వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీడియో: ట్రాక్టర్లతో జెండాను ఎగుర వేసిన వైనం: ఆ రైతుల జెండా వందనం అద్భుతం!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవ సంరంభాన్ని పురస్కరించుకుని ఏ భవనం మీద గానీ, లేక స్తంభానికి గానీ మువ్వన్నెల పతాకాన్ని కట్టి ఎగురవేయడాన్ని మనం చూస్తుంటాం. లేదంటే- కార్లు, బస్సులు, ఆటోలు, ద్విచక్ర వాహనాలకు త్రివర్ణ పతకాన్ని కట్టి, ఈ సర్వ సత్తాక దేశంపై ఉన్న అభిమానాన్ని చాటుకుంటుంటారు ప్రజలు. వాటన్నింటి కంటే భిన్నమైన దృశ్యం ఇది. అనూహ్యమే కాదు.. అద్భుతం అని కూడా అనదగ్గ సన్నివేశం. ఇద్దరు రైతులు తమ ట్రాక్టర్లతో జెండాను ఎగురవేసిన ఆ ఘటన అద్భుతమని కీర్తిస్తున్నారు నెటిజన్లు, ట్విట్టరెటీలు. జైహింద్ అంటూ ఆ ఇద్దరు రైతులను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. పంజాబ్ లో చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది.

ఇద్దరు రైతులు తాము రోజూ వ్యవసాయం చేసే ట్రాక్టర్లను ఎదురెదురుగా తీసుకొచ్చారు. జాతీయ పతాకాన్ని కట్టిన ఓ కర్రను మరో వ్యక్తి ఆ రెండు ట్రాక్టర్ల మధ్య ఉంచాడు. ఆ వెంటనే- ఆ ఇద్దరు రైతులు ట్రాక్టర్ల ముందు భాగాన్ని గాల్లోకి లేపారు. వాటితో పాటు జెండా కూడా గాల్లోకి లేచింది. అనంతరం ఆ రెండు ట్రాక్టర్లను గాల్లోనే చాలాసేపు నిలిపి ఉంచారు.

Farmers made Independence Day with tractors in the fields

ఆ రెండింటి మధ్య ఉన్న జెండా రెపరెపలాడుతూ కనిపించింది. ట్రాక్టర్ల చివరన నిల్చుని వారిద్దరూ సెల్యూట్ చేస్తూ కనపించారు. దీన్నంతటినీ మొబైల్ కెమెరాలో చిత్రీకరించారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో కాస్తా వైరల్ గా మారింది. రైతుల వినూత్నంగా చేసిన జెండా వందనం రోమాలు నిక్కబొడుచుకునేలా ఉందని నెటిజన్లు, ట్విట్టరెటీలు వ్యాఖ్యానిస్తున్నారు. వారి సాహసానికి సలాం చేస్తున్నారు.

English summary
Two farmers belonging from mostly Punjab was did stunt with tractors along with National Flag on the occasion on Independence Day. The both farmers raised the National Flag along with tractors in the fields and hold them such a long time. Netizens and Twittereties applause the dare ness of the farmers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X