• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మోదీ పాలనకు 7ఏళ్లు: నేడు బ్లాక్ డే -రైతు ఉద్యమానికి 6నెలల సందర్భంగా దేశమంతటా నల్లజెండాలతో నిరసనలు

|

సాగు చట్టాలకు వ్యతిరేకంగా మోదీ సర్కారుపై పోరాటంలో కరోనా విలయాన్ని సైతం లెక్కచేయకుండా ఉద్యమాన్ని కొనసాగిస్తున్న రైతులు కీలక మైలురాయిని చేరారు. వ్యవసాయ రంగంలో సంస్కరణ పేరుతో కేంద్రం తీసుకొచ్చిన మూడు వివాదాస్పద చట్టాలకు వ్యతిరేకంగా రైతాంగం చేస్తోన్న నిరసనలు బుధవారం (మే 26) నాటికి ఆరు నెలలు పూర్తయ్యాయి. మరోవైపు ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 7ఏళ్ల పాలనను పూర్తిచేసుకున్న రోజు కూడా ఇవాళే. ఈ రెండు సందర్భాల నేపథ్యంలో రైతు సంఘాల ఉమ్మడి వేదిక సంయుక్త కిసాన్ మోర్ఛా(ఎస్కేఎం) ఇవాళ బ్లాక్ డేను పాటిస్తున్నది.

భారత్‌లో కరోనా: భారీగా మరణాలు -నిన్ని 4,157 మంది బలి, తగ్గిన వైరస్ వ్యాప్తి, కొత్తగా 2.08లక్షల కేసులుభారత్‌లో కరోనా: భారీగా మరణాలు -నిన్ని 4,157 మంది బలి, తగ్గిన వైరస్ వ్యాప్తి, కొత్తగా 2.08లక్షల కేసులు

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండు చేస్తూ ఢిల్లీ శివారుల్లో ఆందోళన చేపట్టి ఆరు నెలలు పూర్తయిన సందర్భంగా బుధవారం రైతులు బ్లాక్‌ డే పాటిస్తున్నారు. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ సహా ఉత్తరాదిలోని అన్ని రాష్ట్రాల్లో రైతులు తమ ఇళ్ల ముందు నల్ల జెండాలు ఎగరేసి నిరసనలు తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల్లోనూ చాలా చోట్ల నల్లజెండాల ఎగురవేత కొనసాగింది.

 farm laws stir: No march to Delhi says leaders, as farmers observe ‘Black Day today

''బుధవారం బుద్ధ పూర్ణిమ పర్వదినం. సమాజంలో సత్యం, అహింసలు కరవవుతున్నాయి. ఈ ప్రధాన విలువల పునరుద్ధరణ జరిగేలా పండగను జరుపుకోవాలి'' అని సంయుక్త కిసాన్ మోర్ఛా పిలుపునిచ్చింది. కాంగ్రెస్‌ నేత నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ పటియాలాలోని తన ఇంటిపై నల్లజెండా ఎగురవేశారు. కాంగ్రెస్, అకాలీదళ్ నేతలు సైతం ఈ కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు.

చిన్నపాటి సునామీలా Cyclone Yaas -తీరాన్ని తాకిన తుపాను -రెండు గంటలు భారీ విలయం -videosచిన్నపాటి సునామీలా Cyclone Yaas -తీరాన్ని తాకిన తుపాను -రెండు గంటలు భారీ విలయం -videos

  Telangana : ధాన్యం కొనుగోలు సెక్టార్లని తనిఖీ చేసిన మంత్రి హరీష్ రావు!!

  రైతు ఉద్యమానికి ఆరు నెలలు, మోదీ పాలనకు ఏడేళ్లు సందర్భంగా రైతులు ఇవాళ బ్లాక్ డే జరుపుతుండటంతో కేంద్రం, బీజేపీ పాలిత రాష్ట్రాలు అలెర్ట్ అయ్యాయి. నిరసనకారులు లాక్‌డౌన్‌ నిబంధనలను పాటించాలని, ఎక్కడా గుంపులుగా చేరకూడదని రైతులకు ఢిల్లీ పోలీసులు సూచించారు. బ్లాక్ డే సందర్భంగా రైతులు కవాతుగా ఢిల్లీకి చేరబోతున్నారనే ప్రచారాన్ని బీకేయూ నేత రాకేశ్ టికాయత్ తోసిపుచ్చారు. చలో ఢిల్లీ పిలుపు ఇవ్వలేదని, రైతులు ఎక్కడున్నవారు అక్కడే నల్లజెండాలతో నిరసనలు తెలపాలని ఆయన కోరారు. మరోవైపు, కొవిడ్‌ నిబంధనలకు విరుద్ధంగా రైతులు సరిహద్దుల్లో ఆందోళన చేస్తుండడంపై దిల్లీ, హరియాణా, ఉత్తర్‌ ప్రదేశ్‌ ప్రభుత్వాలకు జాతీయ మానవ హక్కుల కమిషన్‌ నోటీసులు పంపించింది.

  English summary
  Samkyukt Kisan Morcha (SKM), an umbrella body of protesting unions, observing wednesday, May 26 as 'Black Day' to mark the completion of six months. Bharatiya Kisan Union (BKU) leader Rakesh Tikait said on Wednesday farmers observing a 'Black Day' to mark six months of the agitation against the three central agricultural laws will not march to Delhi.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X