వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మా రైతులు ఆహార సైనికులు .. రైతులకు మద్దతుగా బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా విజ్ఞప్తి

|
Google Oneindia TeluguNews

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలపై ఢిల్లీలో ఆందోళనలు కొనసాగిస్తున్న రైతులకు మద్దతుగా దేశంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు మద్దతు ప్రకటిస్తున్నారు. రైతుల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని తేల్చి చెబుతున్నారు. తాజాగా బాలీవుడ్ నటీమణి ప్రియాంక చోప్రా రైతులు ఆహార సైనికులు అంటూ దిల్జీత్ దోసంజా చేసిన ట్వీట్ షేర్ చేసి తన మద్దతు ప్రకటించారు.

7వ రోజు ఢిల్లీ బోర్డర్ లో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు: ఢిల్లీ -నోయిడా బోర్డర్ దిగ్బంధించిన రైతులు 7వ రోజు ఢిల్లీ బోర్డర్ లో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు: ఢిల్లీ -నోయిడా బోర్డర్ దిగ్బంధించిన రైతులు

రైతుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి.. దిల్జీత్ ట్వీట్ షేర్ చేసిన ప్రియాంకా చోప్రా

రైతుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ప్రియాంక చోప్రా దిల్జిత్ దోసాంజ్ చేసిన ట్వీట్ కు మద్దతుగా ట్వీట్ చేశారు. బాలీవుడ్ నటీమణి ప్రియాంక చోప్రా జోనాస్ రైతుల నిరసనల ఈ విషయంలో గాయకుడు-నటుడు దిల్జిత్ దోసాంజ్ చేసిన ట్వీట్‌ లో రైతుల సమస్యలను పరిష్కరించాలని పేర్కొన్నారు . కేంద్రం యొక్క కొత్త వ్యవసాయ చట్టాల గురించి వారి ఆందోళనలను అత్యవసరంగా పరిష్కరించాలని పిలుపునిచ్చారు.

వారి భయాలు తొలగించి సమస్య పరిష్కరించండి : బాలీవుడ్ నటి ప్రియాంక విజ్ఞప్తి

వారి భయాలు తొలగించి సమస్య పరిష్కరించండి : బాలీవుడ్ నటి ప్రియాంక విజ్ఞప్తి

మా రైతులు భారతదేశ ఆహార సైనికులు. వారి భయాలు తీర్చాల్సిన అవసరం ఉంది. వారి ఆశలను నెరవేర్చాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి చెందుతున్న ప్రజాస్వామ్యంగా, ఈ సంక్షోభాలు సిక్ ఉద్యమం కంటే త్వరగా పరిష్కరించబడతాయని మేము నిర్ధారించుకోవాలి అని ఆమె ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఏక తాటి మీదికి వచ్చి ఉద్యమిస్తున్న రైతుల నిరసనలను ప్రదర్శిస్తూ పంజాబీలో నటుడు గాయకుడు అయిన దోసంజ్ ట్వీట్ ను షేర్ చేశారు.

ప్రభుత్వంతో, రైతులకు జరుగుతున్న చర్చలలో ప్రతిష్టంభన మధ్య రైతులకు అనుకూలంగా ప్రియాంక చోప్రా చేసిన ట్వీట్, సెలబ్రిటీలు భారతదేశంలో సామాజిక సమస్యలపై స్పందిస్తున్నారని చెప్పడానికి ఒక ఉదాహరణ.

 రేపే భారత్ బంద్ ... రైతుల పోరాటానికి మద్దతుగా వివిధ దేశాల రైతులు

రేపే భారత్ బంద్ ... రైతుల పోరాటానికి మద్దతుగా వివిధ దేశాల రైతులు


కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ శివార్లలో వేలాది మంది రైతులు నిరసన వ్యక్తం చేయడంతో శనివారం జరిగిన చివరి రౌండ్ చర్చలలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది . మరోమారు చర్చలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో బుధవారం మరోసారి సమావేశం కానుంది. అయితే రైతులు రేపు తమ పోరాటానికి మద్దతు తెలపాలని భారత్ బంద్ కు పిలుపునిచ్చారు. ఆందోళనను ఉదృతం చేశారు. రైతుల ఆందోళనకు ఇతర దేశాల రైతుల నుండి కూడా మద్దతు లభిస్తుండడం గమనార్హం. ఈ సమయంలో బాలీవుడ్ లో ప్రముఖులు కూడా రైతుల ఆందోళన పై తమ గళాన్ని వినిపిస్తున్నారు. తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

English summary
Actor Priyanka Chopra Jonas shared her take on the farmers' protests on Sunday, endorsing a tweet by singer-actor Diljit Dosanjh and calling for their concerns about the centre's new agricultural laws to be addressed urgently."Our farmers are India's Food Soldiers. Their fears need to be allayed. Their hopes need to be met. As a thriving democracy, we must ensure that this crises is resolved sooner than later (sic)," she wrote on Twitter, quoting a tweet by Mr Dosanjh in Punjabi showcasing the secular tone of the farmers' movement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X