వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పట్టు సడలించని రైతులు -ఇంకొద్ది గంటల్లో కేంద్రంతో చర్చలు -అమిత్ షా కీలక మంతనాలు

|
Google Oneindia TeluguNews

వ్యవసాయ రంగంలో సంస్కరణల పేరుతో కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాలకు వ్యతిరేకంగా దేశరాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తోన్న నిరసనలు మంగళవారంతో 34వ రోజుకు చేరాయి. ఎముకలు కొరికే చలిలోనూ రోడ్లపైనే మొండిగా బైఠాయించిన రైతులు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. సమస్య పరిష్కారం దిశగా కేంద్ర ప్రభుత్వం.. రైతు సంఘాల నేతలతో బుధవారం చర్చలు జరుపనుంది. అయితే..

ఏపీలో మరో దారుణం: రామతీర్థం ఆలయ విధ్వంసం -జీసస్ విగ్రహం తల నరికితే? అంటూ జగన్‌పై ఆగ్రహాంఏపీలో మరో దారుణం: రామతీర్థం ఆలయ విధ్వంసం -జీసస్ విగ్రహం తల నరికితే? అంటూ జగన్‌పై ఆగ్రహాం

కేంద్రం-రైతుల మధ్య ఆరో దఫా చర్చలకు ఢిల్లీలోని విజ్ణాన్ భవన్ వేదికగా ఉండనుంది. బుధవారం మధ్యాహ్నం జరుగనున్న చర్చలకు సంబంధించి కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శికి రైతు సంఘాల జేఏసీ మంగళవారం ఒక లేఖ రాసింది. తాము చేసిన నాలుగు కీలక ప్రతిపాదనలకు కేంద్రం అంగీకరించాలని రైతులు డిమాండ్ చేశారు.

farm laws:Farmers took Hard Line on Talks; Amit Shah Holds Meet With Tomar, Goya

కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేసే దిశగా విధానాల రూపకల్పన, పంటకు కనీస మద్దతు ధర హామీకి చట్టబద్దత, ఢిల్లీలో గాలి నాణ్యత ఆర్డినెన్స్ లో రైతులకు మినహాయింపు, విద్యుత్ బిల్లు 2020 ఉపసంహరణ అనే నాలుగు ప్రతిపాదనల విషయంలో తాము పట్టు సడలించబోమని రైతు సంఘాలు స్పష్టం చేశాయి. దీంతో బుధవారం నాటి చర్చల్లో ఫలితం సానుకూలంగా వస్తుందా? రాదా? అనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు..

సీఎం కేసీఆర్ మరో భారీ బాంబు -ఉద్యోగుల దిమ్మతిరిగేలా న్యూ ఇయర్ గిఫ్ట్ -లాక్‌డౌన్ నష్టాన్ని భరిస్తూ..సీఎం కేసీఆర్ మరో భారీ బాంబు -ఉద్యోగుల దిమ్మతిరిగేలా న్యూ ఇయర్ గిఫ్ట్ -లాక్‌డౌన్ నష్టాన్ని భరిస్తూ..

రైతు సంఘాల నేతలతో కేంద్ర ప్రభుత్వం బుధవారం చర్చలు జరపనున్న నేపథ్యంలో మంగళవారం రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక మంతనాలు చేశారు. వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌, వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌తో సుమారు రెండు గంటలపాటు షా భేటీ అయ్యారు. వ్యవసాయ చట్టాలపై కేంద్రం వాదన, రైతుల డిమాండ్లపై వీరు చర్చించినట్లు తెలుస్తోంది.

English summary
Protesting farmer unions on Tuesday wrote to the Centre on the talks scheduled between the two sides on Wednesday, saying the discussion will only be on the modalities of repealing the three legislation and giving a legal guarantee on the MSP. Union ministers Narendra Singh Tomar and Piyush Goyal, meanwhile, met senior BJP leader and Home Minister Amit Shah on the eve of the talks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X