వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ మూడు చట్టాలు.. మరణ శాసనాలు -కేంద్రంపై కేజ్రీవాల్ గుస్సా -రైతులతో ఢిల్లీ సీఎం భేటీ

|
Google Oneindia TeluguNews

వ్యవసాయ రంగంలో కీలక సంస్కరణలంటూ కేంద్ర సర్కారు తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు నిజానికి రైతుల పాలిట మరణశాసనాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. నూతన సాగు చట్టాలతో సేద్యం క్రమంగా కొద్ది మంది కార్పొరేట్ల గుప్పిట్లోకి వెళ్లిపోతుందన్నారు. నిరసనల్లో పాల్గొంటోన్న పలువురు యూపీ రైతులతో కేజ్రీవాల్ ఢిల్లీ విధానసభలో ఆదివారం భేటీ అయ్యారు.

Recommended Video

#PMModi On Private Sector వ్యవసాయ చట్టాలు, ప్రైవేటీకరణపై ప్రధాని సుదీర్ఘ ప్రసంగం..!!

 ys sharmilaతో టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే కొడుకు భేటీపై చర్చ -4పదవులున్న కుటుంబం -విజయమ్మ చక్రం! ys sharmilaతో టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే కొడుకు భేటీపై చర్చ -4పదవులున్న కుటుంబం -విజయమ్మ చక్రం!

రైతులతో సమావేశం అనంతరం సీఎం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ, 'మూడు నల్ల చట్టాల'పై వెస్ట్రన్ యూపీ రైతులతో సమగ్ర చర్చలు జరిపామని చెప్పారు. కొత్త సాగు చట్టాలు రైతుల పాలిటి మరణ దండన ఉత్తర్వులనీ, ఈ చట్టాలతో సేద్యం క్రమంగా కొద్ది మంది కార్పొరేట్ల గుప్పిట్లోకి వెళ్లిపోతుందని అన్నారు. ఈనెల 28న మీరట్‌లో 'కిసాన్ పంచాయత్' జరుగనుందని, అక్కడ ఈ చట్టాలపై చర్చిస్తామని చెప్పారు. సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తామని చెప్పారు.

farm laws are like death warrant says Delhi cm Kejriwal after meeting protesting farmers

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా రైతులు చేస్తోన్న నిరసనలు ఆదివారం నాటికి 88వ రోజు పూర్తయింది. రైతు ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా విస్తరిస్తామంటోన్న సంఘాలు ఇప్పటికే అనేక కార్యక్రమాలకు పిలుపునివ్వడం తెలిసిందే.

Viral Video: నగ్నంగా ఏనుగుపై పోజులు -టెన్నిస్ లెజెండ్ కూతురి నిర్వాకం -విషాదకర ఘటనగా..Viral Video: నగ్నంగా ఏనుగుపై పోజులు -టెన్నిస్ లెజెండ్ కూతురి నిర్వాకం -విషాదకర ఘటనగా..

ఢిల్లీ సీఎంను కలిసిన తర్వాత రాష్ట్రీయ జాట్ మహాసంఘ్ ప్రతినిధులు మీడియాతో మాట్లడుతూ, కనీస మద్దతు ధరపై చట్టం తీసుకురావడంతోపాటు, స్వామినాథన్ నివేదికలోని సిఫారసులను యథాతథంగా కేంద్రం అమలు చేయాలని, మూడు సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని, తమ డిమాండ్లు నెరవేరేంత వరకూ రైతులు ఢిల్లీ సరిహద్దులను వీడబోరని హెచ్చరించారు.

English summary
The three farm laws passed by the Centre are "death warrants" for farmers, Delhi Chief Minister Arvind Kejriwal said on sunday, shortly after meeting a delegation of farmer leaders from western Uttar Pradesh. "A detailed discussion took place with farmers from western UP over the three black laws. These laws are like a death warrant for farmers. If these laws are implemented, farming will go into the hands of a few corporates," news agency ANI quoted the Delhi Chief Minister as saying.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X