• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) మూత? - వైసీపీ నిర్ణయమే కీలకం - రాజ్యసభలో వ్యవసాయ బిల్లులు

|

వివాదాస్పద వ్యవసాయ బిల్లులపై రైతుల ఆందోళనలు తీవ్రతరం అయ్యాయి. నిరసనలకు కేంద్రంగా ఉన్న హర్యానాలో అడుగడుగునా పోలీసులు భారీగా మోహరించారు. బీజేపీకి భారీ మెజార్టీ ఉండటంతో ఇప్పటికే లోక్ సభలో ఈజీగా గట్టెక్కిన ఈ బిల్లులపై ఆదివారం రాజ్యసభలో చర్చ, ఓటింగ్ జరుగనుంది. ఎన్డీఏ పక్షాలు, ఆర్ఎస్ఎస్ శ్రేణులు సైతం వ్యతిరేకిస్తోన్న ఈ బిల్లుల్ని ఎలాగైనాసరే పాస్ చేయించుకోవాలని అధికార పార్టీ ప్రయత్నిస్తుండగా.. దీని వల్ల భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) మూతపడుతుందని, కనీస మద్దతు ధర హామీ కుంటుపడుతుందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి.

ఇండియన్ ఆర్మీ సంచలన ప్రకటన - షోపియాన్ ఎన్ కౌంటర్ చట్టవిరుద్ధం - జవాన్లపై చర్యలు

రాజ్యసభలో బలాబలాలు..

రాజ్యసభలో బలాబలాలు..

ప్రస్తుతం రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 243. కానీ ఇప్పటికే అధికార కూటమికి చెందిన 10 మంది ఎంపీలు, ప్రతిపక్షానికి చెందిన 15 మంది ఎంపీలు కరోనా కారణంగా సమావేశాలకు దూరమయ్యారు. దీంతో బిల్లుల ఆమోదానికి మెజార్టీ మార్కు 110కి పడిపోనుంది. బీజేపీకి సొంతగా 86 మంది ఎంపీలున్నారు. ఎన్డీఏ మిత్రులతో కలిపితే బలం 105గా ఉంటుందికానీ, ముగ్గురు ఎంపీల అకాళీదళ్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయనుంది. ఇక విపక్షంలో కాంగ్రెస్ పార్టీకి సొంతగా 40 ఎంపీలు, టీఎంసీ 13, సమాజ్ వాదీ పార్టీ 8, బీఎస్పీ 4, ఆమ్ ఆద్మీ పార్టీ 3 సహా ఇతర చిన్న పార్టీలూ సర్కారుకు వ్యతిరేకంగా ఓటేయనున్నాయి. కాగా..

వైసీపీ నిర్ణయమే కీలకం..

వైసీపీ నిర్ణయమే కీలకం..

రాజ్యసభలో బీజేపీకి పూర్తి బలం లేకపోవడంతో స్నేహపూరిత ప్రాంతీయ పార్టీల మద్దతుపైనే ఆధారపడింది. బీజేడీ, టీఆర్ఎస్, వైసీపీ ఎంపీల ఓట్లపై కాషాయనేతలు ఆశలు పెట్టుకున్నా.. తాము వ్యవసాయ బిల్లుల్ని వ్యతిరేకిస్తామని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొద్ది గంటల కిందటే స్పష్టం చేశారు. ఏడుగురు ఎంపీలున్న టీఆర్ఎస్ వ్యతిరేకంగా ఓటేయనుండగా, తొమ్మిది మంది ఎంపీలున్న బీజేడీ సైతం అదే బాటలో పయనించే అవకాశముంది. ఇక ఆరుగురు ఎంపీలున్న వైసీపీ ఎలాంటి నిర్ణయం తీసుకోనుందననేది కీలకంగా మారింది. వ్యవసాయ బిల్లులకు లోక్ సభలో మద్దతు ఇచ్చిన వైసీపీ రాజ్యసభలోనూ అదే పని చేస్తుందా, లేక సవరణుల పేరుతో మెలికలు పెట్టే అవకాశముందా ఇంకాసేపట్లో తేలిపోనుంది.

ఫ్లోరైడ్ రక్కసిపై తెలంగాణ గెలుపు - కేంద్రం ప్రకటన - టీమ్ ఎంబీకి కేటీఆర్ కితాబు - ఏపీలో ఇంకా 111

  Agriculture Bills 2020 పై కేంద్రం క్లారిటీ Vs రైతుల డిమాండ్లు | Oneindia Telugu
   ఎఫ్‌సీఐ, ఎంఎస్‌పీపై భారీ ఎఫెక్ట్?

  ఎఫ్‌సీఐ, ఎంఎస్‌పీపై భారీ ఎఫెక్ట్?

  వ్యవసాయ రంగంలో సంస్కరణలంటూ కేంద్రం తీసుకొచ్చిన మూడు బిల్లులతో భారత ఆహార సంస్థ(ఎఫ్ సీఐ) మూత పడటం ఖాయమని, ఇప్పటి దాకా ప్రభుత్వాలు గ్యారెంటీ ఇస్తోన్న పంటకు కనీస మద్దతు ధర(ఎంఎస్ పీ) విధానం కూడా దెబ్బతింటుందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, భారీగా నిల్వలు, అవసరమైన చోటికి వాటి తరలింపులు చేస్తూ దేశంలో ఆహార ధాన్యాల సమతుల్యానికి సంబంధించి ఎఫ్ సీఐ కీలకంగా వ్యవహరించిందని, కొత్త వ్యవసాయ బిల్లుల్లోని అంశాలు ఎఫ్ సీఐ మనుగడకు ప్రమాదకరంగా ఉన్నాయని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఎంఎస్ పీ నుంచి ప్రభుత్వం తప్పించుకోవాలనుకుంటోందని ఏఐసీసీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ఆరోపిస్తున్నారు. మొత్తంగా వ్యవసాయ బిల్లులపై రాజ్యసభలో పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి.

  English summary
  one day before the government prepared to defeat the numeric strength of Opposition and estranged allies to pass the contentious farm bills, the BJP's affiliates in the RSS have joined the chorus against the present form of the bills. They want farmers to be given a guarantee of Minimum Support Price (MSP) by everyone procuring and penal action against defaulters, or sending bill to a parliamentary panel and take up the bill in the Parliament's winter session.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X