వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఊపిరితీసిన ఆకాల వర్షం: అడవీలో చెట్టుకు.. ఆరురోజులుగా రైతు...

|
Google Oneindia TeluguNews

ఆకాల వర్షం ఓ రైతు ఊపిరి తీసేసింది. ఆరుగాలం పండించిన పంట నట్టేట మునగడంతో.. చేసిన అప్పులు తీర్చని పరిస్థితి. ఇక తాను బతకడం ఎందుకు అని ఓ అన్నదాత బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే అతను చనిపోయిన ఆరురోజులకు మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.

మహారాష్ట్రలోని అకోలా జిల్లాకు చెందిన 62 ఏళ్ల గిరిజన రైతు తులసీరాం షిండే సోయాబిన్ పంట వర్షానికి తుడుచుకుపెట్టుకుపోయింది. చేతికొచ్చిన పంట నష్టపోవడంతో ఏం చేయాలో తెలియలేదు. దీంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. సమస్యకు చావే పరిష్కారం అని భావించాడు. గత ఆరురోజుల క్రితం ఇంటినుంచి వెళ్లిపోయాడు.

Farmer kills self, body remains hanging from tree for 6 days

ఆ రోజు, మరునాడు.. చూసి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ అతని ఆచూకీ మంగళవారం లభించింది. ఆ రైతు నిర్జీవంగా కనిపించడంతో ఆ కుటుంబం బోరున విలవిస్తున్నారు. తమ ఇంటినుంచి 70 కిలోమీటర్ల దూరంలో గల అటవీలోకి వెళ్లాడు. అక్కడే ఓ చెట్టుకు ఉరేసుకున్నాడు. అతనిని అటవీ అధికారులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలికలను బట్టి అతను తులసీరాంగా గుర్తించారు. అతను స్వగ్రామం పింపల్ పోలి నుంచి తప్పిపోయినట్టు ఈ నెల 13వ తేదీన కేసు నమోదు చేసినట్టు తెలిపారు.

సోయాబిన్ పంటకు నష్టం రావడంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యుల చెప్తున్నారు. నాలుగు ఎకరాల్లో పంట వేశామని.. చేతికొచ్చే సమయంలో ఇలా జరిగిందన్నారు. ఇప్పటికే అప్పులు ఉండటం.. తాజాగా పంట నష్టపోవడంతో మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నారు. తులసీరాం మృతదేహం పోస్టుమార్టం కోసం తరలించామని.. నివేదికలో ఏం జరిగిందో తెలుస్తుందన్నారు.

English summary
62-year-old tribal farmer Tulsiram Shinde allegedly committed suicide by hanging from a tree in Maharashtra's Akola district, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X