వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోవిషీల్డ్‌, కోవాగ్జిన్ వ్యాక్సిన్లు- ప్రభావం, సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఇవే- క్లారిటీ ఇచ్చిన భారత్‌ బయోటెక్, సీరం

|
Google Oneindia TeluguNews

ప్రపంచమంతా కరోనా వ్యాక్సిన్ల కోసం తపిస్తుంటే వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన భారత్‌లో మరో విచిత్రమైన సమస్య నెలకొంది. భారతీయ తయారీ సంస్ధలు సీరం ఇన్‌స్టిట్యూట్‌, భారత్‌ బయోటెక్‌ రూపొందించిన వ్యాక్సిన్లను జనం పూర్తిగా విశ్వసించడం లేదు. ఇప్పటికే వ్యాక్సిన్ డోసులు తీసుకున్న వారికి ఎదురైన సమస్యలను దృష్టిలో ఉంచుకుని కొత్తగా వ్యాక్సిన్‌ తీసుకునేందుకు హెల్త్‌ వర్కర్లు భయపడుతున్నారు. చాలా రాష్ట్రాల్లో ఆరోగ్యశాఖలే వ్యాక్సిన్‌పై వేచిచూసే ధోరణి అవలంబిస్తున్నాయి. దీంతో పలుచోట్ల వ్యాక్సిన్లు నిల్వ చేయలేక పాడైపోతున్న పరిస్ధితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్లపై వాటి తయారీ సంస్ధలు ఫ్యాక్ట్ షీట్‌ విడుదల చేశాయి.

తొలిసారి విదేశాలకు మన కరోనా వ్యాక్సిన్‌- మాల్దీవులు, భూటాన్‌లకు కోవిషీల్డ్‌ తొలిసారి విదేశాలకు మన కరోనా వ్యాక్సిన్‌- మాల్దీవులు, భూటాన్‌లకు కోవిషీల్డ్‌

 కరోనా వ్యాక్సిన్లపై భయాలు

కరోనా వ్యాక్సిన్లపై భయాలు

భారత్‌లో దేశీయ తయారీ సంస్ధలు సీరం ఇన్‌స్టిట్యూట్‌, భారత్ బయోటెక్‌ అందుబాటులోకి తెచ్చిన కరోనా వ్యాక్సిన్లపై స్వదేశంలోనే అనుమానాలు, భయాలు నెలకొన్నాయి. దీంతో వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు హెల్త్‌ వర్కర్లు కూడా జంకుతున్నారు. దీంతో పలు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం అనుకున్న స్ధాయిలో ముందుకు సాగడం లేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా వ్యాక్సిన్‌ తయారీ సంస్ధలపై ఒత్తిడి పెరుగుతోంది. ప్రజలకు వాస్తవాలు వివరించడంలో వ్యాక్సిన్‌ తయారీ సంస్ధలు అనుకున్న స్ధాయిలో వ్యవహరించడం లేదనే ఆరోపణలు పెరుగుతున్నాయి.

వ్యాక్సిన్లపై వాస్తవాలు వెల్లడిస్తున్న తయారీ సంస్ధలు

వ్యాక్సిన్లపై వాస్తవాలు వెల్లడిస్తున్న తయారీ సంస్ధలు

భారత్‌లో తయారైన కరోనా వ్యాక్సిన్లు కోవిషీల్డ్‌, కోవాగ్జిన్‌ల వాడకం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి, ఎవరెవరు వాడొచ్చు, ఎవరు వాడకూడదు, వీటి వాడకంలో ఉన్న ఇబ్బందులేంటి అన్న అంశాలపై వీటి తయారీ సంస్ధలు సీరం ఇన్‌స్టిట్యూట్‌, భారత్‌ బయోటెక్ తాజాగా ఫ్యాక్ట్‌ షీట్లను విడుదల చేశాయి. ముందుగా సీరం ఇన్‌స్టిట్యూట్ తాము అభివృద్ధి చేసిన కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ వాడకంపై ఫ్యాక్ట్‌ షీట్‌ విడుదల చేయగా.. తాజాగా భారత్ బయోటెక్‌ కూడా అదే బాటలో పయనించింది. జనవరి 16న టీకాల పంపిణీ కార్యక్రమం ప్రారంభమయ్యాక ఇప్పటివరకూ వీటిని తీసుకున్న 580 మందికి ప్రతికూల ఫలితాలు వచ్చిన నేపథ్యంలో ఈ ఫ్యాక్ట్‌ షీట్లకు ప్రాధాన్యం ఏర్పడింది.

కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ లాభనష్టాలివే...

కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ లాభనష్టాలివే...

హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ కోవాగ్జిన్‌ తాము విడుదల చేసిన ఫ్యాక్ట్‌ షీట్‌లో దీనిపై క్లారిటీ ఇచ్చింది. ఇందులో కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ వాడకూడని వారి జాబితాను ప్రకటించించింది. అలర్జీలు ఉన్నవారు, జ్వరంతో బాధపడుతున్న వారు, రక్తం గడ్డ కట్టే వారు, రక్త ప్రసరణ ఇబ్బందులు ఉన్న వారు, మందులు తమ రోగనిరోధక వ్యవస్ధపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉన్న వారు, గర్భవతులు, పాలిచ్చే తల్లులు, మరో కోవిడ్‌ వ్యాక్సిన్ తీసుకున్న వారు, ఇతర తీవ్ర వ్యాధులతో బాధపడుతూ వ్యాక్సిన్‌ వేయించుకోవద్దని డాక్టర్లు సూచించిన వారు కోవాగ్జిన్‌ను తీసుకోవద్దని భారత్ బయోటెక్ స్పష్టం చేసింది.

 కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ ప్రభావాలివే...

కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ ప్రభావాలివే...

కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ వేయంచుకున్న వారిపై ఎలాంటి ప్రభావం ఉంటుందో కూడా భారత్‌ బయోటెక్‌ వెల్లడించింది. దీని ప్రకారం వ్యాక్సిన్ వేయించుకున్న వారికి శరీరంలో ఇంజెక్షన్ ఇచ్చిన ప్రాంతంలో నొప్పి, వాపు ఉంటాయని, చర్మం ఎర్రబారుతుందని, దురద కూడా ఉంటుందని, మోచేయి పై భాగం బిగుసుకుంటుందని, ఇంజెక్షన్ చేయించుకున్న చేయి కొంతకాలం బలహీనంగా ఉంటుందని, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, జ్వరం, నీరసం రావొచ్చని, చర్మంపై దద్దుర్లు కూడా రావొచ్చని, వాంతులు కూడా కావొచ్చని తెలిపింది. వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత కొందరికి శ్వాస ఆడకపోవచ్చని, మొహం, గొంతు వాపు కూడా రావొచ్చని, గుండె కొట్టుకునే వేగం కూడా పెరగవచ్చని, ఒళ్లంతా దద్దుర్లు వచ్చే అవకాశం కూడా ఉంటుందని, నీరసం, మగత కూడా ఉంటాయని భారత్‌ బయోటెక్‌ తెలిపింది.

కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ ఎవరు తీసుకోకూడదు..?

కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ ఎవరు తీసుకోకూడదు..?


సీరం ఇన్‌స్టిట్యూట్‌ అభివృద్ధి చేసిన కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ కూడా అందరిపై ఒకేలా పనిచేయదని చెబుతున్నారు. ఏదైనా ఆహారం, వ్యాక్సిన్, మందులు తీసుకున్నప్పుడు అలర్జీలు వచ్చే అవకాశం ఉన్నవారు, జ్వరం, రక్త ప్రసరణ సమస్యలు, రోగనిరోధకశక్తి లోపాలు ఉన్నవారు, గర్భవతులు, పాలిచ్చే తల్లులు, మరో కరోనా వ్యాక్సిన్‌ తీసుకునే వారు కూడా కోవిషీల్డ్‌ తీసుకోవద్దని సీరం సంస్ధ చెబుతోంది. అలాగే రెండు డోసులుగా 0.5 ఎంఎల్‌ చొప్పున ఇచ్చే కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ తొలిడోస్ తీసుకున్న తర్వాత కనీసం నాలుగు నుంచి ఆరువారాల తర్వాతే రెండో డోస్‌ తీసుకోవాలని సీరం చెబుతోంది. రెండోడోస్‌ తీసుకున్న నాలుగు వారాల తర్వాతే రోగనిరోధక శక్తి వస్తుందని పేర్కొంది.

‌ కోవిషీల్డ్‌ వ్యాక్సిన్ సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఇవే..

‌ కోవిషీల్డ్‌ వ్యాక్సిన్ సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఇవే..

సీరం అభివృద్ధి చేసిన కోవిషీల్డ్‌ వ్యాక్సిన్ వాడకం వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్‌ తప్పవని తేలిపోయింది. కోవిషీల్డ్‌ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత నొప్పి, దద్దుర్లు, మగత, చర్మం ఎర్రబారడం, అలసట, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, జ్వరం, కీళ్ల నొప్పులు వచ్చే అవకాశం ఉంటుందని సీరం చెబుతోంది. జ్వరం, వాంతులు కావడం వంటివి కూడా జరగొచ్చని తెలిపింది. అలాగే ఫ్లూ లక్షణాలైన గొంతునొప్పి, జ్వరం, ముక్కు నుంచి నీరు కారడం, దగ్గు కూడా రావొచ్చని సీరం చెబుతోంది. మగతగా అనిపించడం, ఆకలి తగ్గడం, కడుపునొప్పి, శోష గ్రంధుల వాపు, ఎక్కువగా చెమట పట్టడం, దురద కూడా ఉండొచ్చని సీరం వెల్లడించింది.

English summary
indian covid vaccine manufacturers Bharat Biotech and Serum Institute of India have released “fact sheets” amid fears of vaccine among health workers and general public.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X