వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాగు చట్టాలపై మరో ట్విస్ట్‌- సుప్రీంకోర్టు కమిటీ ఏర్పాటును తోసిపుచ్చిన రైతులు

|
Google Oneindia TeluguNews

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రెండు నెలలుగా ఆందోళనలు చేస్తున్న రైతు సంఘాలు సుప్రీంకోర్టు తాజా ప్రతిపాదనలపైనా పెదవి విరుస్తున్నాయి. అత్యున్నత స్దాయి కమిటీ ఏర్పాటు ద్వారా కేంద్రంతో చర్చల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు సుప్రీంకోర్టు చేసిన ప్రతిపాదననూ రైతు సంఘాలు తోసిపుచ్చాయి.

వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా పోతుల సునీత-బీఫారం ఇచ్చిన సీఎం జగన్- కొత్త రాజకీయంవైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా పోతుల సునీత-బీఫారం ఇచ్చిన సీఎం జగన్- కొత్త రాజకీయం

వ్యవసాయ చట్టాలపై కేంద్రం వైఖరిలో ఎలాంటి మార్పూ లేనప్పుడు సుప్రీంకోర్టు కమిటీలతో ఏం ప్రయోజనం ఉంటుందని రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకోవడం మినహా మరో డిమాండ్‌ తమ వద్ద లేదని, కేంద్రం కూడా ఈ చట్టాలను వెనక్కి తీసుకునేందుకు సిద్ధంగా లేదని, అటువంటప్పుడు కమిటీలతో కాలయాపన మినహా పరిష్కారం దొరకదని రైతు సంఘాలు స్పష్టం చేశాయి. ఈ మేరకు సుప్రీంకోర్టు చేసిన ప్రతిపాదనను రైతు సంఘాలు తిరస్కరించాయి.

farmer unions reject suggestion of sc appointed committee ahead of verdict

వ్యవసాయ చట్టాల అమలును నిలిపేస్తూ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్న రైతు సంఘాలు.. కొత్తగా ఏర్పాటు చేసే కమిటీ ముందు తమ డిమాండ్లు వినిపించాలని కోర్టు చేస్తున్న ప్రతిపాదనపై మాత్రం విముఖత వ్యక్తం చేస్తున్నాయి. అంతకుముందు సుప్రీంకోర్టులో రైతుల తరఫున వాదిస్తున్న న్యాయవాదులు సుప్రీంకోర్టు ప్రతిపాదనను అన్నదాతల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. దీంతో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసే కమిటీ ద్వారా పరిష్కారం లభిస్తుందని భావించిన వారికి రైతులు తమ నిర్ణయం తేల్చిచెప్పారు. వ్యవసాయ చట్టాలపై సుప్రీంకోర్టు ఇవాళ కీలక తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో రైతుల నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.

Recommended Video

రాజేష్ మగాడంటే నమ్మేదే లేదు.. తొలిరాత్రే చెప్పాడు..!

English summary
Farmers groups have rejected the Supreme Court’s suggestion to appoint a committee to resolve the ongoing crisis over three farm reform laws. They say the Centre’s attitude in court on Monday makes it clear that the government will not agree to discuss farmers’ demand for repeal of the three laws in such a committee.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X