వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మూడు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం: ముగిసిన ప్రక్రియ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశంలో ఇక మూడు వ్యవసాయ చట్టాలు ముగిసిన అధ్యయంగా మారాయి. బుధవారం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్.. మూడు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుకు ఆమోద ముద్ర వేశారు. నవంబర్ 29నే పార్లమెంటులోని లోక్‌సభ, రాజ్యసభలోనూ ఈ రద్దు బిల్లుకు ఆమోదం లభించిన విషయం తెలిసిందే. తాజాగా, రాష్ట్రపతి ఆమోదం కూడా లభించడంతో మూడు వ్యవసాయ చట్టాలు రద్దు ప్రక్రియ పూర్తయింది.

వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు, 2021, పంటల అమ్మకం, ధర, నిల్వకు సంబంధించిన నిబంధనలను సులభతరం చేయడానికి గత సంవత్సరం ఆమోదించిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరింది, దీనిని లోక్‌సభ నిమిషాల్లో ఆమోదించింది, ఆ తర్వాత రాజ్యసభలో ప్రవేశపెట్టబడింది. రాజ్యసభలోనూ వాయిస్ ఓటింగ్ ద్వారా ఆమోదించబడింది.

Farm Laws Repeal Act 2021: President Ram Nath Kovind Approves Bill To Cancel Three Agricultural Laws

ధరల భరోసా, వ్యవసాయ సేవల చట్టం, 2020పై రైతుల (సాధికారత, రక్షణ) ఒప్పందం, నిత్యావసర వస్తువుల (సవరణ) చట్టం, 2020, రైతుల ఉత్పత్తి వాణిజ్యం, వాణిజ్య (ప్రోత్సాహం, సులభతరం) చట్టం, 2020.. రైతుల్లో భారీ గందరగోళాన్ని రేకెత్తించాయి. ప్రత్యేకించి పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రైతులు గత ఏడాది కాలంగా నిరసనలు కొనసాగిస్తున్నారు.

ఇదిలావుండగా, వ్యవసాయ చట్టాలపై జరిగిన ఆందోళనలో మరణించిన రైతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ. 5 కోట్లు పరిహారంగా అందించాలని, కనీస మద్దతు ధర కోసం చట్టపరమైన హామీతో సహా రైతుల ఇతర డిమాండ్లను కూడా ఆమోదించాలని కాంగ్రెస్ నాయకుడు మనీష్ తివారీ బుధవారం డిమాండ్ చేశారు.

Recommended Video

Bigg Boss Telugu 5 : Analysis On Shannu & Siri, Manas & Pinky Tracks || Oneindia Telugu

కాగా, ప్రధాని నరేంద్ర మోడీ నవంబర్ 19న జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.

English summary
Farm Laws Repeal Act 2021: President Ram Nath Kovind Approves Bill To Cancel Three Agricultural Laws.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X