• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సాగు చట్టాలపై పార్లమెంట్‌లో పోరు -బడ్జెట్ భేటీ తొలి రోజు రాష్ట్రపతి ప్రసంగం బహిష్కరణ: ప్రతిపక్షాలు

|

సంస్కరణల పేరుతో కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై పార్లమెంట్ లోనూ పోరాటం చేయాలని 16 ప్రతిపక్ష పార్టీలు ఉమ్మడిగా నిర్ణయించాయి. సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని, రిపబ్లిక్ డే నాడు ఢిల్లీలో రైతులు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలో హింసపై సమగ్ర దర్యాప్తు జరిపించాలనే డిమాండ్ తో ఉమ్మడి కార్యాచరణ ప్రకటించాయి. ఈ క్రమంలో..

చంద్రబాబుపై నిమ్మగడ్డ చర్యలు? -పార్టీ రహిత ఎన్నికలకు టీడీపీ మేనిఫెస్టోనా? -వైసీపీ తీవ్ర అభ్యంతరం

పార్లమెంట్ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా శుక్రవారం ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేయనున్న ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నట్లు 16 పార్టీలు ప్రకటించాయి. వ్యవసాయ చట్టాల రద్దు డిమాండ్ కోరుతూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాయి. ప్రతిపక్షం లేకుండా చేసి, ఏకపక్షంగా చట్టాలు ఆమోదం చేసుకున్నారని ఆరోపించాయి. ఈ కొత్త వ్యవసాయ చట్టాల కారణంగా ఆహర భద్రతకు విఘాతం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ మేరకు గురువారం 16 ప్రతిపక్ష పార్టీలు ఓ ప్రకటన విడుదల చేశాయి.

farm laws:16 opposition parties to boycott Presidents address to Parliament on Friday

రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరిస్తామన్న పార్టీల్లో.. కాంగ్రెస్, ఎన్సీపీ, జేకేఎన్సీ, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, శివసేన, సమాజ్‌వాదీ పార్టీ, ఆర్జేడీ, సీపీఐ(ఎం), సీపీఐ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, ఆర్ఎస్పీ, పీడీపీ, ఎండీఎంకే, కేరళ కాంగ్రెస్ (ఎం), ఏఐయూడీఎఫ్ తదితర పార్టీలున్నాయి. రాజ్యసభలో కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్‌ ఈ మేరకు పార్టీలు తీసుకున్న ఉమ్మడి నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు.

పంచాయితీ షాకింగ్: జగన్ సర్కారు పరువు పోయింది -I&PR అధికారిక ప్రకటనలో తెలంగాణ ఫొటోలు

కొత్త వ్యవసాయ చట్టాలతో వ్యవసాయం కార్పోరేట్ల చేతుల్లోకి వెళ్లిపోతుందని, ఆహార ఉత్పత్తులను ప్రభుత్వం సేకరించడం నిలిచిపోతుందని, తద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థ పెను ప్రభావానికి గురవుతుందని విపక్ష నేతలు అన్నారు. సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ దేశరాజధాని ఢిల్లీలో రైతులు చేస్తోన్న ఆందోళనలు గురువారంతో 64వ రోజుకు చేరాయి. ఈ రెండు నెలల వ్యవధిలోనే ఆందోళనల్లో 155 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని విపక్ష నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. రిపబ్లిక్ డే రోజున చోటుచేసుకున్న హింస వెనుక అసలు కుట్రదారులెవరో తేల్చాల్సిన అవసరం ఉందని 16 పార్టీలు పేర్కొన్నాయి. దీనికోసం నిష్పాక్షికంగా దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేశాయి.

English summary
The leaders of 16 opposition parties on Thursday said that they will boycott President Ram Nath Kovind's address to both House of Parliament over farm laws. The President will address both Houses of Parliament on the first day of the Budget session beginning on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X