకారంతో ప్రవర్తించిన నటి రమ్యా బతికున్నా మా దృష్టిలో చచ్చినదానితో సమానం అంటూ మండ్య ప్రజలు ఫ్లక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. నటి రమ్యా ఇటు వైపు వస్తే తగిన బుద్దిచెబుతామని హెచ్చరిస్తున్నారు. రమ్యా లాంటి వ్యక్తి ముఖం చూడటానికి తమకు అసహ్యంగా ఉందని అభిమానులు మండిపడుతున్నారు

English summary
Karnataka fans are annoyed with Kannada Actress, Congress Politician Ramya for missing Ambarish's last rites.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X