వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైతుల చక్కా జామ్ తో మెట్రో రైల్ కార్పోరేషన్ అలెర్ట్ .. ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్ల మూసివేత

|
Google Oneindia TeluguNews

దేశ రాజధాని ఢిల్లీలో వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అన్నదాతలు ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే. గత డబ్భై రెండు రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతన్నలు దేశవ్యాప్తంగా రాస్తారోకోకు పిలుపునిచ్చారు. అన్నదాతలు తలపెట్టిన చక్కా జామ్ తో ఢిల్లీ పోలీసులు అలర్ట్ అయ్యారు .

ఒక పక్క ఢిల్లీలో చక్కా జామ్ ప్రభావం ఏమాత్రం ఉండదని, దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించడం లేదని రైతన్నలు చెబుతున్నప్పటికీ పోలీసులు భారీగా మోహరించారు .

 ఢిల్లీలో హై అలెర్ట్ : డ్రోన్స్ తో నిఘా, దుర్భేద్యమైన కోటని తలపిస్తూ ఢిల్లీలో భద్రత ఢిల్లీలో హై అలెర్ట్ : డ్రోన్స్ తో నిఘా, దుర్భేద్యమైన కోటని తలపిస్తూ ఢిల్లీలో భద్రత

 మూడు గంటల పాటు దేశ వ్యాప్త రహదారుల దిగ్బంధన

మూడు గంటల పాటు దేశ వ్యాప్త రహదారుల దిగ్బంధన

జాతీయ రహదారులు, రాష్ట్ర హైవేలను మాత్రమే దిగ్బంధిస్తామని , స్కూల్ బస్సులు, అంబులెన్సులు , ఇతర అత్యవసర వాహనాలను ఆపబోమని, ప్రజలతో గానీ అధికారులతో గానీ రైతులు ఘర్షణలకు దిగరాదని రైతు నేతలు పేర్కొన్నారు . ఈ ఆందోళన చాలా ప్రశాంతంగా సాగుతుందని చెప్పారు. మూడు గంటలకు ఆందోళనను విరమించే సమయంలో వాహనాల హారన్ లను ఒక నిమిషం పాటు మోగించి చక్కా జామ్ ముగిస్తామని 41 యూనియన్లకు నాయకత్వం వహిస్తున్న రైతుల సమైక్య వేదిక కిసాన్ సంయుక్త మోర్చా ఒక ప్రకటనలో పేర్కొంది.

చక్కా జామ్ సమయంలో ఢిల్లీ మెట్రో స్టేషన్ల మూసివేత .... మూసివేసిన స్టేషన్ల వివరాలివే

చక్కా జామ్ సమయంలో ఢిల్లీ మెట్రో స్టేషన్ల మూసివేత .... మూసివేసిన స్టేషన్ల వివరాలివే

అయినప్పటికీ ఢిల్లీలో చక్కా జామ్ నిర్వహించేది లేదని చెప్పినప్పటికీ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా ఢిల్లీలోని పలు మెట్రో రైల్వే స్టేషన్లను మూసివేశారు. చక్కా జామ్ నిర్వహించే సమయంలో ఎలాంటి అసాంఘిక చర్యలు చోటుచేసుకోకుండా ముందస్తు భద్రతగా లాల్ ఖిల్లా , జమా మసీద్, జన్ పథ్, సెంట్రల్ సెక్రటేరియట్, మండి హౌస్, ఐటిఓ, విశ్వవిద్యాలయ స్టేషన్, ఢిల్లీ గేట్ స్టేషన్ ల ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను మూసివేసినట్లుగా, ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ స్పష్టంచేసింది.

ఢిల్లీలో చక్కా జామ్ లేకున్నా పోలీసుల భద్రతపై రైతుల ఆసక్తికర వ్యాఖ్యలు

ఢిల్లీలో చక్కా జామ్ లేకున్నా పోలీసుల భద్రతపై రైతుల ఆసక్తికర వ్యాఖ్యలు

మధ్యాహ్నం 12 గంటల నుండి మూడు గంటల వరకు ఈ స్టేషన్లలో మూసివేత కొనసాగనుంది. రిపబ్లిక్ డే రోజు కిసాన్ పరేడ్ నేపథ్యంలో జరిగిన హింసను దృష్టిలో పెట్టుకొని ఢిల్లీ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలతో, దేశ రాజధానిలో పహారా కాస్తున్నారు.
ఢిల్లీలో చక్కా జామ్ చెయ్యటం లేదని చెప్పినప్పటికీ కొనసాగుతున్న పహారాపై రైతు నాయకులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు . తమ చక్కా జామ్ కంటే ముందే ఢిల్లీ రాజు పోలీసులతో సెక్యూరిటీ జామ్ చేశారని అంటున్నారు.

 సోషల్ మీడియాపై ఫోకస్ పెట్టిన ఢిల్లీ పోలీసులు

సోషల్ మీడియాపై ఫోకస్ పెట్టిన ఢిల్లీ పోలీసులు


ఇక మరో వైపు ఈ రోజు జరుగుతున్న చక్కా జామ్ నేపధ్యంలో సోషల్ మీడియా పోస్టులపై దృష్తి సారించారు పోలీసులు . సోషల్ మీడియాలో హింసను ప్రేరేపించే పోస్టులు పెడితే కేసులు పెట్టి ఉక్కుపాదం మోపాలని చూస్తున్నారు. సంఘ విద్రోహ శక్తులు ఇదే అదునుగా చెలరేగే అవకాశం ఉన్న నేపధ్యంలో నిఘా వ్యవస్థను కట్టుదిట్టం చేశారు .

English summary
The Delhi Metro Rail Corporation (DMRC) has closed the entry and exit gates at several metro stations, mainly in north and central Delhi, ahead of a three-hour "chakka jam" (road block) across the country by the protesting farmers. The entry and exit gates of Mandi House, ITO, Delhi Gate, Vishwavidyalaya, Lal Quila, Jama Masjid, Janpath and Central Secretariat are closed as a precautionary measure due to the protests against the new agriculture laws.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X