వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రిపబ్లిక్ డే వాయెలెన్స్: పార్లమెంట్ మార్చ్ వాయిదా: రైతు సంఘాలు

|
Google Oneindia TeluguNews

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. అయితే ఘర్షణ జరగడంతో సర్వత్రా చర్చకు దారితీసింది. ఎర్రకోట ముట్టడి హింసాత్మకంగా మారడంతో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రైతు ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్టు రెండు సంఘాలు ప్రకటించి గంటలైనా గడవకముందే, ఫిబ్రవరి ఒకటో తేదీన తలపెట్టిన పార్లమెంట్ మార్చ్‌ను వాయిదా వేస్తున్నట్టు భారతీయ కిసాన్ యూనియన్ (ఆర్) తెలిపింది.

 farmer unions postpone march to parliament

సింఘ్ సరిహద్దు వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీకేయూ (ఆర్) నేత బల్బీర్ ఎస్ రాజేవాల్ మాట్లాడారు. ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ర్యాలీలకు బదులుగా ఈ నెల 30న ఒక రోజు నిరాహార దీక్ష చేస్తామని చెప్పారు. ర్యాలీలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ర్యాలీలోకి అసాంఘిక శక్తులు చొరబడడం వల్లే హింసాత్మకంగా మారిందని అభిప్రాయపడ్డారు. అంతేకాదు దీని వెనక ప్రభుత్వ హస్తం ఉందని మరోమారు ఆరోపించారు.

Recommended Video

Andhra Pradesh : AP High Court Postponed Hearing Of SEC Nimmagadda House Motion Petition

నిన్న జరిగిన ఘర్షణలో 394 మంది పోలీసులు గాయపడగా.. చాలా మంది ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారని ఢిల్లీ సీపీ వివరించారు. 30 పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయని.. వారిని నిలువరించేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించామని తెలిపారు. దాడి చేశారని భావిస్తోన్న 19 మందిని అరెస్ట్ చేశామని వివరించారు.

English summary
farmer unions postpone march to parliament due to republic day violence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X