వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్లేమ్ గేమ్ ఆపేయండి: రాజకీయ పార్టీలపై ఘాటుగా షారుక్‌ఖాన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ చేపట్టిన ర్యాలీలో రాజస్థాన్ రైతు గజేంద్ర సింగ్ ఆత్మహత్య చేసుకోవడంపై బాలీవుడ్ నటుడు, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు యజమాని షారుక్ ఖాన్ గురువారం తీవ్రంగా స్పందించారు.

ఆయన భారతీయ జనతా పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ తదితర రాజకీయ పార్టీల పైన నిప్పులు చెరిగారు. రాజకీయ నాయకుల పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. షారుక్ ఖాన్ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌లో స్పందించారు.

'ఎవరు కూడా తమకు తాము చావాలని కోరుకోరు. ఏదైనా సమస్యలు ఎదురైతేనే అలాంటి చర్యలకు పాల్పడుతారు. ఇలాంటి చర్యలు అడ్డుకునేందుకు చర్యలు తీసుకోండి. వారి బాధలను గుర్తించండి. అంతేకానీ, దీని నుండి లబ్ది పొందే బ్లేమ్ గేమ్ అపేయండి' అని ఘాటుగా స్పందించారు. షారుక్ ఖాన్ ట్వీట్ ఎన్నో రీట్వీట్స్ వచ్చాయి. దీనిపై చాలామంది స్పందించారు.

 Farmer commits suicide at Kejriwal's rally: Now Shahrukh Khan lashes out at AAP, BJP and others

కేసు బుక్ చేసిన ఢిల్లీ పోలీసులు

రైతు గజేంద్ర సింగ్ ఆత్మహత్య పైన ఢిల్లీ పోలీసులు కేసు బుక్ చేశారు. వారు గుర్తు గుర్తు తెలియని వ్యక్తుల పైన కేసు నమోదు చేశారు. ఢిల్లీ పోలీసులు గజేంద్ర సింగ్‌ను కాపాడేందుకు ప్రయత్నించలేదని ఏఏపీ బుధవారం ఆరోపించింది. మరోవైపు, ఏఏపీ వాళ్లే పోలీసులకు సహకరించలేదని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.

ఏఏపీ సహకరించడం లేదు: ఢిల్లీ పోలీసులు

రైతు గజేంద్ర సింగ్ ఆత్మహత్య నేపథ్యంలో.. ర్యాలీ సమయంలో ఏఏపీ తమకు సహకరించలేదని ఢిల్లీ పోలీసులు ఆరోపిస్తున్నారు. ర్యాలీ ప్రాంతం చాలా చిన్నగా ఉందని, ఈ నేపథ్యంలో అక్కడకు తరలి వచ్చిన ఏఏపీ పార్టీ క్యాడర్‌ను కంట్రోల్ చేసేందుకు కష్టమైందని చెబుతున్నారు.

English summary
While all political parties, especially Aam Aadmi Party (AAP) was busy in putting the onus on others in connection with the farmer suicide case, Bollywood superstar Shahrukh Khan (SRK) lashed out at all politicians.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X