• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Bharat Bandh:అంతటా మొదలు -రైలు, రోడ్డు రవాణాపై ఎఫెక్ట్ -అత్యవసర సేవలు తప్ప మిగతావన్నీ మూత

|

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వాపస్ తీసుకోవాలంటూ నాలుగు నెలలుగా నిరసనలు చేస్తోన్న రైతులు.. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు భారత్ బంద్ చేపట్టారు. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి బంద్ మొదలైంది. సాయంత్రం 6 గంటల ఇది కొనసాగుంది. భారత్ బంద్ కారణంగా ఇవాళ దేశంలో రైళ్లు, రోడ్డు వ్యవస్థపై ప్రభావం పడింది.

viral video: పాక్‌తో మోదీ స్నేహం వేళ -ఢిల్లీలో కిరాతక ఘటన -ఆ దేశాన్ని, ఓవైసీని తిట్టాలంటూ దాడిviral video: పాక్‌తో మోదీ స్నేహం వేళ -ఢిల్లీలో కిరాతక ఘటన -ఆ దేశాన్ని, ఓవైసీని తిట్టాలంటూ దాడి

ఎన్నికలు జరుగుతోన్న ఐదు రాష్ట్రాలుమినహా దేశవ్యాప్తంగా శుక్రవారం బంద్ కొనసాగుతుందని, దీనిని ప్రజలే విజయవంతం చేయాలని రైతు సంఘాల సమాఖ్య, సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎమ్‌) విజ్ఞప్తి చేశాయి. రోడ్డు, రైలు, రవాణా సేవలను నిలిపివేస్తామని, మార్కెట్లను స్తంభింపజేస్తామని రైతులు ఇదివరకే ప్రకటించిన దరిమిలా ప్రభుత్వం కూడా ఆ మేరకు అప్రమత్తమైంది.

Farmers protest Bharat Bandh today updates: Road and rail traffic likely to be hit, other details

కాగా, రైతుల నిరసనల్ని వ్యతిరేకిస్తోన్న ట్రేడర్లు భారత్ బంద్ కు తమ మద్దతు లేదని పేర్కొన్నారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) ఈ మేరకు ప్రకటన చేసింది. శుక్రవారం మార్కెట్లు తెరిచే ఉంచుతామని, చర్చల ద్వారానే చట్టాలపై ప్రతిష్ఠంభన వీడుతుందని, అందువల్ల సాగు చట్టాలపై చర్చలు జరపాలని ట్రేడర్ల సమాఖ్య నేత ప్రవీణ్‌ ఖండేల్‌వాల్‌ అన్నారు. ఇక

 కోర్టుల్లో షాక్‌లు, అయినా జగన్ సాహసం -మే6 నుంచే విశాఖ రాజధానిగా పాలన? -నేడు ఓర్వకల్లు ఎయిర్ పోర్టు షురూ కోర్టుల్లో షాక్‌లు, అయినా జగన్ సాహసం -మే6 నుంచే విశాఖ రాజధానిగా పాలన? -నేడు ఓర్వకల్లు ఎయిర్ పోర్టు షురూ

రైతు సంఘాలు తలపెట్టిన భారత్ బంద్ కు అన్ని కార్మిక, విద్యార్ధి, ఉద్యోగ సంఘాలు పూర్తిస్థాయి మద్దతు ప్రకటించాయి. ఉత్తర్ ప్రదేశ్, హరియాణా, పంజాబ్‌లో బంద్ ప్రభావం ఎక్కువగా ఉండనుంది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే భారత్ బంద్‌లో వైసీపీ, టీడీపీ, లెఫ్ట్ పార్టీలు, కాంగ్రెస్ పాల్గొంటున్నాయి. కాగా,

ప్రజలకు అసౌకర్యం కలగకుండా బంద్‌ను శాంతియుతంగా నిర్వహించాలని.. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని రైతు సంఘాలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ బస్సులు మధ్యాహ్నం 1 గంట వరకు డిపోలకు పరిమితమవుతున్నాయి. అయితే బంద్ సమయంలో అత్యవసర ఆరోగ్య సేవలన్నీ యథావిధిగా కొనసాగుతాయి.

English summary
Thousands of farmers are observing 'Bharat Bandh' today to mark completion of four months of their agitation against the central farm laws. The bandh, called by the Samyukta Kisan Morcha (SKM), will be observed till 6 pm. All roads and trains will be blocked and all services are expected to remain suspended, except for ambulance and other essential services.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X