వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రిపబ్లిక్ డే: ట్రాక్టర్ ర్యాలీకి రూట్ మ్యాప్.. పరేడ్ నేపథ్యంలో ఆంక్షలు.. పబ్లిక్‌కు కూడా..

|
Google Oneindia TeluguNews

72వ గణతంత్ర దినోత్సవానికి దేశం ముస్తాబవుతోంది. ఊరు, వాడ, పల్లె, పట్టణంలో మువ్వన్నెల జెండా ఎగరబోతోంది. కరోనా మహమ్మరి నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే సెలబ్రేషన్స్ జరుపుకోనున్నారు. అయితే వివాదాస్పద వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతుల చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీతో హై టెన్షన్ నెలకొంది.

కిసాన్ మజ్దూర్ కమిటీ ఆధ్వర్యంలో ట్రాక్టర్ ర్యాలీ జరగనుంది. ఇందులో సంయుక్త్ కిసాన్ మోర్చా కూడా పాల్గొనబోతోంది. ఢిల్లీ ఔటర్ రింగ్ రోడ్ గుండా ర్యాలీ కొనసాగగా.. సరిహద్దుల్లో గల మూడు లోకేషన్లలో కలుసుకొంటారు. అయితే ర్యాలీలో సంఘ విద్రోహ శక్తులు చెరే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు. శుక్రవారం ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిని విచారిస్తే.. ర్యాలీకి అంతరాయం కలిగించి.. నిరసనను భగ్నం చేయడానిక శిక్షణ కూడా తీసుకున్నానని చెప్పడం విశేషం.

 Farmers Group Plans To Veer From Agreed Upon Route For Tractor Rally

దీంతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటలకు రాజ్ పథ్ వద్ద సాంప్రదాయ పరేడ్ జరగనుంది. రింగ్ రోడ్ నుంచి మూడు ప్రాంతాల నుంచి ఢిల్లీకి చేరుకోనుంది. ఈ క్రమంలో పరేడ్ ముగిసేవరకు ట్రాక్టర్ ర్యాలీ చేరుకోవద్దని పోలీసులు స్పష్టంచేశారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీ పోలీసులు ఆంక్షలు విధించారు. జాతీయ రహదారి 44ను టూ వీలర్స్ ఉపయోగించొద్దు అని స్పస్టంచేశారు. సింగు, టిక్రీ రహదారి/ సరిహద్దుల్లో కూడా వెళ్లొద్దని తేల్చిచెప్పారు.

ఇతర రాష్ట్రాల్లో రైతుల నిరసనలు కంటిన్యూ చేసుకోవచ్చు అని తెలిపారు. ముంబైలో ఆజాద్ మైదాన్ వద్ద రైతులను పోలీసులు నిలువరించారు. వారు రాజ్ భవన్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించడంతో.. అడ్డుకోవాల్సి వచ్చింది.

English summary
Kisan Mazdoor Sangharsh Committee -- declared that it would not stick to the route agreed upon by the Samyukt Kisan Morcha and the police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X