• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఎర్రకోట హింస కేంద్రం కుట్రే -బ్రిటిషర్లు కూడా రైతులను దేశద్రోహులు అనలేదు: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ధ్వజం

|

వ్యవసాయ రంగంలో సంస్కరణల పేరుతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన నిరసనలు ఆదివారం నాటికి 95వ రోజుకు చేరాయి. రిపబ్లిక్ డే నాడు ఎర్రకోట, తదితర ప్రాంతాల్లో హింస తర్వాత రైతు సంఘాలతో కేంద్రం చర్చల ప్రక్రియ నిలిచిపోయింది. ఉద్యమాన్ని దేశ్యాప్తం చేస్తామంటోన్న సంఘాలు.. వివిధ రాష్ట్రాల్లో కిసాన్ పంచాయతీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో..

కూతురి మాటలకు, పీవీ బతికుంటే ఆత్మహత్య -సీపీఐ నారాయణ సంచలనం -ఎమ్మెల్సీ‌గా ప్రొఫెసర్ నాగేశ్వర్కూతురి మాటలకు, పీవీ బతికుంటే ఆత్మహత్య -సీపీఐ నారాయణ సంచలనం -ఎమ్మెల్సీ‌గా ప్రొఫెసర్ నాగేశ్వర్

ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో ఆదివారం జరిగిన కిసాన్ పంచాయితీలో ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పాల్గొన్నారు. రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశ రైతులను దేశద్రోహులని బ్రిటిషర్లు కూడా అనలేదని, అలాంటిది బీజేపీ నేతలు రైతులపై దేశద్రోహులుగా ముద్రవేశారని కేజ్రీవాల్ మండిపడ్డారు. ఎన్నో త్యాగాలతో దేశాన్ని ముందుకు సాగిస్తున్న రైతులను బీజేపీ అవమానిస్తోందని, నిందిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Farmers not traitors, Red Fort violence planned by Centre, says delhi cm Arvind Kejriwal

అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్టను చర్చకు పెట్టిన రిపబ్లిక్ డే హింసపైనా ఢిల్లీ సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎర్రకోట విధ్వంసం పూర్తిగా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర సర్కారు కుట్ర అని ఆరోపించారు. నాడు ఎర్రకోటకు వస్తున్న రైతులను కావాలనే బీజేపీ వాళ్లు తప్పుదారి పట్టించారని, అనుమతి లేని మార్గాల్లో వెళ్లాల్సిందిగా రైతులను దారి మళ్లించింది బీజేపీ నేతలే అని, ఢిల్లీలో దారులు తెలియకపోవడం వల్ల వాళ్లు చెప్పినట్టే రైతులు వెళ్లారని గుర్తుచేశారు. అంతేకాదు..

IPL 2021: టీఆర్ఎస్ యూటర్న్ -BCCIకి మంత్రి కేటీఆర్ అభ్యర్థన -Sunrisers Hyderabadకు షాక్?IPL 2021: టీఆర్ఎస్ యూటర్న్ -BCCIకి మంత్రి కేటీఆర్ అభ్యర్థన -Sunrisers Hyderabadకు షాక్?

ఎర్రకోటపై ఇతర జెండాలను ఎగురేసింది కూడా బీజేపీ కార్యకర్తలేనని, వాస్తవం ఇదైతే, మోదీ ప్రభుత్వం మాత్రం రైతులను దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేస్తోందని కేజ్రీవాల్ మండిపడ్డారు. బ్రిటిషర్ల కంటే కూడా కిరాతకంగా బీజేపీ తయారైందని, ఈ పరిణామాలకు మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు.

Farmers not traitors, Red Fort violence planned by Centre, says delhi cm Arvind Kejriwal
English summary
Delhi chief minister and Aam Aadmi Party (AAP) leader Arvind Kejriwal on Sunday accused the Centre of orchestrating the violence on Republic Day at Red Fort as he once again extended his support to the farmers agitating in the national capital against the three farm laws. "The Centre is behind the Red Fort violence, not the farmers. It misguided the farmers who did not know Delhi roads," Kejriwal said while addressing a 'Kisan Mahapanchayat' in Meerut.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X